Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

తప్పుల తడక.. ఓటర్ల జాబితా..

$
0
0

కరీంనగర్ , డిసెంబర్ 18: ఓ వైపు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేస్తా ఉంటే, మరోవైపు బాబితాలో నుంచి ఓటర్ల పేర్లను తొలగించేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో అవకతవకలపై సవరణల విషయంలో ప్రత్యేక దృష్టి సారించడం, నాలుగైదు మాసాల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఓటర్ల నమోదు అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓటర్ల జాబితాలో 53వేల మందికిపైగా రెండు ప్రాంతాల్లో ఓటర్లుగా ఉండగా, జనాభా ప్రకారం మహిళా ఓటర్లు లేకపోవడం కొసమెరుపు. జాబితా తప్పుల తడకగా ఉందన్న ఆరోపణలు సర్వత్రా విన్పిస్తున్నాయి. ఇక రెండ్రోజులే మిగిలిన ఉన్న నేపథ్యంలో అధికారులు ఏ మేరకు జాబితాను సవరిస్తారో వేచిచూడాల్సిందే. రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు జిల్లాలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియతోపాటు జాబితాలో చేర్పులు, మార్పులు చేసే కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. నాలుగైదు మాసాల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషన్ కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో మార్పులు, చేర్పులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు ఎన్నికల కమీషన్ ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌లతో సమీక్షలు నిర్వహిస్తోంది. అయినా, జాబితాలో తప్పులు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు చేపట్టిన మార్పులు, చేర్పుల ప్రక్రియలో సమారు 53వేలకు మందికిపైగా రెండుచోట్ల ఓటర్లుగా ఉన్నట్లు వెలుగుచూసింది. ఇంకా కూడా వెలుగుచూసే అవకాశం ఉంది. ఎందుకంటే వలసలు వెళ్లిన, ఉద్యోగ రీత్యా బయటకు వెళ్లిన, చనిపోయిన వారి పేర్లు జాబితాలో ఉన్న గ్రామాలు కూడా ఉన్నాయి. వలసలు వెళ్లిన వారు నివసించే చోటనే ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు ప్రచారం ఉంది. గతంలో జాబితాలో పేరు ఒక చోట ఉంటే, చిరునామా మరో చోట ఉండేది. పేరు, చిరుమానాలకే పరిమితమైన పొరపాట్లు ప్రస్తుతం ఫోటోల వరకు వెళ్లాయి. జాబితాలో ఒకరి ఫోటోకు బదులు మరోకరి ఫోటోలు ఉండటం, అందులో పేర్లు, చిరునామాలు పొంతనలేకుండా ఉండటం లాంటివి చోటుచేసుకుంటున్నాయి. ఓటరు గుర్తింపు కార్డులు ఫోటోతోసహా ఉన్నప్పటికీ జాబితాలో ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. పురుషులు వెయ్య మంది ఉంటే, మహిళలు 1009 మంది ఉన్నారు. అయినప్పటికీ 1009 మందిలో 987 మంది మహిళలు మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారు. మున్సిపల్ కార్పోరేషన్‌లైన కరీంనగర్, రామగుండంలో ఈ సంఖ్య మరింత తక్కువ ఉండటం గమనార్హాం. ఈ లెక్కల ప్రకారం ఏడాది కాలంగా అధికారులు ఏమిచేస్తున్నారో బేరీజు వేసుకోవచ్చు. ఇదిలా ఉంటే 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని ఎన్నికల కమీషన్ పదేపదే ప్రకటిస్తోంది. జిల్లాలో 18నుంచి 19సంవత్సరాల వయస్సు గల యువత లక్షా 47వేల 215 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. గడువులోగా అర్హులైన వారందరిని నమోదు చేయాలని జిల్లా అధికారులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు 70వేలకుపైగా కొత్త ఓటర్లు నమోదైనట్లు తెలుస్తోంది. మిగిలిన ఓటర్లను చేర్పించాల్సి ఉండగా, గడువు మాత్రం రెండ్రోజులే మిగిలి ఉంది. ఒకవైపు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం జరుగుతా ఉంటే, మరోవైపు ఓటర్ల జాబితాలో నుంచి అర్హులైన వారిని తొలగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే కరీంనగర్ నగరంలో ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందంటూ, దాని సవరించాలని టిఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు రవీందర్‌సింగ్ విలేఖరుల సమావేశంలో డిమాండ్ చేశారు. మంగళవారం ధర్మపురి మండలంలోని గంగసముద్రం, సిర్‌పూర్‌నూత్‌పల్లి గ్రామస్తులు తమ పేర్లను జాబితాను తొలగించారని ఆందోళన చేపట్టారు. ఇవేకాక పలు గ్రామాల్లో ఇలాంటి ఆందోళనలు జరిగాయి. ఒకవైపు చేరికలు, మరోవైపు తొలగింపులతో ఓటర్ల జాబితాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కమీషన్ మాత్రం 2014 జనవరి 16న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని ప్రకటించింది. కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో మార్పులు, చేర్పులు చేసే గడువు ఇక రెండ్రోజులే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు జాబితాలోని అకతవకల్ని ఎప్పుడు సరిచేస్తారో వేచిచూడాల్సిందే.
