Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ధ్యానం మనిషికి కవచం లాంటిది

$
0
0

రాయచోటి, మార్చి 6: యుద్ధంలో సైనికునికి కవచం ఎలా ఉపయోగపడుతుందో సమాజంలో మనిషికి ధ్యానం అలా ఉపయోగపడుతుందని ధ్యాన మహర్షి సుభాష్ పత్రీజీ పేర్కొన్నారు. పట్టణంలో షిరిడీసాయి మందిరంలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న ధ్యాన సప్తాహం కార్యక్రమానికి ఆయన మంగళవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన భక్తులకు, ప్రజలకు ఆయన ధ్యానంపైన సూచనలు ఇచ్చారు. దేశంలో మహాత్మాగాంధీ స్వామి వివేకానందలాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని అలా ఎదగాలన్నారు. మహాత్మాగాంధీ సాధించిన దేశ స్వాతంత్య్రం అలాంటి మంచి పనులు మనమెందుకు చేయకూడదన్న పట్టుదలతో ముందుకు నడవాలని సూచించారు. సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి ధ్యానంపై శ్రద్ధ చూపాలన్నారు. ధ్యానం అంటే పూజ కాని, మంత్రం కాని చేయాల్సిన పని లేదని, కేవలం శ్వాసమీద ధ్యాస పెట్టడమే ధ్యానమన్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ధ్యాన కార్యక్రమాలు మనపట్టణంలో నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. ధ్యాన సప్తాహానికి హాజరైన ధ్యాన మహర్షి సుభాష్ పత్రీజీని అల్ప సంతోషులు, ఒత్తిడి నుంచి ఎలా తట్టుకోవాలి అన్న ప్రశ్నలు వేయడంతో ఆయన క్లుప్తంగా వివరించారు. ఒత్తిడిని తట్టుకోవాలంటే కేవలం ధ్యానమేనని, అంతుకు మించిన విద్య లేదన్నారు. అల్పసంతోషులు అంటే చిన్న చిన్నవాటితో సరిపెట్టుకుని పోయేవారే అల్ప సంతోషులని, అలా కాకుండా దేశానికి సేవ చేయడం, దేశం తనకేమి ఇచ్చింది అనేది కాకుండా దేశానికి ఏమి చేశామనే ప్రశ్నను మనలో మనం వేసుకున్నపుడే సమాజానికి ఉపయోగపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ధ్యాన మాస్టర్లు, పిరమిడ్ స్పిరుచువల్ సొసైటీ సభ్యులు సతీష్‌కుమార్, లయన్ నాగేశ్వరరావు, పట్టణంలోని ప్రముఖులు, తదితరులుపాల్గొన్నారు.
=================
మృణ్మయ పాత్రలకు ఆధునిక అలంకరణ జోడించాలి
కడప , మార్చి 6 : సంప్రదాయ కళలకు ఆదరణ లేక కనుమరుగవుతున్న సందర్భంలో వృత్తి కళైన మృణ్మయ పాత్రలకు ఆధునిక అలంకరణ జోడిస్తే ఉపాధి లభిస్తుందని యోగివేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం విశ్వవిద్యాలయంలో లలిత కళల విభాగం ఏర్పాటు చేసిన మృణ్మయి పాత్రల అలంకరణ సదస్సుకు విచ్చేసిన ఆయన మాట్లాడుతూ సంప్రదాయ కళలు, వృత్తి కళలు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అవి అంతరించి పోకుండా లలిత కళల విభాగం స్థాపించినట్లు తెలిపాన్నారు. స్థాపించిన కొద్ది కాలంలోనే అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రతి కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటున్నాయన్నారు. అందుకు తగ్గట్టు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగానే సంప్రదాయ కళలైన మృణ్మయి పాత్రల అలంకరణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఈ సదస్సును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తద్వారా స్వయం ఉపాధి లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. మృణ్మయి పాత్రలకు ఆధునిక కళను మేళవిస్తే వృత్తి కళగా ఉపాధి పెంపొందించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాండిచ్చేరి యూనివర్శిటీ ప్రొఫెసర్ నంబిరాజు, ప్రిన్సిపల్ ఆచార్య టి. వాసంతి, ఉపకులపతి సతీమణి విజయలక్ష్మీ, లలిత కళల శాఖాధిపతి డాక్టర్ మూలమల్లికార్జునరెడ్డి, బోధన సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

* ధ్యాన మహర్షి సుభాష్ పత్రీజీ
english title: 
kavacham

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>