హైదరాబాద్, మార్చి 7: రాష్ట్ర పోలీసు శాఖలో పలు అంశాలకు సంబంధించి విధివిధానాల నివేదికను ఖరారు చేసేందుకు వీలుగా ఏడు కమిటీలను ఏర్పాటు చేశారు. బుధవారం డిజిపి ఉన్నతాధికారులతో పలు అంశాలను సమీక్షించారు. అనంతరం ఏడు అంశాలను చర్చించి వాటికి సంబంధించి నివేదిక తయారు చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు డిజిపి కార్యాలయం తెలిపింది. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లను కలిపి చీఫ్ కమిషనరేట్‌గా ఏర్పాటు, యూనిఫాంలో నిర్ధిష టప్రమాణాలకు, ట్రాఫిక్ పోలీసులకు డ్రస్‌కోడ్, పోలీసు భూముల కోసం ఎస్టేట్ ఆఫీసర్ నియామకం, నిఘా కెమెరాల ఏర్పాటు, వివిధ స్థాయిలో పోలీసు వాహనాలకు సంబంధించి నిర్ధిష్ట ప్రమాణాల ఏర్పాటు, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు స్టేషన్లు, సర్కిల్స్, డివిజన్లను పునర్‌వ్యవస్ధీకరించేందుకు ఈ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సమావేశంలో శాంతిభద్రతల విభాగం అదనపు డిజిపి హెచ్‌ఏ హుడా, ఇంటిలిజెన్స్ అదనపు డిజిపి ఎం.మహేందర్‌రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్ కమీషనర్లు, పలు రేంజ్‌ల ఐజిలు, డిఐజిలు హాజరయ్యారు.
రాష్ట్ర పోలీసు శాఖలో పలు అంశాలకు సంబంధించి
english title:
police committee
Date:
Thursday, March 8, 2012