ఆకివీడు, డిసెంబర్ 22: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన ఏర్పాట్లను ప్రణాళికబద్ధంగా పనిచేసి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ అధికారులను కోరారు. ఆదివారం ఆకివీడు మండలం అయిభీమవరం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ మందిరంలో జరిగిన జిల్లాస్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్టప్రతి పర్యటనకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్‌లో రాష్టప్రతి వచ్చిన ఇక్కడకు వచ్చిన దగ్గర నుండి తిరిగి వెళ్ళేవరకు ప్రతి విషయంలోను అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలన్నారు. ఎవరికి అప్పగించిన బాధ్యత వారు సక్రమంగా నిర్వర్తించాలని కోరారు. అతి తక్కువ సమయంలో ఎన్నో కార్యక్రమాలను విజయవంతం చేసిన సమర్ధవంతమైన అధికారులు జిల్లాలో ఎంతోమంది ఉన్నారని, వారంతా అంకితభావంతో పనిచేయాలని కోరారు. టిటిడి చైర్మన్, నరసాపురం ఎంపి కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ పర్యటన మూడునెలల ముందే ఖరారవుతుందని, అయితే తనపై ఉన్న నమ్మకం, విశ్వాసంతో తక్కువ సమయంలో పర్యటనకు అంగీకరించడం గొప్ప విషయమన్నారు. ఈ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ప్రతి అధికారి సమర్ధవంతంగా పనిచేసి పర్యటన విజయవంతం చేయాలన్నారు. టిటిడి జెఇఒ టి.్భస్కర్ మాట్లాడుతూ అడుగంటిపోతున్న వేద విద్యను ప్రోత్సహించడానికి రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరై భావితరాలకు అందించేందుకే ఈ వేద పాఠశాల ప్రారంభోత్సవం చేస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 29వ తేదీ ఉదయం 11.50 నిమిషాలకు అయి భీమవరంలో వేద పాఠశాల ప్రాంగంణలో రాష్టప్రతి చేరుకుంటారని భాస్కర్ వివరించారు. ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికిన అనంతరం ప్రాంగణంలో రాష్టప్రతి చేరుకుంటారన్నారు. జ్ఞానమందిరం వద్ద 5 వేదాలకు సంబంధించిన వేదాపారాయణంలో రాష్టప్రతి పాల్గొంటారని తెలిపారు. వేద పాఠశాల ప్రారంభోత్సవం అనంతరం పైలాన్ ఆవిష్కరిస్తారని ఆయన చెప్పారు. వెంకటేశ్వరస్వామి విగ్రహప్రతిష్ఠ, హారతి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం పాఠశాల వద్ద ఉన్న వేదిక వద్దకు చేరుకొని టిటిడి వేద పాఠశాల ఉపాధ్యాయులతో వేదంపై ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎస్.హరికృష్ణ, జెసి టి.బాబూరావునాయుడు, టిటిడి ఎస్‌ఇ రామచంద్రమూర్తి, ఇఇ నాగేశ్వరరావు, ఇఇ శ్రీ హారి, ఆర్డీఒ వసంతరావు, డిఎస్పీ రఘువీరారెడ్డి, భీమవరం రూరల్ సిఐ శివాజీరావు, జిల్లాలోని అధికారులు పాల్గొన్నారు.
హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్
రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ ఈ నెల 29వ తేదీ మండలంలోని అయి భీమవరం విచ్చేస్తున్న సందర్భంగా అయి భీమవరం రోడ్డులోని లయన్స్ క్లబ్ ఆడిటోరియం ఎదురుగా ఉన్న స్థలంలో ఏర్పాటుచేసే హెలీప్యాడ్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం టిటిడి వేద పాఠశాలను సందర్శించారు. అక్కడ ఏర్పాటుచేసిన వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని కలెక్టర్ పరిశీలించారు. టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు, అన్నపూర్ణమ్మ దంపతుల వేద పాఠశాల వివరాలను కలెక్టర్‌కు వివరించారు. అనంతరం సాయిబాబాను కలెక్టర్ సిద్దార్దజైన్, జిల్లా ఎస్పీ హారి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కలెక్టర్ వెంట జెసి బాబూరావునాయుడు, నరసాపురం ఆర్డీఒ వసంతరావు తదితరులున్నారు.
రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన ఏర్పాట్లను ప్రణాళికబద్ధంగా పనిచేసి
english title:
rashtrapathi
Date:
Monday, December 23, 2013