‘‘భూదేవి’’ (నవల),
తోటపల్లి
జగన్మోహనరావు,
ముద్రణ మరియు
ప్రతులకు: తెలంగాణ
రిసోర్స్ సెంటర్,
హైదరాబాద్.
వెల: రు.100,
పేజీలు. 184.
గ్లోబలైజేషన్‌లో భాగంగా
మైనింగ్ పరిశ్రమను
ప్రైవేట్‌పరం చేయడంతో
బొగ్గు, ఇసుక, ఇనుము,
రంగురాళ్ళు,
సున్నపురాయి, గ్రానైట్‌తో
సహా అన్నిరకాల ఖనిజ
సంపదను, నీటి
వనరులను
పెట్టుబడిదారులు
కొల్లగొడుతున్నారు.
దేశవ్యాప్తంగా ఈ రకమైన
దోపిడి కొనసాగుతున్నది.
ముఖ్యంగా ఉత్తర
తెలంగాణలో సుమారు
800 చదరపు కిలోమీటర్ల
పరిధిలో బొగ్గు గనుల
ఓపెన్ కాస్టులతోనూ
ఖమ్మం, నల్లగొండ
జిల్లాలో నీటి ప్రాజెక్టుల
వల్లనూ- కరీంనగర్,
వరంగల్, ఖమ్మం,
నిజామాబాద్, మెదక్,
ఆదిలాబాద్ జిల్లాల్లో
సుమారు మూడున్నర
వేల గ్రానైట్ మైనింగుల
వల్లనూ- సున్నపురాయి
గుట్టల మైనింగ్, ఇసుక
ఇంకా ఇతర మైనింగుల
వల్లనూ- అటవీ సంపద
తరలింపుల వల్లనూ-
చివరకు చెరువులు,
కుంటలు పూడ్చివేయడం
వల్లనూ పర్యావరణాన్ని
నాశనం చేస్తున్నారు.
ఇప్పటికే కరీంనగర్
చుట్టుపక్కల వున్న
గుట్టలను కూల్చివేయగా
అటవీ సంపద నాశనమై,
దానిమీద ఆధారపడ్డ
వాళ్ళకు బ్రతుకుతెరువు
లేకుండా పోయింది.
నివాసాలు కోల్పోయిన
అడవి జంతువులతో
ఊళ్ళోవాళ్ళు
ప్రాణభయాన్ని
ఎదుర్కొంటున్నారు.
గుట్టల కూల్చివేతతో
వాతావరణంలో
పెనుమార్పులు
సంభవిస్తాయి. ఉష్ణోగ్రతలు
పెరిగిపోతాయి. వర్షపాతం
తగ్గిపోతుంది.
కూల్చివేతలు జరిగిన
చుట్టుపక్కల గ్రామాలలో
ఉపరితల,
భూగర్భజలాలు
అడుగంటిపోతాయి.
దాంతో చుట్టుపక్కల
వుండే చెరువులు,
వాగులు, వంకలు అన్నీ
ఎండిపోయే
ప్రమాదముంది. తాగునీటి
కొరత, కాలుష్యంతోపాటు
విచ్చలవిడి గ్రానైటు
మైనింగ్‌వల్ల పది
సంవత్సరాలలోనే జిల్లా
ఎడారిగా మారిపోనుంది.
నక్సలైట్ల భయంతో
పట్టణాలకు తరలివెళ్ళిన
భూస్వాములే, ఊళ్ళల్లో
ఉన్న తమ తొత్తుల
అండతో
పెట్టుబడిదారులుగా
మళ్ళీ గ్రామాల్లో ప్రవేశించి,
ప్రకృతి సంపదను
కొల్లగొడుతూ
పర్యావరణాన్ని నాశనం
చేస్తున్నారు. ప్రభుత్వం,
పోలీసుల అండతో
రెచ్చిపోయి ప్రజలను
భయభ్రాంతులను చేసి
తమ పనులను
చక్కబెట్టుకుంటున్నారు.
ఈ పెట్టుబడిదారుల
కబంధ హస్తాలనుండి
పర్యావరణాన్ని, తమ
ప్రాంతాన్ని
రక్షించుకోవడానికి
ప్రజలను చైతన్యపరిచి,
ఉద్యమింపజేయడం
కోసమే తోటపల్లి
జగన్మోహనరావు ఈ ‘‘
్భదేవి’’ నవలను
రాశారు.
