ఆదిలాబాద్ (రూరల్), మార్చి 8: ఉప ఎన్నికల్లో సిపిఎం పార్టీకి పట్టం కడితే గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని, ఒక్కసారి అవకాశం కల్పించాలని సిపిఎం అభ్యర్థి లంక రాఘవులు అన్నారు. గురువారం నాడు బేల, జైనథ్ మండలాల్లో సిపిఎం పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించగా, ప్రజలు డప్పులు వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభ్యర్థి లంక రాఘవులు ఇంటింటికి వెళ్తూ ప్రచారం నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడారు. నిరుపేద మధ్య తరగతి వర్గాల సమస్యలపై పోరాటాలుచేసేది ఒక్క సిపిఎం పార్టీయే అన్నారు. ముఖ్యంగా భూ సమస్యలపై పోరాటాలుచేసి నిరుపేదలకు భూములు పంపిణీ చేసే విధంగా కృషి చేయడం జరిగిందన్నారు. గ్రామాల్లో ప్రజల ఎదుర్కొనే సమస్యలు తెలుసుఅని, ఈ ఉప పోరులో సిపిఎం పార్టీకి పట్టం కడితే సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికీ పలు గ్రామాల్లో కనీస వసతులు లేక పోవడం శోచనీయమని, నీటి కోసం ప్రతి వేసవిలో ప్రజలు పడరాని పాట్లు పడుతుండడం జరుగుతుందన్నారు. బేల మండలంలో నీటి సమస్యప్రతీ సారితీవ్రంగా వుంటోందని, ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు మాధవ్, బండి దత్తాత్రి, కుంటాల రాములు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం అభ్యర్థి రాఘవులు
english title:
f
Date:
Friday, March 9, 2012