భీమవరం, మార్చి 7: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న అంతర్జాతీయ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీలో బుధవారం భారత ఆటగాళ్ల హవా కొనసాగింది. సింగిల్స్ విభాగం రెండో రౌండ్లో నలుగురు భారత ఆటగాళ్లు విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నారు. అలాగే డబుల్స్‌లో భారత జోడీ క్వార్టర్ ఫైనల్స్‌లో విజయం సాధించి సెమీస్‌లో బెర్త్ ఖరారు చేసుకుంది. సింగిల్స్‌లో భారత్‌కు చెందిన రంజిత్ విరాలీ మురుగేశన్ 7-6 (2), 2-6, 6-3 స్కోరుతో బ్రిటన్‌కు చెందిన రిచర్డ్గాబ్ పై విజయం సాధించాడు. భారత్‌కే చెందిన సాకిత్ మైనేని 6-1, 6-0 స్కోరుతో జపాన్ ఆటగాడు అరాటాఒనోజొవాపై, కరన్ రాస్తోబి 6-2, 6-0 స్కోరుతో స్పెయిన్‌కు చెందిన జోర్డీమొనోజ్ అబెరూ పై, జీవన్ నేదుంచెజియాన్ 6-3, 3-6, 6-1 స్కోరుతో ఐర్లాండ్‌కు చెందిన సాంబేరిపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టారు. మరో మ్యాచ్‌లో స్వీడన్‌కు చెందిన ప్యాట్రిక్ రోసన్హోల్మ్ (స్వీడన్) 6-2, 6-2 స్కోరుతో భారత ఆటగాడు వివేక్ సోకింగ్పై విజయం సాధించాడు. జపాన్‌కు చెందిన సుచిసెకుగుసి 6-3, 6-3 స్కోరుతో బ్రిటన్ ఆటగాడు జేమ్స్ఫీవర్ పై, ఉజ్బెకిస్థాన్‌కు చెందిన సర్వర్ఇక్రవౌ 6-2, 6-3 స్కోరుతో ఇటలీ ఆటగాడు మ్యాధ్యూ వెరీన్పై విజయం సాధించారు. డబుల్స్ విభాగంలో భారత జోడీ విజయ్సుందర ప్రశాంత్, అరుణ్‌ప్రకాశ్ రాజగోపాలన్ 6-2, 6-2 స్కోరుతో భారత్‌కే చెందిన చందుల్సూడ్, లక్షిత్సూడ్ జోడీపై విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న అంతర్జాతీయ ర్యాంకింగ్
english title:
ranking
Date:
Thursday, March 8, 2012