Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోనియా జన్మదిన వేడుకలు

$
0
0

విశాఖపట్నం, డిసెంబర్ 9: అధినేత్రి జన్మదిన వేడుకలను నిర్వహించేందుకు జిల్లా మంత్రి సహా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశమయ్యారు. అట్టహాసంగా కేక్ కట్‌చేసి, పేదలకు దుస్తులు పంపిణీ చేస్తున్నారు. ఇంతలో కార్యకర్తలు లేచి రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్న అధినేత్రికి జన్మదినోత్సవం జరపడంలో అర్ధం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి బాలరాజు సహా ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకులు అవాక్కయ్యారు. నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధినేత్రి జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు సన్నాహాలు చేశారు. మంత్రి బాలరాజు, విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. కేక్ కట్‌చేసిన అనంతరం వృద్ధులు, పేదలకు చీరలను పంపిణీ చేస్తుండగా, మాజీ కార్పొరేటర్ భర్త పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. సీమాంధ్రలో పార్టీని నిలువునా ముంచేసిన అధినేత్రి నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో విభజన నిర్ణయాన్ని ధైర్యంగా ఎదిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడు. దీంతో సోనియా జన్మదిన వేడుకల్లో కొద్దిసేపు ఉద్రిక్తత, ఉత్కంఠ చోటుచేసుకున్నాయి. ఇతర నాయకులు కల్పించుకుని సర్ధిచెప్పడంతో వాతావరణం చల్లబడింది. దీంతో అధిష్టానం తీసుకున్న విభజన నిర్ణయాన్ని తొలి నుంచి సమర్థిస్తూ వస్తున్న మంత్రి బాలరాజుకు ఈ సంఘటన ఆగ్రహం తెప్పించింది.
అనంతరం మంత్రి బాలరాజు మాట్లాడుతూ పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టలేమని పేర్కొన్నారు. విభజన అంశానికి సంబంధించి తాను వ్యక్తిగతంగా సమైక్యవాదినే అయినప్పటికీ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించలేమన్నారు. సమావేశంలో విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