కరీంనగర్ జిల్లాలో గ్రానైట్
కంపెనీలకోసం
విధ్వంసమవుతున్న
గుట్టల గురించి, ఆ
గుట్టలను
కాపాడుకోవడానికి ప్రజలు
చేస్తున్న పోరాటాల
గురించి, ఆ పోరాటాలను
సంఘటితం చేస్తున్న
పర్యావరణవాదుల కృషి
గురించి, బయటినుంచి
ప్రజాస్వామ్యవాదుల
నుంచి వస్తున్న
సంఘీభావం గురించి ఈ
నవల చిత్రీకరించింది.
ప్రధానంగా ఈ గుట్టలను
కాపాడుకోవడం గురించి
చర్చిస్తూ, అవి
లేకపోవడంవల్ల కలిగే
నష్టాలను వివరిస్తారు.
పర్యావరణ పరిరక్షణలో
భాగంగా ఇతర
పర్యావరణ సమస్యల
గురించి కూడా
వివరిస్తారు. అలా సెజ్‌ల
పేరిట భూములు
కోల్పోయిన నిర్వాసితుల
గురించి, పోలెపల్లి
పోరాటం గురించి
వివరిస్తారు. దేవాదుల
ప్రాజెక్టువల్ల రామప్ప
దేవాలయం నాశనం
కాకుండా కాపాడుకున్న
విధానాన్ని
తెలియజేస్తారు. వర్లపల్లి
గ్రామంలో మిథనాల్
ఫ్యాక్టరీ వెదజల్లుతున్న
కాలుష్యం పట్ల ఆందోళన
వెల్లిబుచ్చుతారు.
ఇవేకాకుండా
రాజ్యహింసను భరించలేక
ఎంతోమంది యువకులు
గల్ఫ్ దేశాలకు
పనులకోసం
ఆస్తులమ్ముకుని,
అప్పులుచేసి పోవడం-
వీసాల పేరుతో చేసే
మోసాలు- వాళ్ళు
అక్కడకుపోయి పడే
కష్టాల గురించి
విపులంగా
తెలియజేశారు. అలా
గల్ఫ్‌కి వెళ్ళి తిరిగివచ్చిన
యువకుడు వెంకటగౌడ్
నాయకుడిగా ఈ నవల
కొనసాగుతుంది. వనరుల
దోపిడీ నిరాటంకంగా
కొనసాగడానికి
ప్రజాప్రతినిధులు,
అధికారులు, పోలీసులు
సహకరిస్తుంటే, దాన్ని
అడ్డుకునే దమ్ము
ఎవరికుంటుంది?
ముఖ్యంగా నక్సలిజం
పేరిట గ్రామాలలో
భయానకం సృష్టించి
వాళ్ళను హడలగొట్టి,
దోపిడీదారులను ఎవరూ
నిలదీయకుండా ముందు
జాగ్రత్తలు తీసుకున్న
పోలీసుల చర్యను
రచయిత చిత్రీకరించిన
విధానం బాగుంది.
పర్యావరణ పరిరక్షణకోసం
ఉద్దేశించిన ఈ నవల
లక్ష్యం మంచిదే. ఈ దిశగా
రచయిత సేకరించిన
విస్తృత సమాచారాన్ని
నవలగా మలచడంలో
మరింత కృషిచేయాల్సి
వుంది. నవలలో
ఏకసూత్రత లోపించింది.
రిపిటీషన్ ఎక్కువైంది.
ఇది తెలంగాణకే
పరిమితమైన సమస్య
కాదు. దేశవ్యాప్తంగా
జరుగుతున్న వనరుల
దోపిడీగా గుర్తించాలి. ఈ
దోపిడి కొద్దిమంది
వ్యక్తులు, కొన్ని సంస్థలు
పోరాడితే ఆగేది కాదు.
ప్రజలలో చైతన్యం
తీసుకువచ్చి,
సామూహికంగా పోరాడితే
తప్ప ఈ విధ్వంసాన్ని
ఎదుర్కోలేరని రచయిత
సూచించిన విధానం
బాగుంది. డాక్యుమెంటరీ
కథనాన్ని తలపింపజేసే
ఈ నవల
సమాచారాత్మకంగా
వుండి ప్రజలను
చైతన్యపరచడానికి
తోడ్పడుతుంది.