ఇటీవల భారత్‌ను సందర్శించిన పెప్సీ కంపెనీ సీఈఓ ఇంద్రా నూయి మాట్లాడుతూ, తమ సంస్థ రెండు లక్షల ఉద్యోగాలను ఏవిధంగా సృష్టించగలిగిందీ చాలా వివరణాత్మకంగా తెలియజేశారు. ఇదే సమయంలో మనదేశంలో తమ కంపెనీ పెట్టుబడులు రెట్టింపు చేయనున్నట్టు కూడా ప్రకటించారు. పన్నా, నిమ్మరసం, సత్తు, బెల్ రాస్, జల్ జీరా మరియి ఇతర దేశీయ ఆరోగ్యకరమైన స్నాక్స్ భారత్‌లో పుష్కలంగా లభిస్తున్నాయి. కానీ ఎంత ఘనంగా చెప్పుకున్నప్పటికీ పెప్సీ మన దేశంలోకి ప్రవేశించి, కుటీర పరిశ్రమలను దారుణంగా దెబ్బతీసిందన్న మాట అక్షర సత్యం. ఫలితంగా ఈ పరిశ్రమలపై ఆధాపడిన వారు-ముఖ్యంగా గ్రామీణులు- తమ జీవనోపాధిని కోల్పోయారు. వీరితోపాటు చేతివృత్తులవారు కూడా వినాశనాన్ని ఎదుర్కొన్నారు.
ఉదాహరణకు బికనీర్‌కు చెందిన 50వేల మంది మహిళలు ‘్భజియా’ అనే పానీయాన్ని తయారు చేసేవారు. దీన్ని వారు చేత్తోనే తయారు చేసేవారు. మరి మనదేశంలోకి ప్రవేశించిన పెప్సీ కంపెనీ యంత్రాల సహాయంతో శుద్ధి చేసిన ‘్భజియా’ను తయారు చేసి మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని దుష్పరిణామం గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దీని దెబ్బకు 50వేల మంది మహిళలు తమ జీవనోపాధిని కోల్పోయి, బ్రతుకుతెరువుకోసం వీధిన పడ్డారు. మరి ఈవిధంగా ఒక్కొక్క విభాగంలో దేశవ్యాప్తంగా ఉపాధులను కోల్పోయిన వారిని లెక్కిస్తే, వారి సంఖ్య కొన్ని లక్షల్లో ఉంటుంది. ఈ పరిస్థితిని గమనించే..‘‘మహిళా అన్న స్వరాజ్ ఉద్యమాన్ని’’ నవధాన్య ప్రారంభించింది. ఈ ఉద్యమం ముఖ్యోద్దేశం..తినుబండారాలను శుద్ధి చేసే చేతిపనివారి జీవన భృతులను పరిరక్షించడం.
పెప్సీ కంపెనీ వార్షికాదాయం 65 బిలియన్ డాలర్లు! ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార పదార్ధాలు మరియు పానీయాల తయారీ సంస్థగా వెలుగొందుతోంది. మరి వీరు తయారు చేసే స్నాక్స్, పానీయాలను ‘జంక్‌ఫుడ్’ అని పిలుస్తున్నారు. మరి ‘జంక్‌ఫుడ్’ ప్రభావం వల్ల ప్రజల ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించాల్సిన పనిలేదు. జంక్ ఫుడ్ తయారీ పరిశ్రల పుణ్యమాని ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్లమంది ప్రజలు వివిధ రకాల అనారోగ్యాల బారిన పడి బాధితులుగా మిగిలారు. పంజాబ్ సంక్షోభం కొనసాగుతున్న సమయంలో..అంటే 1989లో పెప్సీ కంపెనీ భారత్‌లోకి ప్రవేశించింది. మన దేశంలో ప్రవేశిస్తూనే కంపెనీ ‘శాంతి కోసం పెప్సీ కంపెనీ’ అంటూ గంభీరంగా ప్రకటించింది. మన దేశ ప్రజల ప్రధాన ఆహారమైన వరి, గోధుమల స్థానే టమోటా, బంగాళదుంపలను ఈ కంపెనీ ప్రవేశపెట్టింది. పంజాబ్‌లోని హోషియాపూర్ జిల్లాకు చెందిన ‘జహురా’ ప్లాంట్‌లో టమోటాలను శుద్ధి చేసి ఒక పేస్ట్ మాదిరిగా తయారు చేస్తారు. ఆవిధంగా తయారైన పేస్ట్ జపాన్ మరియు అమెరికాలకు ఎగుమతి అవుతాయి. మరి ఈ టమోటాలు సుదూర ప్రాంతాలకు రవాణా చేయడానికి అనువుగా ఉండేవిధంగా ఉత్పత్తి చేయడం వల్ల, వీటి పైచర్మం చాలా మందంగా ఉంటుంది! అందువల్ల ఇది గృహావసరాలకు వినియోగించడం చాలా కష్టం.