సైబర్ నేరాల్లో విశాఖది రెండో స్థానం
* 2012లో 153 కేసుల నమోదు
* పూర్తిస్థాయి పిఎస్ లేక ఇబ్బందులు
* భవిష్యత్‌లోప్రతి కేసుకూ సైబర్ లింకు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ 9: అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ఏమాత్రం బీజం వేస్తోందో తెలీదుకానీ, అనవసరమైన నేరాలకు దారిచూపుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఆర్థిక, లైంగిక నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య మాత్రం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈనేపధ్యంలో సైబర్ నేరాల నమోదులో విశాఖ నగరం గణనీయమైన ప్రగతిని సాధిస్తోంది. దేశంలోనే విశాఖ నగరం సైబర్ నేరాల నమోదులో రెండో స్థానంలో నిలిచిందంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ యువత నేరాలకు పాల్పడుతూ పోలీసులకు సవాలు విసురుతున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిని పట్టుకోవడం, శిక్షించడంలో పోలీసులు విపరీతంగా శ్రమించాల్సి వస్తోంది. దేశంలో బెంగళూరు నగరం సైబర్ నేరాల నమోదులో అగ్రస్థానంలో ఉండగా, విశాఖ నగరం తానేమీ తీసుపోనంటూ వెనుకే అడుగులేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పాల్పడే సైబర్ నేరాలు 2010లో కేవలం 36 కేసులు నమోదు కాగా, 2012 నాటికి వీటి సంఖ్య 153కు చేరింది. 2013లో నవంబర్ నాటికి నగర పరిధిలో 140 సైబర్ కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలకు ఆస్కారం ఉన్న 53 పట్టణాల్లో విశాఖదే అగ్రస్థానం. ఎటిఎం కార్డుల ద్వారా అకౌంట్లలో డబ్బులు కాజేయడం, క్రెడిట్ కార్డుల మోసాలు, ఆన్‌లైన్ లాటరీ, ఫేస్‌బుక్ అకౌంట్ల హాకింగ్, సెల్‌ఫోన్ల ద్వారా మహిళలు, యువతులను వేధించడం వంటివి అత్యధికంగా సైబర్ నేరాలుగా నమోదవుతున్నాయి. సైబర్ నేరాల నమోదులో దూసకెళ్తున్న విశాఖలో కేసుల పరిష్కారానికి అవసరమైన వౌలిక సదుపాయాల కల్పన, సిబ్బంది నియామకం వంటి అంశాలను మాత్రం ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. విశాఖలో నమోదైన సైబర్ నేరంలో లోతైన దర్యాప్తు జరపాలంటే హైదరాబాద్, సైబరాబాద్ సైబర్ పోలీసు స్టేషన్లను ఆశ్రయించాల్సిందే. రాష్ట్రంలో కేవలం ఈరెండు పోలీసు కమిషనరేట్‌లలోనే సైబర్ పోలీసు స్టేషన్లున్నాయి. విశాఖపట్నం, విజయవాడల్లో మాత్రం సైబర్‌క్రైం ఇనె్వస్టిగేషన్ సెల్ మాత్రమే ఏర్పాటు చేశారు. నమోదైన నేరానికి సంబంధించి ఏచిన్న సమాచారానికైనా ఆరెండు పోలీసు స్టేషన్లను సంప్రదించాల్సింనే. గతంలో పూర్ణచంద్రరావు నగర పోలీసు కమిషనర్‌గా పనిచేసిన కాలంలో విశాఖ కమిషనరేట్ పరిధిలో సైబర్ పిఎస్ అవసరాన్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సిబ్బందిని సమకూర్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ ప్రతిపాదన చేశారు. తదనంతరం వచ్చిన శివధరరెడ్డి కూడా ఆప్రతిపాదనలపై మరోసారి కదలిక తెచ్చారు. అయితే ప్రభుత్వం నుంచి ఏవిధమైన సానుకూలత ఇప్పటికీ వ్యక్తం కాలేదు. ఒక ఎస్సై మరో ఆరుగురు సిబ్బందితోనే ఇనె్వస్టిగేషన్ సెల్ పనిచేస్తోంది. అయినప్పటికీ గత సంవత్సరం నమోదైన వాటిలో 80 కేసులను సైబర్ పోలీసులు పరిష్కరించగలిగారు. భవిష్యత్‌లో జరిగే ప్రతి నేరంలోను సైబర్ పోలీసుల పాత్ర కీలకం కానుంది. చోరీ, హత్య, వేధింపులు వంటి నేరాల్లో సమాచారం సేకరణ వంటివి త్వరితగతిన తెలుసుకునే అవకాశం దక్కుతుంది. ఇప్పటికైనా నగరంలో పెరుగుతున్న సైబర్ నేరాలను నియంత్రించడంతో పాటు వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

మోడి తంత్రం ఫలించింది
* భవిష్యత్‌లో ఢిల్లీ గద్దెపై బిజెపి
విశాఖపట్నం, డిసెంబర్ 9: భవిష్యత్ సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఘనవిజయం సాధించి ఢిల్లీ గద్దెను ఎక్కడం ఖాయమని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పిళ్లా సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బిజెపి సాధించిన ఘన విజయం మోడీ నాయకత్వానికి ప్రజల సానుకూల స్పందనకు అద్దం పడుతోందని అభిప్రాయపడ్డారు. ఛత్తీస్‌ఘర్, మధ్యప్రదేశ్‌లలో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ఢిల్లీ, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ నుంచి అధికారాన్ని దక్కించుకోడం సామాన్యమైన అంశం కాదన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలో ముఖ్యమంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, రమణ్‌సింగ్‌లు అత్యుత్తమ పాలన అందించారని అందుకే ప్రజలు మరోసారి పట్టం కట్టారని అన్నారు. ఇక కాంగ్రెస్ పాలిత ఢిల్లీ, రాజస్థాన్‌లో ప్రజల సంక్షేమం, అభివృద్ధి విస్మరించడంతో ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రజలు బిజెపికి బ్రహ్మరధం పడతారని ఆయన జోస్యం చెప్పారు. గుజరాత్ సిఎం నరేంద్ర మోడి నాయకత్వం పట్ల ప్రజలతో పాటు యువత మొగ్గుచూపుతోందనడానికి నాలుగు రాష్ట్రాల ఎన్నికలే కారణమని పేర్కొన్నారు.

