Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఆయన స్ఫూర్తితోనే...

$
0
0

తనీష్ కథానాయకుడిగా విఎస్‌ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో వి.ఎస్.రామిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘దేవదాస్ స్టైల్ మార్చాడు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో ఆడియో విడుదల చేయనున్నారు. మహానటుడు ఎ.ఎన్.ఆర్ స్వర్గస్తులైన ఈ సందర్భంలో ఈ చిత్రాన్ని ఆయనకు అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలిమ్ ఛాంబర్ హాలులో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు శ్రీనివాస్ గుండ్రెడ్డి మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ దేవదాస్ అంటేనే ఎఎన్‌ఆర్ గుర్తుకు వస్తారని, ఆయన స్ఫూర్తితోనే ఈ చిత్రాన్ని రూపొందించామని, ఆయన చేతుల మీదుగా ఆడియో విడుదల కార్యక్రమం జరపాలని అనుకున్నామని, కానీ అలా జరగలేదని తెలిపారు. అందుకే ఇప్పుడు ఈ చిత్రాన్ని ఎఎన్‌ఆర్‌కు అంకితమిస్తున్నామని ఆయన వివరించారు. దేవదాసు సినిమా స్ఫూర్తితో తయారుచేసుకున్న ఈ కథ ఆయనకు అంకితమిస్తున్నందుకు గర్వంగా ఉందని ఆయన వివరించారు. కార్యక్రమంలో కె.వి.వి.సత్యనారాయణ, ప్రసన్నకుమార్, భగీరధ, పాణెం చిన్న అనిమిరెడ్డి, జగపతి, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. సన, చాందిని, సుజన, ఎమ్మెస్ నారాయణ, ధన్‌రాజ్, వినోద్, శ్రీనిజ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: చక్రి, సంగీతం: గణ, నిర్మాత: వి.ఎస్.రామిరెడ్డి, రచన, దర్శకత్వం: శ్రీనివాస్ గుండ్రెడ్డి.

తనీష్ కథానాయకుడిగా విఎస్‌ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>