
చింతలపూడి, జనవరి 13: బొమ్మరిల్లు గ్రూపు మాజీ అధినేత రాయల రాజారావుకు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ టిడిప్టి టిక్కెట్ ఖాయమని భావిస్తున్న తరుణంలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ అధినేతకు తలనొప్పిగా పరిణమించే సూచనలు కనిపిస్తున్నాయి. నిత్యం విలువలతో కూడిన సుద్దులు చెప్పే అధినేత చంద్రబాబు కోట్ల రూపాయలకు మోసగించారని ఆరోపణలెదుర్కొంటున్న వ్యక్తికి అవకాశం కల్పిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చింతలపూడి నియోజకవర్గం నుండి టిడిపి టిక్కెట్ ఆశిస్తున్న వారిలో బొమ్మరిల్లు గ్రూపు మాజీ డైరెక్టర్ రాయల రాజారావు ప్రముఖంగా ఉన్నారు. గత పంచాయతీ ఎన్నికల నాటి నుంచి ఇటీవల చింతలపూడిలో పార్టీ నిర్వహించిన బహిరంగ సభ వరకు రాజారావు భారీ ఎత్తున పార్టీ కోసం ఖర్చు చేశారు. ఈ నేపథ్యంలో రాజారావునే పార్టీ అభ్యర్ధిగా నిర్ణయించి చంద్రబాబుకు నివేదించడంతో గ్రీన్ సిగ్నల్ లభించిందనే ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని ఇటీవల చింతలపూడిలో జరిగిన నియోజకవర్గ స్థాయి టిడిపి బహిరంగ సభలో పరోక్షంగా రాజారావే తమ పార్టీ అభ్యర్థి అంటూ ప్రకటించారు.
చింతలపూడిలో రాజారావు పోస్టర్లు