Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మనకు ఏంకావాలి?

$
0
0

ఏటికేడాది పుస్తకాలను చించేసి.. గ్రైండర్‌లో వేసి రుబ్బేసి, వచ్చిన సారాన్ని కషాయం తాగినట్టు తాగేసి.. పరీక్షల్లో పిచ్చ పర్సంటేజీ సంపాదించేయాలి. ఇదీ -ఇప్పటి యూత్ ఫార్మాట్. తొంభైయైదులు దాటిన పర్సంటేజీ మార్కుల పత్రాలతో కంపెనీల ముందు క్యూ కడితే... అబ్బ.. ఇంటర్వ్యూ వరకూ వచ్చాంగానీ, అక్కడ చాన్స్ కొట్టలేకపోయాం రా! -ఇదీ ఫినిషింగ్ డైలాగ్. ఎందుకు? అని ప్రశ్నించారనుకోండి -చాలామంది కుర్రాళ్ల దగ్గర సమాధానం ఉండదు.
============
-అప్రతిహతమైన మార్కులతో ఉత్తమ అభ్యర్థుల్లా ఇంటర్వ్యూ హాల్లోకి అడుగు పెడుతున్న చాలామంది ఉసూరుమంటూ ఎందుకు వెనుతిరుగుతున్నారు. సవాలక్ష కారణాల్లో ప్రధాన కారణం ఒక్కటే.. వీళ్లంతా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరు. ప్రశ్నలు అడిగేవాళ్లకు ఏంకావాలో తెలుసుకుని, అంచనావేసి సమాధానాలు చెప్పలేరు. అంటే -అక్షర జ్ఞానం ఉంది. పరిసరాల పరిజ్ఞానం కరవైంది. వీళ్లకు చదువులు తెలుసుగాని, చుట్టూ ఏం జరుగుతుందో ఇసుమంతైనా తెలీదు. అదీ సమస్య. లేటెస్ట్‌గా ఎమ్మెన్సీ కంపెనీలన్నీ ఒక విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తునాయ. అదేంటంటే -సామాజిక స్పృహ లేనివాళ్లంతా సుంఠలకిందే లెక్క. ఇదీ కార్పొరేట్ కంపెనీల లెటెస్ట్ స్టయల్. -సామాజికాంశాల (ఎన్విరాన్‌మెంట్ కోషెంట్) పట్ల కనీస అవగాహన లేకుండా చంకలో ఉత్తమ మార్కుల ఫైళ్లు పట్టుకుని ఇంటర్వ్యూ లైనులో నిలబడుతున్న అభ్యర్థులు అందరికీ ఎదురవుతున్న కొత్త అనుభవం ఇది. ఇంటర్వ్యూకి వెళ్లినపుడు బోర్డు సభ్యులు అడిగే ప్రశ్నలకు ఠకీమని సమాధానాలు చెప్పేస్తున్న కుర్రాళ్లు -ఇంటర్వ్యూకి పిలిచిన ఎమ్మెన్సీ కంపెనీల ప్రతినిధులకు ఏం కావాలో తెలుసుకుని చెప్పి మెప్పించలేకపోతున్నారు. ఐక్యూ కంటే ఇక్యూకే వీళ్లు ఎందుకింత ప్రాధాన్యం ఇస్తున్నారంటే -మంచి కుటుంబం నుంచి వచ్చే వ్యక్తులు చుట్టూ మంచి వాతావరణాన్ని నెలకొల్పగలరన్న ప్రధాన కారణమే. అందుకే ఇప్పుడు ఎమ్మెన్సీ కంపెనీలన్నీ ఇక్యూ ఉన్నవాళ్లకు ఓటేస్తున్నాయ. తనకోసం ఆలోచించేవాడు తనవరకూ పనిమంతుడు. తనతోపాటు చుట్టూ పరిసరాల జ్ఞానాన్ని గమనించేవాడు కంపెనీ పని వాతావరణం సవ్యంగా నడపగలడు. అందుకే -కార్పొరేట్ కంపెనీల్లోని హెచ్‌ఆర్‌లు అభ్యర్థులను ఎంపిక చేసుకునేటపుడు ఇలాంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చే అభ్యర్థులకు కష్టం, సుఖం, సాయపడే గుణం, ఎదుటి వారిని అర్ధం చేసుకునే మనస్తత్వం ఒకింత ఎక్కువగా ఉంటుందన్న నమ్మకాలు బలపడటం, అధ్యయనాల్లో వాస్తవాలు నిగ్గుతేలడం కూడా ఇందుకు కారణమై ఉండొచ్చు.