సిటిజన్ చార్టర్ అమలు చేయాల్సిందే
* నిర్లక్ష్యం చూపితే పెనాల్టీ
* అధికారులకు కమిషనర్ హెచ్చరిక
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ 9: సిటిజన్ చార్టర్‌లో నిర్ధేశించిన సేవలను నిర్ణీత కాలవ్యవధిలో ప్రజలకు అందాలని జివిఎంసి కమిషనర్ ఎంవి సత్యనారాయణ ఆదేశించారు. ప్రజా సేవలకు జవాబుదారీగా లేని సిబ్బంది, ఆదేశాలను అమలు చేయని పక్షంలో అపరాధరుసుం చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. నగర పరిధిలో సిటిజన్ చార్టర్‌తో పాటు సహ చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోతే తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. జోన్ 3 సూర్యాభాగ్‌లో అధికారులతో సోమవారం ఆయన సమీక్షించారు. నగర ప్రజలకు అన్ని రకాల సేవలను సిటిజన్ చార్టర్ ద్వారానే అందించాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తును కౌంటర్‌లో నమోదు చేసి సీరియల్ నెంబర్ కేటాయించాలన్నారు. సహ చట్టాన్ని కూడా సమర్ధవంతంగా అమలు చేయాలని, దరఖాస్తుదార్లు అడిగిన సమాచారాన్ని తప్పని సరిగా ఇవ్వాలని ఆదేశించారు. సకాలంలో సమాచారం ఇవ్వని కేసుల్లో సిబ్బందే అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. లీగల్ కేసుల మానిటరింగ్‌ను సమర్ధవంతంగా నిర్వహించాలని, కోర్టుల్లో వాదనలు నడుస్తున్న కేసులు సత్వరమే పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఇఎస్‌ఐ, పిఎఫ్ సొమ్ము సక్రమంగా చెల్లించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో సెల్ టవర్ల ఏర్పాటు విషయంలో అధికారులు స్పష్టమైన విధానాన్ని అమలు చేయాలని సూచించారు. అదనపు కమిషనర్ కె రమేష్ మాట్లాడుతూ నగరంలో ఓటర్ల నమోదు ప్రక్రియను సక్రమంగా చేపట్టాలని సూచించారు. సమావేశంలో సిటీ ప్లానర్ బాలకృష్ణ, డిసిఆర్ సోమన్నారాయణ, సిఎంహెచ్‌ఓ సత్యనారాయణ రాజు, జోనల్ కమిషనర్లు శివాజీ, వై శ్రీనివాస్ , శ్రీరామ్మూర్తి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టు శ్రీనివాస్‌కు లాడ్లీ మీడియా పురస్కారం
విశాఖపట్నం, డిసెంబర్ 9: అత్యంత ప్రతిష్టాత్మకమైన యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ లాడ్లీ మీడియా జాతీయ పురస్కారానికి కథారచయిత, సీనియర్ జర్నలిస్టు డాక్టర్ చింతకింది శ్రీనివాస్ ఎంపికయ్యారు. లాడ్లీ మీడియా అండ్ అడ్వర్టయిజింగ్ అవార్డ్ ఫర్ జెండర్ సెన్సిటివిటీ పేరిట ఈఏడాది పురస్కారాన్ని శ్రీనివాస్‌కు ఇవ్వనున్నట్టు అవార్డుల కమిటీ ప్రకటించింది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న పీపుల్స్‌ఫస్ట్ ఈ అవార్డులను 2007నుంచి అందజేస్తోంది. మహిళల హక్కుల నేపధ్యంలో వారి సాధికారత, అభ్యున్నతి, స్వావలంబన, సేవాధృక్పధం తదితర అంశాల్లో సున్నితత్వం పెంచే వ్యాపాల ఆధారంగా అవార్డుకు ఎంపిక జరుగుతుంది. ఇవే గీటురాళ్లుగా శ్రీనివాస్‌ను ఎంపిక చేసినట్టు కమిటి పేర్కొంది. ఈనెల 13న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని అందజేయనున్నట్టు నిర్వాహక కమిటీ ఎగ్జిక్యుటివ్ ట్రస్టీ ఎస్‌వి సిస్టా ఒక ప్రకటనలో తెలిపారు.

