విజయవాడ, డిసెంబర్ 11: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ ‘గో బ్యాక్ దిగ్విజయ్ సింగ్’ అంటూ నినాదాలు చేస్తూ న్యాయవాదులు, సమైక్యవాదులు బుధవారం నగరవీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు చేతబూని ముందుకు నడిచారు. బందరురోడ్డుపై నుంచి సబ్ కలెక్టరేట్ మీదుగా కోర్టుల ప్రాంగణానికి చేరుకున్నారు. దీనికి నాయకత్వం వహించిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మట్టా జయకర్ మాట్లాడుతూ మధ్యప్రదేశ్‌లో తమ పార్టీని ఉద్దరించలేని దిగ్విజయ్‌సింగ్ ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసేందుకు పూనుకోవటం దుర్మార్గమన్నారు. అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలోకి అడుగుపెట్టే వీలులేదన్నారు. తెలుగుజాతిని విడదీసేందుకు కంకణం కట్టుకున్న యుపిఎ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అవిశ్వాస తీర్మానం పెట్టిన సీమాంధ్ర ఎంపిలు ఎంతైన అభినందనీయులన్నారు. మిగిలిన ఎంపిలు కూడా అదే బాటలో నడవాలని లేనిపక్షంలో ప్రజల అగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఆందోళనలో బార్ అసోసియేషన్ కార్యదర్శి ఇజ్రాయెల్, ఉపాధ్యక్షుడు సిహెచ్ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వస్తున్న
english title:
digvijay
Date:
Thursday, December 12, 2013