![](http://www.andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/veeraji_4.jpg)
పాట్నా రిజిస్ట్రార్ ఆఫీసులో 2005కి ముందున్న ‘కవిలి కట్ట’లన్నీ- కంప్యూటర్‌లోకి ఎక్కించలేదు. అవన్నీ చీకటి గదుల్లో దొంతర్లుగా మ్రగ్గుతున్నాయి. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ అయిపోతే మొత్తం ఫైల్స్ అన్నీ- సర్వభక్షుడు- అగ్నిదేవుఁడు మ్రింగేస్తాడేమోనన్న భయంతో అక్కడ ‘నో కరెంట్’. ఒక గుమాస్తా ఫైలుకోసం దస్తావేజుల గదిలోకి ప్రవేశించి ఫైల్ తియ్యబోంగానే అది ‘బుస్సు’మంది. హడలి చచ్చాడు. మరో గుమాస్తాకి కూడా అదే అనుభవం భయం రూపంలో వెనె్నముక లోంచి క్రిందికి జారింది. మరింక వాళ్లు ఫైళ్ల రూమ్‌లోకి ‘బాబోయ్’ అడుగు పెట్టమన్నారు. కానీ 250 దాకా దస్తావేజుల సర్ట్ఫికెట్లకోసం ‘అర్జీ’లు పెండింగ్‌లో వున్నాయి. అసలు సంగతి - చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైనట్లు రుూ ఫైల్స్ ‘పు(గు)ట్టలు’ ఏకంగా త్రాచుపాములకే ఆతిధ్యం యిస్తున్నాయ్.పాముల వాళ్లను పిలిపించారు. వాళ్లు హోం... హ్రీంలతోపాటు ఒక మందు పొడి ‘మంత్రం’తో కలిపి జల్లేస్తారు. ఫైల్సు తడిసిపోతాయ్. కానీ తప్పదు. రెండు త్రాచుపాములు జంటగా పడగవిప్పాయ్. మళ్లీ రుూ నెల పోయిన వారం యిదే తంతు. ఫైలు ముట్టుకుంటే బుస్సుకస్సులు.పాముల వాళ్లొచ్చారు. కానీ, పాములు బయటికి రామంటున్నాయి. 150 సంవత్సరాల ఆస్తిపాస్తుల జాతకాలు ఆ గదుల్లో మూలుగుతున్నాయ్. ‘వేరే జిల్లా పాముల మంత్రగాళ్లని పిలిపిస్తున్నాం అనీ’, సబ్ రిజిస్ట్రారు గారు- వేరే బిల్డింగ్‌కి ప్లాన్లు వున్నాయండీ- కాని అవి అలా మూలుగుతూనే వున్నాయి అన్నాడు. ‘‘అందాకా మా వాళ్లు- ప్రాణాలకు తెగించి- టార్చిలైట్లతో- ఫైల్సుని వెదుకుతూనే వుంటారండీ’’ అని అన్నాడు.‘‘అసలు యింతకీ పాములు వాటంతట అవే దూరుతున్నాయా? ఎవరేనా పాములవాళ్లు తెచ్చి గప్‌చిప్‌న ‘ఒగ్గేస్తు’న్నారా?’’ అన్నాడో డౌటింగ్ థామస్!...