అండర్-19 ఆసియా కప్ క్రికెట్
షార్జా, డిసెంబర్ 28: అండర్-19 ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం ఇక్కడ జరిగిన మ్యా చ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)పై భారత్ 189 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొ లుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో నాలుగు వి కెట్లకు 320 పరుగులు చేసింది. హెర్వాద్కర్ 101 పరుగు లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన యుఎఇ 40.1 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూ లింది. చిరాగ్ సూరి 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా ని లవడం ఆ జట్టులో మిగతా బ్యాట్స్‌మెన్ వైఫల్యానికి అద్దం పడుతుంది. ఇతర మ్యాచ్‌ల్లో శ్రీలంకపై అఫ్గానిస్తా న్ మరో 15 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌ని పాకి స్తాన్ 132 పరుగుల తేడాతో సొంతం చేసుకుంది. పాక్ ఆరు వికెట్లకు 311 పరుగులు చేస్తే, నేపాల్ 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయ 179 పరుగులకు పరిమితమైంది. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొమ్మిది వికెట్ల తేడాతో మలే సియాను చిత్తు చేసింది.
యుఎఇపై భారత్ విజయం
english title:
india victory
Date:
Sunday, December 29, 2013