ముందుగా పెప్సీ కంపెనీ ఋణప్రాతిపదికన రైతులకు ఈ రకం టమోటా విత్తనాలను అందజేస్తుంది. అంతేకాదు ఈ పంట మొక్కలను తెగుళ్ళనుంచి కాపాడేందుకు, రైతులకు క్రిమిసంహారక మందులు, రసాయన ఎరువులను అధిక ధరలకు అందజేస్తుంది. 1993లో, కేజీ టమోటాలకు 80 పైసల వంతున రైతులకు చెల్లించింది. కానీ అదే సమయంలో మార్కెట్‌లో కిలో టమోటాల ధర రెండు రూపాయలు పలుకుతోంది. ఇక విత్తనాలకు, క్రిమిసంహారక మందులు, రసాయన ఎరువులకు ఋణంగా తీసుకున్న మొత్తాన్ని మినహాయించుకోగా రైతులకు మిగిలిందేమీ లేకుండా పోయింది. 1994లో హోషియాపూర్ మార్కెట్‌కు కుప్పలు తెప్పలుగా టమోటాలు ఒక్కసారిగా వచ్చి పడటంతో, కొనేవారు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఫలితంగా వాటి ధర కిలోకు 50 పైసలకు పడిపోయింది. ఇక 1996 నాటికి పెప్సీకంపెనీ ప్రయోగం విఫలమైంది. ఇక బంగాళాదుంపను ‘చిప్స్’ తయారీకి వినియోగిస్తారు. ఈ చిప్స్ తయారీకోసం పెప్సీ కంపెనీ మనదేశానికి చెందిన పారిశ్రామిక దిగ్గజం టాటాకు అనుబంధ సంస్థ అయిన వోల్టాస్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం పెప్సీ ఉత్పత్తులైన చిప్స్ మరియు ఇతర సాధారణ పానీయాలను వోల్టాస్ పశ్చిమ భారత దేశమంతటా పంపిణీ చేయాలి. అయితే ఈ పంపిణీలో టాటా కంపెనీకి రూ.72 కోట్ల మేర నష్టం వాటిల్లడంతో...ఒప్పందాన్ని రద్దు చేసుకుని, చాపచుట్టేసింది.
పెప్సీ క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దక్షిణాది జిల్లాల్లోని- హుగ్లీ, బుర్ద్వాన్, బీర్‌భమ్, పశ్చిమ మిడ్నాపూర్, హౌరా మరియా బన్‌కురా- మొత్తం 19 బ్లాకుల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. ఈ జిల్లాలన్నీ కేవలం బంగాళదుంప పండించే జిల్లాలుగా మారిపోయాయి. 2004లో పెప్సీ కో ఇండియా పశ్చిమ బెంగాల్‌లో కాంట్రాక్టు వ్యవసాయాన్ని ప్రారంభించింది. అప్పట్లో కేవలం 800 మంది రైతులతో మొదలైన ఈ కాంట్రాక్టు వ్యవసాయంలో ప్రస్తుతం 6500 మంది రైతులు భాగస్వాములుగా ఉన్నారు. వీరు మొత్తం 2500 ఎకరాల్లో బంగాళాదుంపను సాగు చేస్తున్నారు.
