న్యూఢిల్లీ, జనవరి 9: ప్రభుత్వ విభాగాల్లో అవినీతికి అడ్డుకట్ట వేసే సమున్నత లక్ష్యంతో ఐదు దశాబ్దాల క్రితం నెలకొల్పబడిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సివిసి) త్వరలో స్వర్ణోత్సవాలు జరుపుకోనుంది. ఫిబ్రవరి 11న ప్రారంభమయ్యే స్వర్ణోత్సవ వేడుకలు రెండు రోజులపాటు జరగనున్నాయి. ఈ ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ హాజరుకానున్నారు. ముగింపు కార్యక్రమానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పి.సదాశివం హాజరవుతారని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. స్వర్ణోత్సవాల సందర్భంగా పోస్టల్ స్టాంప్‌తో పాటు లఘుచిత్రాన్ని కూడా విడుదల చేస్తారు. స్వర్ణోత్సవాలకు కేంద్ర మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. 1964లో కె.శాంతానమ్ కమిటీ సిఫార్సు మేరకు సివిసిని నెలకొల్పారు.
ప్రభుత్వ విభాగాల్లో అవినీతికి అడ్డుకట్ట వేసే సమున్నత లక్ష్యంతో
english title:
cvc
Date:
Friday, January 10, 2014