
చిలకడ దుంపలు - 250 గ్రా.
ఆవాలు, జీలకర్ర - 1/4 టీ.స్పూ.
కరివేపాకు - 2 రెబ్బలు
కొత్తిమీర - కొద్దిగా
పసుపు - 1/4 టీ.స్పూ.
కారంపొడి - 1 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
ధనియాల పొడి - 2 టీ.స్పూ.
నూనె - 3 టీ.స్పూ.
తయారుచేయండిలా..
చిలకడదుంపలు చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాలి. బాణలి లేదా పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు, చిలకడదుంప ముక్కలు వేసి కలపాలి. ఇందులో పసుపు, కారం పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పువేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ముక్కలు చాలా త్వరగా మగ్గిపోతాయి. కొద్దిసేపు వేపి కొత్తిమీర చల్లి దింపేయాలి. కొద్దిగా తియ్యతియ్యగా కారం కారంగా ఉంటుంది ఈ కూర.
చిలకడదుంపలు చెక్కు తీసి చిన్న చిన్న
english title:
chilakada
Date:
Sunday, January 5, 2014