చైతన్యంతోనే మోసాలకు అడ్డుకట్ట
కరీంనగర్ టౌన్, డిసెంబర్ 18: వినియోగదారులు చైతన్యవంతులైతే సమాజంలో జరుగు మోసాలను అరికట్టవచ్చునని జిల్లా పౌరసరఫరాల అధికారి బి. చంద్రప్రకాశ్ అన్నా రు. డిసెంబర్ 18 నుండి 24 వరకు జరుగు జా తీయ వినియోగదారుల వారోత్సవాలను బుధవా రం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వినియోగదారులు చైతన్యవంతం కావాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. మెరుగైన సమాజ నిర్మాణానికి అందరు తోడ్పడాలని అన్నారు. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతీ వస్తువుకు ధర నిర్ణయిస్తుందని, వినియోగదారులు పూర్తి అవగాహనతో వస్తువులు కొనుగోలు చేయాలని, కొన్న వస్తువులకు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరను మాత్రమే చెల్లించాలని, అధికంగా చెల్లించరాదని తెలిపారు. జిల్లాలో 11 లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని, వారికి రూపాయికి కిలో నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆ బియ్యాన్ని లబ్ధిదారులు వాడుకోవాలని, అమ్ముకోకుండా వాడుకోవాలని కోరారు. వస్తు మార్పిడి ద్వారా బియ్యాన్ని ఇస్తున్నారని తెలిసిందని, పౌరసరఫరాల శాఖ ద్వారా దాడులు చేసి జిల్లాలో 155 కేసులు నమోదు చేశామని, పది కోట్ల విలువగల సరుకులు సీజ్ చేసినట్లు తెలిపారు. జిల్లాలో ధాన్యం సేకరణకు 620 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇంతవరకు 2.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, గత మూడు సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. బియ్యం, గ్యాస్ సిలిండర్లు, ఆయిల్‌పై ఏమైనా ఫిర్యాదులు ఉంటే 8008801450 కు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం ఇస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లా వినియోగదారుల మండలి సలహాదారులు ఎన్.శ్రీనివాస్ మాట్లాడుతూ డబ్బులు చెల్లించి వస్తువులు కొనుగోలు చేసేవారు సేవలు పొందేవారందరు వినియోగదారులేనని అన్నారు. వినియోగదారులకు రక్షణగా ప్రభుత్వం వినియోగదారుల పరిరక్షణ చట్టం 1986 ను తీసుకవచ్చిందని తెలిపారు. మోసపోయిన వినియోగదారులకు ఉచిత, సత్వర న్యాయం లభిస్తుందని అన్నారు. అట్టివారికి జిల్లా వినియోగదారుల ఫోరంలో ఆరు నెలల్లో తీర్పు వెలువడుతుందని తెలిపారు. జిల్లా ఫోరంలో కేసు వేస్తే న్యాయవాది అవసరం లేదని, ఎవరైనా సంప్రదించవచ్చునని తెలిపారు. జిల్లా వినియోగదారుల ఫోరంలో ఇంతవరకు పది వేలకు పైగా కేసులు పరిష్కారమైనాయని, దాదాపు 15 కోట్లకు పైగా జరిమానా విధించినట్లు తెలిపారు. వినియోగదారులు ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి కె.లింగయ్య, జిల్లా వినియోగదారుల సమాచారం కేంద్రం కో-ఆర్డినేటర్ వి.లక్ష్మణ్ కుమార్, ఎస్సారార్ కళాశాల లెక్చరర్ మనోహరాచారి, రాజీవ్ విద్యామిషన్ సిఎంఓ శ్రీనివాస్, ఎఎంఓ ప్రభాకర్ రావు, శరత్ చంద్ర, కరీంనగర్ వినియోగదారుల మండలి సలహాదారులు ప్రకాశ్ హొల్లా, టి.గంగారాం, అధ్యక్షులు నారాయణ, కార్యదర్శి రాంచంద్రారెడ్డి, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు.
బ్యాంకు సమ్మె సక్సెస్
నిలిచిపోయిన వ్యాపార లావాదేవీలు
తీవ్ర ఇబ్బందులుపడ్డ ఖాతాదారులు
ఎటిఎం కేంద్రాల వద్ద జన సందడి
కరీంనగర్ టౌన్, డిసెంబర్ 18: యే డాది గడుస్తున్నా పదవ వేతన ఒప్పం దం అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యుఎఫ్‌బియు) ఆధ్వర్యం లో చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం జిల్లాలోని అన్ని జాతీయ బ్యాంకుల ఉద్యోగులు తమ విధులను బహిష్కరించి బ్యాంకులను బంద్ నిరసన తెలియజేశారు. జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో ఎస్‌బిహెచ్, ఎస్‌బిఐ, ఆంధ్రాబ్యాంక్‌లతోపాటు పలు జాతీయ బ్యాంకుల ఎదుట ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేట్ బ్యాంకులకు ఇష్టమొచ్చినట్లు అనుమతులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. బ్యాంకులు మూసివేయడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులుపడగా, ఎటిఎం కేంద్రాల వద్ద జన సందడి నెలకొంది. జిల్లాలో సుమారు 200లకుపైగా జాతీయ బ్యాంకులు మూసివేయగా, కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలకు ఆటంకం కలిగింది. జిల్లాలో సమ్మె విజయవంతమైందని బ్యాంకు ఉద్యోగుల సంఘాల నాయకులు తెలిపారు. జిల్లా కేంద్రంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఆయా బ్యాంక్‌ల యూనియన్ నాయకులు జీవన్‌కుమార్, కె.