భోపాల్, జనవరి 9: ఘజియాబాద్‌లోని కౌశంబిలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయంపై జరిగిన దాడి వెనక బిజెపి, సంఘ్ పరివార్ హస్తం ఉందని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ఆప్ ఆఫీసుపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆప్ సీనియర్ నేత ప్రశాంత్ భూషణ్ జమ్మూకాశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబి ఆప్ ఆఫీసుపై కొన్ని హిందూ మత శక్తులు దాడి చేశాయి. ఆప్ కార్యాలయంపై దాడి బిజెపి పథకంలోని భాగంగా జరిగిందేనని దిగ్విజయ్ తన బ్లాగులో విమర్శించారు. సుమారు 150 హిందూ సంస్థలు సంఘ్‌కు అనుబంధంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు.
ఘజియాబాద్‌లోని కౌశంబిలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)
english title:
bjp
Date:
Friday, January 10, 2014