సో.. ఉద్యోగాల వేటకు బయలుదేరే ముందు అభ్యర్థులు ఒక్క ఐక్యూ (ఇంటిలిజెన్స్ కోషెంట్) మాత్రమే కాదు, దానికి తోడుగా అంతేశాతం ఇక్యూ కూడా ఉండాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే -కాలం మారుతోంది కనుక. కాలంతోపాటే ఇంటర్వ్యూల తీరు తెన్నులూ మారిపోతున్నాయ కనుక. ముందుగా మేల్కొన్న ఉద్యోగార్థులు ఈ విషయం మీద అవగాహన పెంచుకుంటున్నారు కనుకే -ఇక్యూని పెంచుకునే మార్గాలను అనే్వషిస్తున్నారు, అవలంబిస్తున్నారు. అందుకు ప్రత్యేక కేంద్రాల్లో శిక్షణ సైతం తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఎన్నో మల్టీ నేషనల్ కంపెనీలు అటు ఇంజినీరింగ్ కళాశాలల్లోనూ, ఇటు జాబ్ మేళాల్లోనూ అభ్యర్థులను ఎంపిక చేసిన, చేస్తున్న విధానాన్ని పరిశీలిస్తే ఉద్యోగార్థులకు ఒక్క ఐక్యూ మాత్రమే ఉంటే సరిపోదని, దీంతో పాటు ఇక్యూ (ఎన్విరాన్‌మెంట్ కోషెంట్) మీదా అవగాహన ఉండాలన్న విషయాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. చదువుల ప్రాధాన్యత పెరిగి, విద్యార్థులకు బాగా నూరిపోసే సంస్థలు కోకొల్లలుగా పుట్టుకొచ్చి విద్యార్థలు అప్రతిహతమైన మార్కులు సంపాదిస్తునా, కొంతమందే ఎమ్మెన్సీల్లో ఉద్యోగాలు దక్కించుకోవడాన్ని చూస్తుంటే అసలు విషయం మనకే అర్థమవుతుంది. ఎలా ఎంపికయ్యారు? ఎందుకు విఫలమయ్యారన్న ప్రశ్నలను అభ్యర్థుల ముందు పెడితే పైన మనం చెప్పుకున్న సమాధానమే వాళ్లనుంచి వస్తుంది. అంటే ఇక్కడ తేల్చుకోవాల్సిన విషయం ఏంటంటే చదువుతోపాటు పెరిగిన వాతావరణం, కుటుంబానికి ఇస్తున్న ప్రాధాన్యత, పరిసరాలు, సమాజం పట్ల వారికున్న అవగాహన ఇలా ఎన్నో విషయాలకు అభ్యర్థులు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంటర్వ్యూ నిర్వహించే కంపెనీల ప్రతినిధులు చదువుల కంటే ఎక్కువగా ఇప్పుడు వీటినే పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. చదువుల్లో స్కోరింగ్ సాధిస్తున్నా, సామాజికాంశాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారన్న విషయాన్ని కంపెనీలు పరిగణనలోకి తీసుకుంటున్నాయ. ఎంతసేపూ పుస్తకాలనే అంటిపెట్టుకుని ఉంటే సరిపోదన్న విషయం తేలింది. అప్పుడేం చేయాలి? ప్రాపంచిక జ్ఞానం, పర్యావరణం పట్ల అవగాహన, ముఖ్యంగా పెరిగిన కుటుంబ వాతావరణాన్ని సాధికారికంగా చెప్పగలిగేలా మనం తయారుకావాలి. అప్పుడే అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. రాజకీయాల నుంచి ప్రముఖుల జీవితాలపై కనీస అవగాహన ఉందో లేదోనన్న విషయాన్ని ఇంటర్వ్యూ సమయంలో ప్రశ్నావళి కొనసాగించి సమాధానాలు రాబడుతున్నారని -ఇదే తరహా ఇంటర్వ్యూ ఎదుర్కొన్న అభ్యర్థులు చెప్పడాన్ని చూస్తే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సమాజం పట్ల తమకున్న బాధ్యతను కొంతైనా ప్రజెంట్ చేయగలిగే సత్తా ఉండాలన్న విషయాన్ని ఇంటర్వ్యూలు నిర్వహించిన తీరునుబట్టి అభ్యర్థులు అవగతం చేసుకోవాలి.
