న్యూఢిల్లీ, జనవరి 13: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడానికి పెట్రోలియం మంత్రిత్వ శాఖ సమాయత్తమవుతోంది. సబ్సిడీ కింద పంపిణీ చేస్తున్న ఎల్‌పిజి సిలెండర్ల సంఖ్యను 9 నుంచి 12కు పెంచే విషయంలో సానుకూల నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయి. అయితే సిలిండర్ ధరను మాత్రం రూ.75 నుంచి 100 వరకు పెంచనుందని సమాచారం. కాగా, డీజిల్ ధరలో మాత్రం ఒకేసారి లీటర్‌కు రెండు రూపాయలు పెంచే అవకాశముందని అధికార వర్గాలు అంటున్నాయి. సబ్సిడీ సిలిండర్ల పెంపు వల్ల రూ.5,800 కోట్లు ప్రభుత్వంపై అదనపు భారం పడనుంది. అయితే సిలిండర్ల ధరను పెంచితే ఈ భారం తగ్గుతుందని అవి పేర్కొన్నాయి. మరోవైపు గొట్టాల గుండా సరఫరా చేసే గ్యాస్‌ః, సిఎన్‌జి ధరలను సైతం పెంచే యోచనను ప్రభుత్వం చేస్తోందని వర్గాలు తెలిపాయి. ఈ నెల ప్రారంభంలో కేంద్రం ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ.230 పెంచిన సంగతి తెలిసిందే.
పెంపుపై యోచిస్తున్న పెట్రోలియం మంత్రిత్వ శాఖ
english title:
p
Date:
Tuesday, January 14, 2014