
ఏ వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చాణిక్య బూనేటి నిర్మిస్తున్న ‘చందమామ కథలు’ చిత్రానికి సంబంధించిన షూ టింగ్ పూర్తయింది. లక్ష్మీప్రసన్న, చైతన్యకృష్ణ, నరేష్, ఆమ ని, కృష్ణుడు, కిశోర్ ప్రధాన తా రాగణంగా నటిస్తున్న ఈ చిత్రం గూర్చి దర్శకుడు మాట్లాడుతూ- నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ కలిసి మనసుపెట్టి ఈ చిత్రం కోసం పనిచేశారని, తాము ఏం చెప్పాలనుకున్నామో స్పష్టంగా సినిమాలో చెప్పే ప్రయత్నం చేశామని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, లోగో విడుదల త్వరలో చేసి పాటల విడుదల కూడా జరుపుతామని తెలిపారు. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత చాణక్య బూనేటి తెలిపారు. కార్యక్రమంలో లక్ష్మీ ప్రసన్న, నరేష్, కృష్ణుడు, అభిజిత్, నాగశౌర్య తదితరులు పాల్గొన్నారు. వెనె్నల కిశోర్, అమితారావు, కొండవలస, నరసింహరాజు, రిచాపనయ్, పృధ్వి, రాళ్లపల్లి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె మేయర్, ఎడిటింగ్:్ధర్మేంద్ర, నిర్మాత: చాణక్య బూనేటి, దర్శకత్వం:ప్రవీణ్ సత్తారు.