డయల్ యువర్ కలెక్టర్‌కు 32 ఫోన్‌కాల్స్
విశాఖపట్నం, డిసెంబర్ 9: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 32 ఫోన్‌కాల్స్ వచ్చాయి. వచ్చిన ఫోన్‌కాల్స్‌కు కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌లు సమాథానాలిచ్చారు. కోటవురట్ల మండలం నుండి పి.కొండమ్మ ఫోన్ చేసి తనకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరైందని, 40 బస్తాల సిమ్మెంటు ఇవ్వాల్సి ఉండగా 15 బస్తాలు మాత్రమే ఇచ్చారని, గృహ నిర్మాణశాఖ అధికారులకు ఎన్నిసార్లు అడిగినా స్పందించలేదన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ దీనిని పరిశీలించి నివేదికను సమర్పించాలని గృహనిర్మాణశాఖ పిడిని ఆదేశించారు. చింతపల్లి మండలం నుండి కె.గాయత్రి ఫొన్ చేసి తాను నర్సింగ్ శిక్షణ పూర్తిచేసుకుని అనుభవం కోసం గాజువాక ప్రైవేటు నర్సింగ్‌హోమ్‌లో పనిచేసుకుంటున్నాను. ప్రస్తుతం నర్సింగ్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోనడానికి కుల ధృవీకరణ పత్రం కోసం తహశీల్దార్‌కు దరఖాస్తు చేయగా మీరు స్థానిక నివాసం లేనందున ధృవీకరణపత్రం ఇవ్వబడదని అంటున్నారన్నారు. వాస్తవానికి మా రేషన్‌కార్డు చింతపల్లిలో ఉన్నందున కుల ధృవీకరణ పత్రం మంజూరు చేయాలన కోరగా పాడేరు రెవెన్యూ డివిజనల్ అధికారిని, స్థానిక తహశీల్దార్‌ను ఆదేశిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. పరవాడ మండలం చెర్లోపల్లి గ్రామం నుండి తార హేమలత ఫోన్ చేసి మాతు ఉన్న పది ఎకరాల భూమికి సంబంధించి అడంగులను అదే గ్రామానికి చెందిన శంకర్రావు పేరున విఆర్‌ఒ నమోదు చేసారన్నారు. దీనిని పరిష్కరించాలని కోరారు. దీనిపై శంకర్రావుకు నోటీసును జారీ చేసి పరిష్కరించడానికి ఆర్డీవోను ఆదేశించనున్నట్టు జెసి తెలిపారు. బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామం నుండి డి.అయ్యంగ దొర ఫోన్ చేసి పంటల నష్టపరిహారం చెల్లింపులో అనకాపల్లి బ్యాంకువారు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలపగా, తక్షణమే దీనిని పరిశీలించాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులను కలెక్టర్ ఆదేశించారు. అనంతగిరి మండలం నుండి సుబ్బారావు ఫోన్ చేసి తనకు వికలాంగ వికలాంగ పించను ఇంతవరకు మంజూరు చేయాలని కోరగా, దీనిని పరిష్కరించి తగు చర్యలను తీసుకోవాల్సిందిగా మండల అభివృద్ధి అధికారిని జెసి ఆదేశించారు. అనంతగిరి నుండి సర్పంచ్ మాట్లాడుతూ పిఎంజిఆర్‌వై కింద తారురోడ్డు నిర్మాణం కోసం కోటి రూపాయల ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇంజనీరింగ్ అదికారులు, కాంట్రాక్టర్లు ఎకమై నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ఫోన్ చేసి తెలుపగా సంబంధిత అధికారులతో చర్చించి పనులపై పరిష్కరిస్తామన్నారు. పెదబయలు మండలం నుండి గిరిజన నిరుద్యోగి ఫోన్ చేసి ఐటిడిఏ పరిదిలో ఏర్పడిన బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ కోసం ధరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా ఇంతవరకు బ్యాక్‌లాగ్‌ఖ పోస్టుల ఎంపిక చేయలేదని తెలుపగా తక్షణమే జాబితాను ప్రకటించనున్నట్టు జెసి తెలిపారు. పలువురు 104 సిబ్బంది ఫోన్ చేసి సుమారు నాలుగు మాసాల నుండి జీతాలు చెల్లించకపోవడం వలన చాలా ఇబ్బందులకు గురవుతున్నామని తెలుపగా తక్షణమే జీతాలు చెల్లించే ఏర్పాటు చేయనున్నట్టు సంబంధితాధికారులకు జెసి తెలిపారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ఎక్కువశాతం గృహనిర్మాణం, పించన్లు, పట్టాదారు పాస్ పుస్తకాలు గురించి ఎక్కువుగా ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వరరావు, జిల్లాప్రజాపరిషత్ కార్యనిర్వాహాణాధికారి వెంకటరెడ్డి, జిల్లాగ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి మహేశ్వరరెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ డిడి శ్రీనివాసన్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మెజారిటీ కార్మికులు కోరితే సమ్మె నోటీసు
* చైనా, జపాన్ రైల్వేతో పోటీ పడాలి
* రైల్వే నిర్లక్ష్యంతోనే పెరగని లోడింగ్ సామర్ధ్యం
* కొత్త జోన్ కోసం సంప్రదించాలి
* ఎన్‌ఎఫ్‌ఐఆర్ ప్రధాన కార్యదర్శి రాఘవయ్య

