Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఆకట్టుకున్న మ్యాజికార్టా

$
0
0

భీమవరం, డిసెంబర్ 22: భీమవరం వెస్ట్ బెర్రి ఆవరణలో పొగో మ్యాడ్ టీమ్స్ వెస్ట్ బెర్రి స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో మ్యాజికార్టా- మ్యాజిక్ ఆర్ట్స్ వర్క్‌షాపు ఆదివారం ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను వెంటబెట్టుకొని ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ షోలో మ్యాజిక్ ట్రిక్స్‌ను ప్రత్యక్షంగా చూసి ఆనందించారు. మ్యాజికార్టాలో హైదరాబాద్‌కు చెందిన మెజీషియన్ ఎస్.వెంకట్ స్వయంగా కొన్ని రకాల వస్తువులను విద్యార్థులతో తయారుచేయించారు. విద్యార్థులు ఎంతో చురుకుగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. పిల్లల చేత ఇలా చేయించడంతో వారిలో ఆసక్తి పెంచడం, తద్వారా విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి, అద్భుతాలు సృష్టించడానికి దోహదం చేసేలా ఉందని పలువురు కొనియాడారు. స్కూలు ప్రిన్సిపాల్ ఎం.శిరీష మాట్లాడుతూ భీమవరం పరిసర ప్రాంత విద్యార్థులకు ఆసక్తికరమైన మ్యాజిక్ మెళకువలు, పిల్లలు శ్రద్ధను కేంద్రీకరించడానికి, తద్వారా టీమ్ వర్కు, డెవలప్‌మెంట్ విద్యార్థులు ఇటు తల్లిదండ్రులతోను, అటు సహచరులతోను కలిసి వారిలో సృజనాత్మకతను, మ్యాజిక్ సైన్సులోని పరిశోధనాత్మక అంశం మీద అవగాహన పెంపొందించుకోవడానికి ఈ వర్కుషాపు ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. స్కూల్ డైరెక్టర్ ఎన్.మహేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో మానసిక వికాసాన్ని, కళానైపుణ్యాన్ని పెంపొందించేందుకు మ్యాజిక్, ఆర్ట్ వర్కుషాపు ఎంతో దోహదం చేస్తుందన్నారు. సుమారు వందమందికి పైగా విద్యార్థులు, తల్లిదండ్రులు మ్యాజికార్టాలో పాల్గొని అత్యంత ఆనందంగా గడిపారు. వినోదం, విజ్ఞానం, విద్యావికాసం వంటి లక్షణాలను పిల్లల్లో పెంపొందించేలా మ్యాజికార్టా నిర్వహించిన వెస్ట్‌బెర్రి స్కూల్ యాజమానాన్ని పలువురు తల్లిదండ్రులు అభినందించారు. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది ఈ మ్యాజికార్టాలో పాల్గొన్నారు.

ప్రజారోగ్యానికి ప్రాధాన్యం
ఏలూరు, డిసెంబర్ 22 : వైద్యశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మాణం ద్వారా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ఆదివారం ఏలూరు మండలం చాటపర్రు గ్రామంలో 58 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలో చాటపర్రు నుండి కొల్లేరు సరస్సు వరకు కోటీ 97 లక్షల రూపాయలతో నిర్మించిన ఆర్ అండ్ బి రోడ్డును ఆయన ప్రారంభించారు. అనంతరం చాటపర్రు గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద జరిగిన సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కేంద్ర మంత్రి సాంబశివరావు మాట్లాడుతూ నగరాలు, పట్టణాలకు ధీటుగా గ్రామాలు అభివృద్ధి చెందిననాడే ప్రజలు సుఖశాంతులతో ఉంటారని, అందువలన రహదారులు, వైద్య శాలలు, మంచినీటి సదుపాయాలు కల్పనకు ప్రభుత్వం అత్యంత నిధులు కేటాయిస్తోందని అన్నారు. చాటపర్రు గ్రామానికి మంచినీటి సరఫరాకు అవసరమగు ఫిల్టర్ బెడ్‌లు, పైపులైన్లు నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని, రహదారులు, కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానన్నారు.
దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ చాటపర్రు గ్రామ పంచాయతీ మేజరు పంచాయితీగా ఉన్నప్పటికీ నిధులు కొరత వలన అభివృద్ధి చెందలేకపోతున్నదన్నారు. అందువల్ల గ్రామాభివృద్ధికి, రహదారులకు, మంచినీటి సరఫరాకు, డ్రైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి సాంబశివరావు కృషి చేయాలని కోరారు. నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం కొరకు ప్రభుత్వ భూముల్లో అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎపిఐడిసి ఛైర్మన్ ఘంటా మురళీ రామకృష్ణ, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు నాగచంద్రారెడ్డి, డిఎంహెచ్‌వో డాక్టర్ టి శకుంతల, సినీ నటుడు మాగంటి మురళీమోహన్, ఆల్ ఇండియా హ్యాండీ క్రాఫ్ట్స్ బోర్డు సభ్యులు పెరికే వరప్రసాదరావు, గ్రామ సర్పంచ్ దొడ్డిగర్ల భాగ్యశ్రీ, ఆర్డీవో బి శ్రీనివాస్, తహశీల్దార్ ఎజి చిన్నికృష్ణ, మాజీ జడ్పీటీసీ ఎస్ బాబ్జీ, ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.

