జొహానె్నస్‌బర్గ్, డిసెంబర్ 6: భారత బౌలింగ్‌లో వేగం కరవైందని దక్షిణాఫ్రికా యువ బ్యాట్స్‌మన్ క్వింటన్ డి కాక్ వ్యాఖ్యానించాడు. సొంత గడ్డపై, వేలాది మంది అభిమానులతోపాటు కుటుంబ సభ్యులు హాజరైన తొలి వనే్డలో సెంచరీతో కదంతొక్కిన అతను దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. భారత్‌తో మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 358 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 41 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒంటరి పోరాటాన్ని కొనసాగించి 65 పరుగులు చేసి, జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించారు. కానీ, దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయిన మిగతా ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో భారత్‌కు భారీ పరాజయం తప్పలేదు. టీమిండియా పేసర్లు వేసిన బంతుల్లో పస లేకపోవడంతో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయారు. డికాక్ 121 బంతులు ఎదుర్కొని, 18 ఫోర్లు, మూడు సిక్సర్లతో 135 పరుగులు సాధించాడు. భారత్‌ను 141 పరుగుల తేడాతో ఓడించిన తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును స్వీకరించిన అతను మాట్లాడుతూ, భారత ఫాస్ట్ బౌలర్లు వేగాన్ని అందిపుచ్చుకోలేకపోయారని వ్యాఖ్యానించాడు. షార్ట్‌పిచ్ బంతులు వేయడంతో, తనతోసహా తమ జట్టు బ్యాట్స్‌మెన్ అందరికీ స్వేచ్ఛగా ఆడే వీలు కలిగిందని అన్నాడు. ఫుల్ లెంగ్త్ బంతులను విసిరితే బాగుండేదని అతను అభిప్రాయపడ్డాడు. డేల్ స్టెయిన్, మోర్న్ మోర్కెల్ ఇలాంటి ఫుల్‌లెంగ్త్ బంతులతోనే భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారని అతను గుర్తుచేశాడు. హోం గ్రౌండ్‌లో సెంచరీ చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు.
కొంప ముంచిన బౌలర్లు: ధోనీ
దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వనే్డ ఇంటర్నేషనల్‌లో బౌలర్ల వైఫల్యమే తమ పరాజయానికి ప్రధాన కారణమైందని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వాపోయాడు. కొత్త బంతిని సద్వినియోగం చేసుకోలేకపోయారని పేసర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మహమ్మద్ షమీ కొంత మెరుగ్గా బౌలింగ్ చేసినప్పటికీ, మిగతా పేసర్లు రాణించలేకపోయారని అన్నాడు. చివరి 10 ఓవర్లలో ఏకంగా 135 పరుగులు సమర్పించుకోవడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేయగలిగిందన్నాడు. ప్రత్యర్థి జట్టు 350 పరుగుల మైలురాయిని దాటడమే తమ బౌలింగ్ వైఫల్యానికి నిదర్శనమని స్పష్టం చేశాడు. మిగతా రెండు మ్యాచ్‌ల్లో పొరపాట్లను సరిదిద్దుకొని, ఎదురుదాడి చేస్తామని అన్నాడు. దక్షిణాఫ్రికా క్రికెటర్లతో తమకు మంచి సంబంధాలున్నాయని పేర్కొన్నాడు. అయితే, మైదానంలోకి దిగినప్పుడు వారిని ప్రత్యర్థులుగానే చూస్తామని చెప్పాడు. హషీం ఆమ్లా, డికాక్ చక్కటి ప్రతిభ కనబరిచారని ప్రశంసించాడు. రెండు పదుల వయసులోనే డికాక్ ఆడిన తీరు ఆకట్టుకుందని అన్నాడు.
దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎబి డివిలియర్స్ మాట్లాడుతూ ఒక విజయంతోనే ఎంతో సాధించేశామని అనుకుంటే పొరపాటేనని సహచరులను హెచ్చరించాడు. పటిష్టమైన భారత జట్టును తక్కువ అంచనా వేయరాదని అన్నాడు. సిరీస్‌పై 1-0 ఆధిక్యం లభించిందని నేల విడిచి సాముచేస్తే ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందన్నాడు. ఆమ్లా, డికాక్ బ్యాటింగ్‌ను అతను ప్రస్తావిస్తూ, వీరిద్దరూ శుభారంభాన్నిచ్చారని, ఫలితంగా గౌరవ ప్రదమైన స్కోరు సాధించడం సాధ్యమైందని అన్నాడు. సెంచరీ వీరుడు డికాక్‌ను ప్రత్యేకంగా అభినందించాడు. ఈ సిరీస్‌లో చివరి రెండు వనే్డల్లోనూ ఇదే తీరులో రాణించడానికి ప్రయత్నిస్తామని చెప్పాడు. టి-20 ప్రపంచ కప్ సాధిం చడమే తన లక్ష్యమని అన్నాడు. ఈ దిశగా ప్రయ త్నం కొనసాగుతుందని తెలిపాడు.
దక్షిణాఫ్రికా సెంచరీ వీరుడు డికాక్ వ్యాఖ్య
english title:
v
Date:
Saturday, December 7, 2013