హైదరాబాద్, జనవరి 13: ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేస్తున్న మాదిరి కర్నాటక రాష్ట్రంలోనూ ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకం అమలుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంగీకరించారని బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చెప్పారు. 15 బిసి సంఘాల నాయకులు బెంగళూరు ముఖ్యమంత్రి నివాసంలో సిద్ధరామయ్యను కలిసి బిసి సంక్షేమం కోసం పలు పథకాలను చేపట్టాలని కోరారు. అలాగే చట్టసభల్లో బిసిలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని కూడా వారు కోరగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ, అసెంబ్లీలో ఈ మేరకు తీర్మానం చేస్తామని చెప్పారు. చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కర్నాటక అసెంబ్లీలోనూ తీర్మానం చేయాలని కృష్ణయ్య ముఖ్యమంత్రిని కోరారు. కేంద్రంలో బిసిల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదని, బడ్జెట్ కేటాయింపులు లేవని, బిసిలకు ఉద్యోగాల్లో ప్రమోషన్లలో రిజర్వేషన్లు లేవని, సామాజిక భద్రతా చట్టం అమలులో లేదని, జాతీయ బిసి కమిషన్‌కు రాజ్యాంగబద్ధత లేదని గుర్తుచేశారు. బిసి రిజర్వేషన్లు పెట్టిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని, మొత్తంగా చూస్తే దాదాపు 14 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.
కర్నాటక విద్యార్థులకు అవకాశం ఇవ్వాలి
కర్నాటకలో ఎంబిబిఎస్ చదివిన వారికి ఆంధ్రప్రదేశ్‌లో పిజి చేసేందుకు అవకాశం కల్పించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరారు. స్థానికులు అనే అంశం వివాదంగా మారిందని సహజంగా ఎక్కడ ఎంబిబిఎస్ చేస్తే అక్కడే పిజి కోర్సులో చేరేందుకు అనుమతిస్తారని, అయితే ఇతర రాష్ట్రాల్లో చదివినా మన విద్యార్థులే కనుక వారిని మన రాష్ట్రంలో పిజిలో చేరేందుకు అనుమతించాలని అన్నారు.
సిఎం హామీ ఇచ్చారన్న కృష్ణయ్య
english title:
k
Date:
Tuesday, January 14, 2014