ఇక్యూ లేమితో -పరిసరాల నుంచి ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే ఆత్మస్థయిర్యం లేకపోవడం కూడా ఇంటర్వ్యూల్లో అభ్యర్థులు విఫలమవడానికి కారణంగా కన్పిస్తోంది. కష్ట సమయాల్లో పరిస్థితిని ఎదుర్కొని ఎలా నిలబడగలమన్న విషయాన్ని సూటిగా చెప్పడమే కాకుండా అటువంటి పరిస్థితుల్లో విషయాన్ని ఎంత చక్కగా డీల్ చేయొచ్చో ఇచ్చే వివరణలు కంపెనీల ప్రతినిధులను ఇట్టే ఆకర్షిస్తాయనడంలో సందేహం లేదు. ఇలా ఎదుటి వారిని ఆలోచింపజేసేలా చెప్పగలిగే అభ్యర్థులను సీనియర్ల నుంచి అనుభవం కూడా అందుతుంది. ఎన్నుకున్న రంగంలో వ్యక్తి తీరుతెన్నులను ఓ కంట కనిపెట్టే ‘పెద్దలు’ అవసరమైనపుడు ఆలోచనలు అందిస్తూ వెన్నుతడుతుంటారు. భవిష్యత్‌లో ఏదైనా రంగంలో రాణించాలంటే ముందు ప్రపంచాన్ని తరువాత మనల్ని గెలుచుకునే ప్రయత్నం మొదలెట్టాలి. ఇదే లేటెస్ట్ సక్సెస్ సూత్రం.
===========
చదువుకోకపోతే భవిష్యత్ ఎంత భయంకరంగా ఉంటుందో ప్రాక్టికల్‌గా చూపించడానికి ఓ ధనికుడు -ఇంటర్ చదువుతున్న కొడుకుని తీసుకుని సిటీనుంచి బయలుదేరాడు -తను పుట్టిపెరిగిన ఊరికి. పల్లెలో పుట్టినా బాగా చదువుకుని గొప్పవాడైన అతన్ని చూడ్డానికి ఊరిజనం గుమిగూడారు. కాయకష్టంతో కమిలిపోయివున్న వాళ్లను చూపిస్తూ కొడుకుతో ధనికుడు ఇలా అన్నాడు. -‘వీళ్లమధ్యే పుట్టిపెరిగినా నేను చదువుకుని గొప్పవాడినయ్యాను. వీళ్లకు చదువురాక ఇలా ఉండిపోయారు. నేను చెప్పినట్టు వినకుంటే నువ్వూ ఇలాగే బతకాలి’ అన్నాడు హేళన చేస్తున్నట్టు. ఊరిజనానికి మండింది. ధనికుడిపై దాడికి దిగబోయారు. వాళ్లకు అడ్డుపడిన కొడుకు -తండ్రితో ఇలా చెప్పాడు. ‘మనకంటే ఊరివాళ్లే గొప్పవాళ్లని ఇక్కడికొచ్చాకే అర్థమైంది. మనింట్లో ఒక్క సైకిలే ఉంది. ఊళ్లో చాలా ఉన్నాయి. మనకు ఒక్క కుక్కే ఉంది. ఊళ్లో చాలావున్నాయి. మనకు ఇల్లొక్కటే. ఇక్కడ చాలా ఇళ్లు. అంతెందుకు మనకు ఊరు లేదు. వీళ్లకుంది’ అన్నాడు. ఊరిజనానికి ఆనందం వేసింది. కొడుకును భుజానికి ఎత్తుకున్నారు. బాగా చదువుకున్న తండ్రిని రోడ్డుమీద వదిలేశారు.
(ఎక్కడ ఏది అవసరమో దాన్ని ప్రజ్ఞావంతంగా చెప్పగలగడమే తెలివి. ఇదే ఇక్యూ అనుకుంటే -కుర్రతరం దీన్ని వృద్ధి చేసుకోవాలి)
---------------
జ్ఞాపకాలో, అనుభవాలో, అల్లరో, ఆనందమో.. ఏ అంశంమీదనైనా పాఠకులతో మీ ఫీలింగ్స్ పంచుకోవాలని అనిపిస్తే -ఈ పేజీకి రాసి పంపించండి. బావుంటే తప్పక ప్రచురిస్తాం. రచనలు పంపాల్సిన చిరునామా..
ఎడిటర్, ఆంధ్రభూమి దిన పత్రిక
36, సరోజినీ దేవి రోడ్, సికింద్రాబాద్

ఏటికేడాది పుస్తకాలను చించేసి..
english title: 
manaku yem kaavaali?
author: 
-‘వి’

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>