హైదరాబాద్, డిసెంబర్ 12: ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ డిమాండ్ చేశారు. తెలంగాణ రాజకీయ ఐకాస కన్వీనర్ డాక్టర్ కోదండరాం, తదితరుల బృందం నారాయణను మగ్ధూం భవన్లో కలిసింది. అనంతరం నారాయణ మాట్లాడుతూ రాష్టప్రతి ఆరువారాల సమయం ఇచ్చినా, తెలంగాణ బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చని అన్నారు. దీనికి ఎలాంటి నియమ నిబంధనలు అడ్డురావని అన్నారు. సిపిఐ శాసనసభాపక్షం నాయకుడు గుండా మల్లేష్, ఐకాసా నాయకులు శ్రీనివాస్‌గౌడ్, మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని సిపిఐ
english title:
cpi
Date:
Friday, December 13, 2013