Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

రవితేజ ‘పవర్’

$
0
0

రవితేజ కథానాయకుడుగా రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవీంద్రనాథ్ దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ రూపొందిస్తున్న చిత్రం ‘పవర్’. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘పవర్’ (అన్‌లిమిటెడ్) అనే పేరు ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఆర్‌ఎఫ్‌సిలో జరుగుతోంది. రవితేజ జన్మదినోత్సవ సందర్భంగా చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్, టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ మాట్లాడుతూ ఓ పవర్‌ఫుల్ హీరో కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, రోజు వింటూ ఉపయోగించే పవర్ అనే మాటను ఈ చిత్రానికి టైటిల్‌గా నిర్ణయించామని, రవితేజ సినిమాకు సూటిగా సరిపోయే పేరు ఇదని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 16వరకు ఈ షెడ్యూల్ నిర్వహించి, 22నుండి కోల్‌కతాలో నెల రోజులపాటు భారీ షెడ్యూల్ చేయనున్నామని, ఆ తర్వాత నాగపూర్‌లో పది రోజులపాటు ఓ భారీ ఛేజ్‌ను చిత్రీకరిస్తామని, ఆ తర్వాత విదేశాల్లో 2 పాటల చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుందని ఆయన తెలిపారు. తనకున్న పవర్‌ని ఆయుధంగా చేసుకుని పోరాటం చేసిన ఓ పోలీస్ ఆఫీసర్ కథే ఈ చిత్రమని, రవితేజ జన్మదినోత్సవ సందర్భంగా నిర్ణయించిన పవర్ అనే టైటిల్ ఖచ్చితంగా ఆయనకు యాప్ట్ అవుతుందని దర్శకుడు రవీంద్రనాథ్ తెలిపారు. హన్సిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి, రావు రమేష్, మిర్చి సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖావాణి, జోగి బ్రదర్స్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.్థమన్, కెమెరా: ఆర్థర్ ఎ.విల్సన్, ఎడిటింగ్: గౌతంరాజు, మాటలు: కోన వెంకట్, స్క్రీన్‌ప్లే: కె.చక్రవర్తి, నిర్మాత: రాక్‌లైన్ వెంకటేష్, కథ, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాథ్ (బాబి).

రవితేజ కథానాయకుడుగా రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై
english title: 
raviteja power

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>