పెప్సీ కంపెనీ మూడు స్థాయిల్లో పెద్ద ఎత్తున లాభాలను ఆర్జిస్తోంది. మొట్టమొదట అది బంగాళాదుంపకు విత్తనాల విషయంలో ‘మోనోపలి’ సాధించింది. ఈ విత్తనాలను, నారును రైతులకు ఎక్కువ ధరలకు అమ్ముతుంది. ఆవిధంగా అమ్మడమేకాదు, వారివద్దనుంచి రాయల్టీలను కూడా వసూలు చేస్తుంది. 2017 నాటికి కేవలం తన యాజమాన్యం కింద పండించే బంగాళాదుంప రకాల ద్వారా 80శాతం ‘కరకర’లాడే చిప్స్‌ను తయారు చేయబోతున్నది. బంగాళాదుంప జీవవైవిధ్యంపై నియంత్రణ సాధించాలని ప్రస్తుతం పెప్సికో యత్నిస్తున్నది. ఇందుకోసం పెరులో ఏర్పాటు చేసిన ‘వ్యవసాయాభివృద్ధి కేంద్రం’లో పెట్టుబడులు పెట్టింది. ఇప్పటికే పెప్సికో స్థానిక ‘ఆండియన్ బంగాళాదుంప’, ద్వారా ‘లేస్ ఆండియాన్స్’ మరియు ‘పసుపు బంగాళాదుంప’ రకం ద్వారా ‘లేస్ పెరునిసిమస్’ను తయారు చేస్తోంది. ఇక రెండో విషయమేమంటే.. కేవలం రైతుల చేత ఒకే పంటను (బంగాళాదుంప) సాగు చేయించడం ద్వారా, పెప్సి కంపెనీ ఏకస్వామ్యాన్ని సాధించాలని చూస్తోంది. ఫలితంగా రైతులను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేయడమే కాదు, వారి వద్ద నుంచి బంగాళాదుంపలను చాలా తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నది. ఇక మూడో విషయమేమంటే, అతి తక్కువ ధరకు కొనుగోలు చేసిన బంగాళాదుంపలనుంచి చిప్స్ తయారు చేసి అధిక ధరలకు అమ్ముకుంటోంది. బిటి పత్తి విషయంలో మాదిరిగానే, పెప్సికో బంగాళాదుంపలు, రైతులను అప్పుల ఊబిలోకి దింపడమే కాకుండా, వారి ఆత్మహత్యలకు కారణవౌతోంది. ప్రస్తుతం పావు ఎకరంలో బంగాళాదుంపను సాగు చేయడానికి రైతులకు రూ. 14వేలు ఖర్చవుతోంది. ఫలితంగా పెట్టుబడికి తగిన విధంగా ఫలితం రాకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. 2011 అక్టోబర్ నుంచి 2012 మార్చి మధ్యకాలంలో 34 మంది పశ్చిమ బెంగాల్ రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో అధికశాతం మంది బంగాళాదుంపలు సాగుచేసే వారే కావడం గమనార్హం. గిల్ కలన్ గ్రామానికి చెందిన రైతు సాగుకోసం రూ. 240,000 ఖర్చు చేయగా, వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఒక ఎకరం పొలాన్ని లక్ష రూపాయలకు అమ్మేయాల్సి వచ్చింది. నడావో గ్రామానికి చెందిన భగవాన్ సింగ్ అనే బంగాళాదుంప సాగు రైతు, పెరుగుతున్న పెట్టుబడుల ఖర్చు, తగ్గిపోతున్న రాబడి వల్ల రుణభారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద సంఖ్యలో రైతులను బంగాళాదుంపలను పండించేందుకు ప్రోత్సహించడం వల్ల, పంట ఉత్పత్తి అధికమై, ధరలు పడిపోతున్నాయి. 2012లో బంగాళాదుంప కిలో 20 పైసలు మాత్రమే పలికిందంటే అం దుకు అధికోత్పత్తే కారణం.
