న్యూఢిల్లీ, డిసెంబర్ 6: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ‘్ఫఫా’ ఆధ్వర్యంలో జరిగే 2017 అండర్-17 ప్రపంచ కప్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఐర్లాండ్, 2010 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను నిర్వహించిన దక్షిణాఫ్రికా, ఆసియాలోనే ఫుట్‌బాల్‌కు పేరొందిన ఉజ్బెకిస్థాన్ దేశాల నుంచి ఎదురైన తీవ్రమైన పోటీని తట్టుకొని భారత్ ఈ హక్కులను సాధించింది. చివరి క్షణంలో బిడ్డింగ్ వేసిన భారత్‌కు టోర్నమెంట్‌ను నిర్వహించే అవకాశం ఇస్తున్నట్టు ఫిఫా అధికారికంగా ప్రకటించింది. కాగా, ఈటోర్నమెంట్ వల్ల దేశంలో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇటీవల కాలంలో ఫుట్‌బాల్‌ను ప్రజలు ఆదరిస్తున్నారని, అండర్-17 వరల్డ్ కప్‌తో మరింత ప్రాధాన్యం లభిస్తుందని అంటున్నారు. ఈ టోర్నమెంట్ ద్వారా దేశ ప్రజలకు ఫుట్‌బాల్ పట్ల ఆసక్తి పెరుగుతుందని చెప్తున్నా రు. గతంలో పలు అంతర్జాతీయ ఈవెంట్స్‌ను నిర్వహిం చిన అనుభవం ఉన్న భారత్ ప్రపంచ కప్ స్థాయ పోటీ లను సమర్థంగా నిర్వహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తు న్నారు. అన్ని రకాలుగా భారత్ అండర్-17 వరల్డ్ కప్ పోటీలకు అనువైన వేదికని స్పష్టం చేస్తున్నారు.
ఇలావుంటే, అండర్-17 ప్రపంచ కప్ పోటీలకు జట్టును ఎంపిక చేయడం ఒక సవాలని భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భుటియా అభిప్రాయపడ్డాడు. దేశంలో జరిగే ఈ పోటీల్లో భారత్ రాణించాలంటే, అత్యుత్తమ జట్టును ఎంపిక చేయాల్సి ఉంటుందని అన్నాడు. ఇప్పటి నుంచే సమర్థులైన ఆటగాళ్ల కోసం వేటను కొనసాగించడంతోపాటు, వారికి అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇప్పించాలని అఖిల భారత ఫుట్‌బాల్ సంఘం (ఎఐఎఫ్‌ఎ) అధికారులకు సూచించాడు. ఫుట్‌బాల్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించాడు. ఐ లీగ్ పోటీలతో ఆదరణ పెరిగిన ఫుట్‌బాల్‌కు అండర్-17 ప్రపంచ కప్ పోటీల ద్వారా మంచి రోజులు వస్తాయని, ఆదరణ పెరు గుతుందని భుటియా ఆశాభావం వ్యక్తం చేశాడు.
అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య
english title:
b
Date:
Saturday, December 7, 2013