వెల్లింగ్టన్, డిసెంబర్ 28: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డారెన్ బ్రేవో న్యూజిలాండ్ పర్యటన నుంచి అర్థాంతరంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. వ్యక్తిగత కారణాలతోనే అతను ట్రినిడాడ్ వెళ్లినట్టు జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఎడమచేతి వాటం ఆటగాడు డారెన్ బ్రేవో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో కెరీర్‌లోనే అత్యుత్తమం 218 పరుగులు సాధించి, జట్టును పరాజయం నుంచి కాపాడాడు. బాక్సింగ్ డే రోజు జరిగిన వనే్డలో, అత్యంత కీలకమైన దశలో 14 పరుగులు సాధించి, ఆక్లాండ్‌లో విండీస్‌కు తొలి వనే్డ విజయాన్ని అందించాడు. అతను స్వదేశానికి తిరిగివెళ్లడం వల్ల విండీస్ బలహీన పడే ప్రమాదం ఉంది. ప్రత్యేకించి బ్యాటింగ్ విభాగంలో హార్డ్ హిట్టర్ సేవలను ఆ జట్టు కోల్పోతుంది. ఇలావుంటే, వ్యక్తిగత కారణాలని డారెన్ బ్రేవో పేర్కోవడం అనుమానాలకు తావిస్తోంది. గతంలో మాదిరి వెస్టిండీస్ బోర్డుపై క్రికెటర్లు నిరసన గళం విప్పే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.
స్వదేశానికి డారెన్ బ్రేవో
english title:
daren bravo
Date:
Sunday, December 29, 2013