వెంకటేశ్వర్‌రావు, ఎ.ఎల్.ఎన్. శ్రాస్తి, బాషుమియా, నందకిషోర్, శ్రీనివాస్, కృష్ణ, వెంకటేశ్వర్లు, సలీంపాషా, శ్రీకాంత్‌లతోపాటు పలువురు నాయకులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యేడాది గడుస్తున్నా, పదవ వేతన ఓప్పందాన్ని అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన పదవ వేతన ఒప్పందాన్ని అమలు చేయడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
‘్భమి’ కథనానికి స్పందన
నకిలీ విలేఖరులపై విచారణకు ఆదేశం
జగిత్యాల, డిసెంబర్ 18: ‘నకిలీలు తస్మాత్ జా గ్రత్త’ అనే ‘ఆంధ్రభూ మి’లో వచ్చిన కథనానికి జి ల్లా ఎస్పీ శివకుమార్ స్పం దించారు. నకిలీ విలేఖరుల ఆచూకీపై కోరుట్ల పోలీసులను విచారణకు ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేర కు కోరుట్ల పోలీసులు వ్యాపారులను బెదిరింపులకు గురి చేసి న విలేఖరుల గూర్చి ఆరా తీయగా వ్యాపారులను బెదిరింపులకు గురి చేసింది అసలు విలేఖరులు కాదని, ఇది నకిలీల పనేనని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మేరకు వ్యాపారులు నకిలీ విలేఖరుల గూర్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా, విలేఖరుల పేరుతో వ్యాపారులను బెదిరించి డబ్బులు దండుకునేందుకు యత్నించిన నకిలీల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా వ్యాపారులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు పలువురు నకిలీ విలేఖరుల ఫోన్ నెంబర్లను తీసుకొని వీరితో పాటు నేరుగా రైస్‌మిల్లులకు వచ్చి విలేఖరుల పేరుతో బెదిరించి డబ్బులు కావాలని డిమాండ్ చేసిన వారి వివరాలను ఆధారాలతో సహా సేకరించి పోలీసులు విలేఖరుల ముసుగులో వ్యాపారులను బెదిరించింది నకిలీల పనేనని తేల్చారు. నలుగురు విలేఖరుల పేరుతో నకిలీలు వ్యాపారులను బెదిరింపులకు గురి చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ శివకుమార్‌కు బుధవారం రాత్రి సమాచార విచారణ కొనసాగించిన నకిలీ విలేఖరుల వివరాలు వెల్లడించినట్లు తెలిసింది.
సభా సమయాన్ని
వృథా చేస్తున్నారు..
రాష్టప్రతిని అవమానపరుస్తున్నారు
దీనికి కిరణ్, చంద్రబాబులే కారణం
టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి
కరీంనగర్ టౌన్, డిసెంబర్ 18: తెలంగాణ ముసాయిదా బిల్లు విషయంలో సీమాంధ్ర ఎమ్మెల్యేలు, నాయకులు వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చించకుండా దాటవేస్తూ సభా సమయాన్ని వృధా చేస్తున్నారని తెలిపారు. బుధవారం సాయంత్రం నగరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభా సమయాన్ని వృధా చేయడమేకాకుండా రాష్టప్రతిని సైతం అవమానపరుస్తున్నారని అన్నారు. శాసనసభా గంట సేపు కొనసాగితే సమారు 5లక్షల 25వేల రూపాయల ఖర్చు అవుతుందని తెలిపారు. తెలంగాణ బిల్లుపై చర్చించకుండా రెండ్రోజులుగా సభా సమయాన్ని వృధా చేస్తూ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి తెలంగాణ బిల్లుపై చర్చించి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చునని అన్నారు. ఇంకా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగుతుందని అనుకుంటే అది వారి భ్రమే అవుతుందని అన్నారు. ఆరునూరైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని చెప్పారు. కిరణ్, చంద్రబాబు డైరెక్షన్‌లో సీమాంధ్ర ఎమ్మెల్యేలు నడుస్తున్నారని ఆరోపించారు. బిల్లుపై చర్చించి మీ ప్రాంత సమస్యల్ని పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు రవీందర్ సింగ్, గుంజపడుగు హరిప్రసాద్, బొడిగె శోభ, అనంతుల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

ఓ వైపు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేస్తా
english title: 
tappula tadaka

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>