మావుళ్లమ్మ అమ్మవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు
భీమవరం, డిసెంబర్ 22: భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని జిల్లా హైకోర్టు న్యాయమూర్తులు ఆకుల శేషసాయి దంపతులు, డి. శేషాద్రినాయుడు దంపతులు, వైవి సూర్యప్రసాద్ ఆదివారం దర్శించుకున్నారు. ముందుగా వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధరరావు, చైర్మన్ కంబాల రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల రామలింగేశ్వరశర్వ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందచేశారు. అనంతరం వారిని ఆలయ ఇఒ సూర్యచక్రధరరావు అమ్మవారి శేష వస్త్రాలతో ఘనంగా సన్మానించి అమ్మవారి చిత్రపటాలను అందచేశారు. వీరి వెంట న్యాయమూర్తి షణ్ముఖరావు, భీమవరం బార్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. మావుళ్ళమ్మ దేవస్థానం పాలకమండలి సభ్యులు కొప్పుల సత్తిబాబు, మునగాల వెంకట సుబ్బారావు, టంగుటూరి వెంకట సుబ్బారావు, అన్నాబత్తుల నాగేశ్వరరావు, పడమటి వెంకటేశ్వరరావు, కారుమూరి సత్యనారాయణమూర్తి న్యాయమూర్తులను సత్కరించారు.

రాజధాని వెళ్లిన కలెక్టరు
ఏలూరు, డిసెంబర్ 22: జిల్లా కలెక్టరు సిద్ధార్ధ్‌జైన్ ఆదివారం రాత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. సోమవారం అక్కడ ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సమావేశంలో ఆయన పాల్గొంటారు. మంగళవారం ఉదయానికి జిల్లాకు చేరుకుంటారు.

సిఎపై విచారణలో గందరగోళం
తాళ్లపూడి, డిసెంబర్ 22: మండల ఐకెపి పరిధిలోని గజ్జరంలో వచ్చిన కమ్యూనిటీ ఆక్టివిస్ట్ (సిఎ)పై వచ్చిన ఆరోపణలపై చేపట్టిన విచారణ అర్ధాంతరంగానే ముగిసిపోయింది. ఐకెపి ఎసి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అయిదుగురు సభ్యులతో కూడిన బృందం ఆదివారం మధ్యాహ్నం గజ్జరంలో విచారణ చేపట్టారు. ఈ విచారణకు 31 గ్రూపులకు చెందిన మహిళా సభ్యులు హాజరుకావలసి ఉండగా, 21 గ్రూపులకు చెందిన సభ్యులు మాత్రమే హాజరయ్యారు. పిడి ఆదేశాల మేరకు గజ్జరం రెండవ గ్రామ సంఘం నుండి వచ్చిన ఆరోపణల మేరకు చేపట్టిన విచారణలో రెండు అంశాలపై విచారణ సాగింది. పిఒపి పథకం కింద విడుదలైన రూ.1.2లక్షలలో రూ.12వేలు అప్పటి మండల సమాఖ్య అధ్యక్షురాలు భీష్మాంబకు చెల్లించామని తెలిపారు. ఇది కాక మరికొన్ని ఆరోపణలపై విచారణ చేపట్టవలసి ఉండగా సభ్యుల మధ్య, మండల సమాఖ్య సభ్యుల మధ్య ఏర్పడిన వివాదంతో దర్యాప్తు అర్ధాంతరంగా నిలిచిపోయింది. సమావేశం సమాచారం తెలుసుకున్న తాళ్లపూడి, తాడిపూడి, అన్నదేవరపేట, వేగేశ్వరపురం గ్రామాలకు చెందిన సర్పంచ్ వర్గాలు తమ గ్రామంలో కూడా ఐకెపి అక్రమాలు చోటుచేసుకున్నాయని, వాటిపై కూడా దర్యాప్తు నిర్వహించాలని కోరారు. తమ గ్రామ సంఘాల సమస్యల విషయంలో భీష్మాంబ, రేఖలు జోక్యం చేసుకోవటం వల్లే సమస్యలు పరిష్కారం కావటం లేదని గజ్జరం గ్రామ మహిళలు ఆరోపించారు. ఏరియా కోఆర్డినేటర్ (ఎసి) వెంకటేశ్వరరావు, కమిటీ మాజీ సభ్యులు భీష్మాంబ, రేఖలు సైతం ఆరోపణలు ఎదుర్కొంటుండగా వారు విచారణ కమిటీలో సభ్యులుగా రావటమేమిటని తాడిపూడి ఉప సర్పంచ్ గంటా కృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని డిఆర్‌డిఎ పిడి దృష్టికి తీసుకెళ్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విచారణాధికారులుగా జిల్లా నుండి డిపిఎం ఎ శ్రీనివాసరావు, ఎస్‌కె వౌలానా, జిల్లా సమాఖ్య సభ్యురాలు సారుూశ్వరి, కుమారితోపాటు ఎసి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అయితే విచారణాధికారిగా వచ్చిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గజ్జరంలోని ఆరోపణలపై విచారణ ఒక సమావేశంతో ముగిసేది కాదని, మరికొన్ని సమావేశాలు నిర్వహించవలసి ఉందని తెలిపారు.

