భరించలేనంత చలి
పెరిగితే ఏం చేస్తాం?
ఒకప్పుడు గదిలో
-కుంపటి పెట్టేవాళ్లం.
టెక్నాలజీ సౌకర్యాన్ని
అందిస్తోంది కనుక
ఇప్పుడు -హీటర్లను
పెడుతున్నాం. కానీ
-సౌత్ కొరియన్లు
పడక గదిలో టెంట్లు
వేస్తున్నార్ట. అదేంటి?
అని ఆశ్చర్యపోకండి.
ఇదిగో ఇక్కడి
మంచం మీద
కనిపిస్తున్న టెంట్ ఆ
బాపతే. వేడి
పుట్టించదు కానీ,
చలిని అడ్డుకుంటుంది
కనుక టెంట్లు హాట్
కేకుల్లా
అమ్ముడుపోతున్నా
యి. రెండువారాల్లో
నాలుగు మిలియన్లు
అమ్ముడుపోయాయం
టే, వాటి సత్తా ఏమిటో
అంచనా
వేసుకోవచ్చు. గదిలో
19 డిగ్రీల
సెల్సియస్‌కు ఉష్ణోగ్రత
పడిపోతే, ఈ
టెంటులో 23 డిగ్రీల
సెల్సియస్ ఉష్ణోగ్రత
ఉంటోంది. ఖర్చు
తక్కువ,
వెచ్చనెక్కువ.
ఇంతకంటే ఏం
కావాలి?
అంటున్నారు సౌత్
కొరియన్లు.
ఆలోచనెవరదో తెలీదు
కానీ, ఆచరణలో
బావుంది కనుక
అనుసరిస్తున్నాం
అంటున్నారు కూడా.
-వనరులు కరవు,
సంపాదన బరువు
లాంటి రోజులివి. పెద్ద
అవసరాన్ని చిన్న
ఆలోచనతో
అధిగమించడమే ఈ
రోజుల్లో మనం
చేయగలిగింది.
అందుకే -మనకూ
చలికాలం పెరిగింది
కనుక, చాన్సుంటే
పడకగదిలో టెంటు
వేసి ముడుచుకుని
పడుకుంటే మేలు.
ఏమంటారు?