హిందువులు అఖండ భారతాన్ని కోరారు. దేశ విభజనను వ్యతిరేకించారు. ముస్లింలు దేశ విభజనను కోరారు. దేశ విభజన జరిగింది. ముస్లింలకు పాకిస్తాన్ వెళ్ళడానికి స్వేచ్ఛ ఇవ్వబడింది. ఇక భారతదేశంలో ముస్లింలకు ప్రత్యేక సదుపాయాలు ఎందుకు? వారు ఇక్కడి పరిస్థితులకు, మంచి సంప్రదాయాలకు సర్దుబాటుతో ఉంటున్నారు. అందరికీ సమాన హ క్కులు, అవకాశాలు ఉన్నాయి. ఇవి చాలు కదా.
రాజ్యాంగ శాసన కారులు చరిత్రను విస్మరించారు. తెల్లనివి పాలు, నల్లనివి నీరు అని భావించి, మైనారిటీ పదాన్ని అనవసరంగా వాడి, దేశాన్ని సమస్యలపాలు చేశారు. పాకిస్తాన్‌లో హిందువులు అక్కడి పరిస్థితులకు అనుకూలంగా నివసించారు. వ్యతిరేకంగా ఉంటే ప్రాణభయమే. హిందువులకు గోవు పూజ్యం. పూజించకపోయినా, గోవధ చేయకుండా ఉండటం మంచిది. ఇందుకు అందరికీ ఒకే సాంఘిక చట్టం అవసరం. హిందువులకు హిందూ కోడ్‌ని పెట్టిన పాలకులు, ముస్లింలకు, క్రిష్టియన్‌లకు ఎందుకు వ్యక్తిగత వ్యవహారాలు ఉండాలి? అంటే పాలకుల దృష్టిలో హిందువుల సంప్రదాయాలు లోపభూయిష్టం, ఇతరులవి సుప్రసిద్ధం అన్నమాట! ఎంత విరుద్ధంగా, వికృతంగా ఉన్నది? హిందువులే కుటుంబ నియంత్రణను పాటిస్తున్నారు. ఇతరులు ఎందుకు పాటించకూడదు?
హిందువుల దేవాలయాలకు బెదిరింపులు వస్తున్నాయి. ఎప్పుడూ లేని తిరుపతి, షిర్డీ ఆలయాలలో కూడా బెదిరింపులే? తిరుపతిలో ఇస్లామిక్ విద్యాలయమా? బ్రిటిష్ పాలన కూడా ఈవిధంగా జరగలేదు. అంతేకాక ఆలయ భూములను అమ్మడమా? ఆలయాల సొమ్ముని ఇతరత్రా మళ్ళించడమా? సంపదను పాలకులు కాజేయుటకు ప్రయత్నాలా? బ్రిటిష్‌వారు మన మంచి సంప్రదాయాల ధర్మసంస్థల జోలికి పోలేదు. ఎక్కడైనా అవసరమైతే కలుగజేసుకుని సరిచేసి, తిరిగి హిందూ సమాజానికి అప్పచెప్పేవారు. వారికున్న న్యాయ దృక్పధం మన పాలకులకు లేదు. మన వారికి పదవులే ముఖ్యం. ధర్మం కాదు. దేశంకాదు. ఓట్లు మనవి. ఎక్కడ లేని ప్రత్యేక సదుపాయాలు ఏ మైనారిటీలకు ఓట్లకోసం కొన్ని రాష్ట్రాలలో మైనారిటీలకు ఇచ్చిన ప్రభుత్వ రుణాలను కూడా మాఫీచేస్తున్నారు. ఇట్లా చేస్తే మున్ముందు ప్రభుత్వ ఖజానా ఖాళీ అయి, తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. కుటుంబ నియంత్రణ అవలంభిస్తున్న హిందువులు, ఎట్టి నియంత్రణ లేక జనాభాన్ని ఎంతగానో పెంచుతున్న ఇతరులవల్ల తీవ్ర సంక్షోభాలపాలవుతారు. రాజ్యాంగ శాసనాన్ని జాతీయ విధానాలను పాటించే వారికి రోజులుండవు. వ్యతిరేకులకే పైచేయి ఔతుంది. మనం బ్రిటిష్‌వారి ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్నాము. బ్రిటన్‌లో ఈవిధంగా జరుగుతున్నదా?
1966లోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.పి.సెన్సాఈలాగున అన్నారు. ‘‘రాజ్యాంగ శాసనం తొందరపాటున చేయబడినది. ఇది మన దేశ పరిస్థితులకు అనుకూలంగా లేదు. దీన్ని మార్చాలి.’’ వారన్నది నిజమవుతున్నది. 1950లోనే ప్రసిద్ధ చరిత్రకారుడు డా.జదానాథ్ సర్కార్ ఈలాగున అన్నారు. ‘‘మైనారిటీ’’ పదం రాజ్యాంగ శాసనంలో మాతృగర్భంలో విషబీజాలను నాటినట్లే ఎంతో పెరుగుతున్న మైనారిటీలు ఏకమైతే, హిందువులలో భవిష్యత్తు ఉండదు. మైనారిటీల ఆవేదన ఏమిటంటే, హిందువులు మెజారిటీ అవ్వడమే. నెహ్రూగారి అంతర్జాతీయ ఖ్యాతికోసం, స్వతంత్ర భారతంలో హిందువులు బలైపోతున్నారు. కాశ్మీరు పండితులు తమ అనర్ధాలకుతమ నెహ్రూయే కారణమని ఎంతో రోదిస్త్తున్నారు. నెహ్రూ తప్పుడు విధానాలను మార్చకపోతే, మున్ముందు హిందువులకు కాశ్మీరు పండితుల గతే పడుతుంది. రాజకీయవేత్తలు ఏకమై రాజ్యాంగ శాసనాన్ని, చరిత్రాత్మక దృష్టితో సవరణ చెయ్యాలి. లేకపోతే మన దేశానికి ప్రజాస్వామ్యంతోపాటు, రాష్టప్రతి పాలనే రక్ష. ఎంత త్వరలో చేస్తే అంత మంచిది. చేతులు కాలిన తర్వాత ఆకులుపట్టుకుంటే ప్రయోజనం ఉండదు.
సబ్ ఫీచర్
english title:
historic
Date:
Saturday, December 28, 2013