మార్చి 27 నుంచి టెన్త్ పరీక్షలు
ఏలూరు, డిసెంబర్ 22 : పదవ తరగతి పరీక్షలు మార్చి 27 నుంచి ఏప్రిల్ 15వ తేదీవరకు జరుగుతాయని డి ఇవో ఆర్ నరసింహరావు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. మార్చి 27న తెలుగుపేపర్-1, 28న తెలుగుపేపర్-2, 29న హిందీ, ఏప్రిల్ 1న ఇంగ్లీష్ పేపర్-1, ఏప్రిల్ 2న ఇంగ్లీష్ పేపర్-2, 3న లెక్కలు పేపర్-1, 4న లెక్కలు పేపర్-2, 7న సైన్స్‌పేపర్-1, 9న సైన్స్‌పేపర్-2, 10న సోషల్ స్టడీస్ పేపర్-1, 11న సోషల్ స్టడీస్ పేపర్-2, 12న సంస్కృతం పేపర్-2, 15న ఒకేషనల్ కోర్సు థియరీ పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు.

టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు హరిశ్చంద్రరావు మృతి
బుట్టాయగూడెం, డిసెంబర్ 22: తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నందిన హరిశ్చంద్రరావు (65) ఆదివారం ఉదయం హైదరాబాదులో మృతి చెందారు. ఈయన గత నెలరోజులుగా తీవ్ర అస్వస్థతతో హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు. హరిశ్చంద్ర స్వస్థలం మండలంలోని ముప్పినవారిగూడెం కాగా గత కొనే్నళ్ళుగా జంగారెడ్డిగూడెంలో నివసిస్తున్నారు. 1986 నుండి 1989 వరకు పోలవరం వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించి, రైతులకు సేవలందించారు. నాలుగేళ్ళుగా జిల్లా టిడిపి ఉపాధ్యక్షుడుగా పార్టీకి ఎనలేని సేవలందిస్తున్నారని పార్టీ శ్రేణులు తెలిపారు. ప్రస్తుతం రెండవపారి పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారని చెప్పారు. ఈయన కృషితో పోలవరం నియోజకవర్గంలో నాల్గుసార్లు శాసనసభ్యులను గెవిపించినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో పార్టీకి పెద్దదిక్కుగా ఉంటూ, సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించే వ్యక్తిగా గుర్తింపు పొందినట్లు తెలిపారు.
ఏడాది క్రితం హరిశ్చంద్ర సతీమణి మంగాయమ్మ మృతి చెందారు. ఈయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. హరిశ్చంద్ర అంత్యక్రియలు సోమవారం ముప్పినవారిగూడెంలో జరుగుతాయని చెప్పారు. హరిశ్చంద్ర మృతికి పార్టీనేతలు పాలడుగుల కోటేశ్వరరావు, మొగపర్తి సోంబాబు, మొడియం శ్రీనివాసరావు, ఆలపాటి దుర్గారావు, గద్దే శీతయ్య, యాంట్రప్రగడ శ్రీనివాసరావు, కోమటి వీర్రాజు, యంట్రప్రగడ సోమరాజు, నల్లూరి కృష్ణమోహన్, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

భీమవరం వెస్ట్ బెర్రి ఆవరణలో పొగో మ్యాడ్ టీమ్స్ వెస్ట్ బెర్రి స్కూల్
english title: 
magicarta

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles