
సెనగపిండి - 1 కప్పు
రవ్వ - 2 టీ.స్పూ.
పసుపు - చిటికెడు
ఈనో - 1 టీ.స్పూ.
నీళ్లు - 1 టీ.స్పూ.
వెన్న - 4 టీ.స్పూ.
మిక్స్ ఫ్రూట్ జామ్ - 4 టీ.స్పూ.
వండండి ఇలా...
ఒక గినె్నలో జల్లించిన సెనగపిండి తీసుకుని రవ్వ, పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత ఈనో ఫ్రూట్ సాల్ట్, నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇడ్లీపాత్రలలో పలుచగా నూనె రాసి ఈ మిశ్రమంతో ఇడ్లీలు చేసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత ఇడ్లీలు తీసి అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ముక్క తీసుకుని లోపలివైపు కాస్త వెన్న రాసి ఆ తర్వాత జామ్ పూయాలి. దానిపైన వెన్న రాసిన మరో ముక్క పెట్టి కాస్త అదిమి పెట్టాలి. వీటిని ఇలాగే తినొచ్చు. లేదా చల్లగా కూడా తినొచ్చు. జామ్‌తో పాటు ఏదైనా పండు చిన్నగా కోసి కలుపుకోవచ్చు. పిల్లలకోసం సరికొత్తగా ఉంటుంది.. ఇష్టంగా తింటారు.
రుచి
english title:
ruchi
Date:
Saturday, January 4, 2014