విశాఖపట్నం, డిసెంబర్ 9: దీర్ఘకాలిక కార్మికుల సమస్యలపై మెజారిటీ కార్మికులు కోరితే సమ్మె నిర్వహిస్తామని భారతీయరైల్వే జాతీయ సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐఆర్) ప్రధాన కార్యదర్శి ఎం.రాఘవయ్య అన్నారు. హోటల్ దసపల్లాలో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుగా ‘సమ్మె బ్యాలెట్’ నిర్వహించి దీనినిబట్టి రైల్వేకు సమ్మె నోటీసు ఇస్తామన్నారు. ఆ తరువాత సమ్మె నిర్వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే కేంద్రం సమ్మె పరిస్థితికి తీసుకువెళ్ళకుండా సమస్యలను పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేశారు. రైల్వే కార్మికుల సమ్మె అంటే దేశానికి నష్టం ఏర్పడుతుందని, రైల్వే వ్యవస్థ కుంగిపోతుందని, ప్రయాణికులకు ఇబ్బందులుంటాయన్నారు. ఒక రోజు రైళ్ళన్నీ నిలిచిపోయే పరిస్థితి ఉంటే మళ్ళీ ఇవన్నీ పట్టాలెక్కే పరిస్థితి రావడానికి కనీసం నెల రోజులు పడుతుందన్నారు.

* విభజన సూత్రధారికి పుట్టిన రోజు పండుగా * నిలదీసిన కార్యకర్తలు * సర్ధిచెప్పిన నేతలు
english title: 
c

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>