Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

విభజన బిల్లుపై గ్రామ స్థాయిలో చర్చించాలి..- జెపి

$
0
0

విశాఖపట్నం, డిసెంబర్ 27: రాష్ట్ర పునర్విభజన బిల్లుపై అసెంబ్లీలోనే కాకుండా పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో సైతం సమగ్రమైన చర్చ జరగాలని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు. ఆయన శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, ఇదే విషయమై స్పీకర్, ముఖ్యమంత్రి, విపక్షనేతలను కలిసి తాము డిమాండ్ చేయనున్నట్టు వెల్లడించారు. కింది స్థాయ ప్రజల మనోభావాలు ఏవిధంగా ఉన్నాయన్న విషయం ఢిల్లీ పెద్దలకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర క్యాబినెట్ ఆమోదించి రాష్టప్రతి ద్వారా వచ్చిన ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగడమే ప్రజాస్వామికమన్నారు. అసెంబ్లీలో చర్చకు ముందే బిల్లును ఆహ్వానిస్తున్నామా? తిసర్కరిస్తున్నామా? అన్న విషయంపై తీర్మానించాలని డిమాండ్ చేశారు. విభజన బిల్లుపై చర్చకు వెనుకాడితే అది ఆత్మహత్యా సదృశమే అవుతుందని జెపి అభిప్రాయపడ్డారు. ఓట్లు, సీట్ల కోసం రాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకంలో తెలుగు ప్రజలు సమిధలవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చట్టసభలకు ఎన్నిక కాలేని పెద్దలు కొంతమంది ఢిల్లీలో కూర్చుని తెలుగువారి మధ్య చిచ్చుపెట్టే నికృష్టమైన నిర్ణయాలు తీసుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. వీరి రాజకీయ పైశాచిక క్రీడకు తెలుగు ప్రజలు బలవుతున్నారని, ఢిల్లీ పెద్దల కళ్లు తెరచుకునేలా విభజన బిల్లుపై చర్చించి, తిరస్కరించి పంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇదే సందర్భంలో బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ జరపాలని స్పీకర్‌ను కోరనున్నట్టు ఆయన తెలిపారు. అసెంబ్లీలో బిల్లుపై సమగ్ర చర్చ జరిగిన తర్వాత రాష్టప్రతికి పంపితే మెజార్టీ ప్రజల ఆమోదం లేని బిల్లుకు చట్టబద్ధత కల్పించరని జెపి అభిప్రాయపడ్డారు. బిల్లులో అసంబద్దమైన అంశాలెన్నో ఉన్నాయని, శాంతి భద్రతల అంశాన్ని గవర్నర్ ఆధీనంలో పెడుతున్నట్టు బిల్లులో పేర్కొన్నారని, ఇది రాజ్యాంగ పరంగా సాధ్యమయ్యే అంశమేనా? అని జెపి ప్రశ్నించారు. చిన్న రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్ ఆవిర్భావం సందర్భంగా ఇటువంటి నిర్ణయాన్ని ఏలా తీసుకున్నారో కాంగ్రెస్ పాలకులకు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. లోక్‌సభలో మూడింట రెండు వంతుల మెజార్టీతో ఆమోదించిన మీదటే ఆర్టికల్ 371హెచ్ సాధ్యమైందన్న విషయం తెలంగాణ బిల్లును రూపొందించిన పెద్దలకు తెలియంది కాదన్నారు. కేవలం రాజకీయ కాంక్షతోనే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. విభజన బిల్లును అసెంబ్లీలో చర్చించి వ్యతిరేకతను వ్యక్తం చేయడం ద్వారానే అడ్డుకోగలమని ఆయన అన్నారు. అసెంబ్లీలో చర్చకు వెనుకాడితే విభజనను అడ్డుకునేందుకు ఉన్న ఏకైక అవకాశాన్ని చేజార్చుకున్నట్టేనని జయప్రకాష్ స్పష్టం చేశారు. సమావేశంలో లోక్‌సత్తా రాష్ట్ర ఉపాధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ పాల్గొన్నారు.

విభజన బిల్లుపై గ్రామ స్థాయిలో చర్చించాలి..- జెపి
english title: 
jp demand

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>