డ్యునెడిన్, డిసెంబర్ 6: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ వీరోచితమైన పోరాటాన్ని కొనసాగిస్తూ ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకుంది. డారెన్ బ్రేవో అజేయ డబుల్ సెంచరీతో విండీస్‌ను ఆదుకోగా, మ్యాచ్ నాలుగో రోజు, శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు ఎనిమిది వికెట్లకు 443 పరుగులు చేసింది. ప్రస్తుతానికి న్యూజిలాండ్ కంటే 47 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన విండీస్ చేతిలో మరో నాలుగు వికెట్లు ఉన్నాయి. మ్యాచ్ చివరి రోజు, శనివారం ఈ జట్టు ఎంత వరకూ కివీస్‌ను ప్రతిఘటిస్తుందో చూడాలి. ఇన్నింగ్స్ పరాజయాన్ని ఇప్పటికే తప్పించుకున్న విండీస్ మ్యాచ్‌ని డ్రా చేసుకుంటే ఒక అద్భుతాన్ని ఆవిష్కరించినట్టు అవుతుంది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను తొమ్మిది వికెట్లకు 609 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేయగా, అందుకు సమాధానంగా విండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 213 పరుగులకే ఆలౌటైంది. 296 పరుగులు వెనుకంజలో నిలిచి, ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ గురువారం ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లకు 168 పరుగులు చేసింది. అప్పటికి బ్రేవో 72, మార్లొన్ సామ్యూల్స్ 17 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం ఆటను కొనసాగించి 178 పరుగుల వద్ద సామ్యూల్స్ వికెట్‌ను కోల్పోయింది. అతను 23 పరుగులు చేసి, టిమ్ సౌథీ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బ్రేవో క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడుతుండగా, శివనారైన్ చందర్‌పాల్ కేవలం ఒక పరుగు చేసి వాగ్నర్ బౌలింగ్‌లో ఎల్‌బిగా అవుటయ్యాడు. నర్సింగ్ దియోనారైన్ 52, దనేష్ రాందీన్ 24 పరుగులకు ఆలౌట్‌కాగా, ఏడో వికెట్‌కు బ్రేవో, కెప్టెన్ డారెన్ సమీ అజేయంగా 80 పరుగులు జోడించి, విండీస్‌ను ఇన్నింగ్స్ ఓటమి ప్రమాదం నుంచి తప్పించారు. బ్రేవో తన మారథాన్ ఇన్నింగ్స్‌లో 404 బంతులు ఎదుర్కొని, 30 ఫోర్లతో 210 పరుగులు సాధించాడు. టెస్టుల్లో అతనికి ఇదే తొలి డబుల్ సెంచరీ. సమీ 75 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 44 పరుగులు చేసి, విండీస్ తరఫున పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇష్ సోధీకి రెండు వికెట్లు లభించాయి.
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ స్కోరు 8/443
english title:
b
Date:
Saturday, December 7, 2013