ఎప్పుడైతే రైతుల ఆదాయం పడిపోతున్నదో, పెప్సికో లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. బంగాళాదుంపల ధర కిలోకు 20 పైసలకు పడిపోయినప్పుడు, పెప్సీ కంపెనీ అమ్మే 90 గ్రాముల చిప్స్ ప్యాకెట్ ధర రూ.20లుగా ఉంటోంది. అంటే కిలో చిప్స్ దాదాపు 220 రూపాయలన్నమాట. అంటే పెప్సీ కంపెనీకి లే చిప్స్ కొనుగోలుకు వినియోగదార్లు చెల్లిస్తున్న దాంట్లో, రైతులకు కేవలం 0.1శాతం మాత్రమే అందుతోంది! ఈవిధంగా రైతులనుంచి వందలకోట్ల రూపాయలు కార్పొరేషన్లకు బదిలీ అవుతున్నాయి. ఫలితంగా వ్యవసాయం తీవ్ర వత్తిడికి లోను కావడం, సంస్థలకేమో అత్యధిక లాభాల పంట పండటం నడుస్తున్న చరిత్ర. రైతులకు నష్టం, కార్పొరేట్ సంస్థలకు లాభం అనేది వీరుభయుల మధ్య కొనసాగుతున్న లింకు. రైతులు మార్కెట్లో అమ్మే అతితక్కువ ధరకు, వినియోగదారులు కొనుగోలు చేసే ధరకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. రిటైల్ మార్కెట్లో కిలో బంగాళాదుంప ఖరీదు రూ.22గా ఉంటోంది. ఫలితంగా ప్రభుత్వం కలుగజేసుకొని సబ్సిడీలు ఇవ్వాల్సిన తప్పనిపరిస్థితులు ఏర్పడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్‌లనుంచి బంగాళాదుంపలను కొనుగోలు చేసి, కోల్‌కతా రిటైల్ మార్కెట్లో కిలో 12 రూపాయలకు అమ్మకాలు జరుపుతోంది. అంటే కిలోకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రూ.13గా ఉంటోంది.
ఈ నేపథ్యంలో ‘పశ్చిమ బెంగాల్ వినియోగదారుల సహకార సమాఖ్య లిమిటెడ్’ (కొన్‌ఫెడ్)వారి ఆధీనంలో పనిచేస్తున్న వివిధ వినియోగదారుల సహకార సంస్థల ద్వారా.. కనీసం ఒక మెట్రిక్ టన్ను బంగాళా దుంపలను ఉత్పతి చేసి, 50 కిలోలను రూ. 175కు కొనుగోలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. అంటే కిలోకు రూ.3.50 అన్నమాట. అంతేకాదు అదే రేటుపై బంగాళాదుంప సేకరణకు రూ. 400 కోట్లు విడుదల చేసింది కూడా. కోకాకోలా, పెప్సీకోలా సంస్థలు అవి స్థాపించిన చోటల్లా, నీటి కరువును సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే ప్లఛిమడ గ్రామానికి చెందిన మహిళలు ఉద్యమించి కోకాకోలా ప్లాంట్‌ను మూసివేయించారు. క్రమంగా మనం జెంక్‌ఫుడ్‌కు అలవాటుపడిపోతున్నాం. రైతులు సమూలంగా దెబ్బతినడానికి ముందే మన ఆరోగ్యం, పర్యావరణం పూర్తిగా మారిపోనున్నాయి. అందువల్ల మనం మన జీవవైవిధ్యాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఫీచర్
english title:
corporate companies
Date:
Saturday, December 28, 2013