విశాఖపట్నం (జగదాంబ), జనవరి 25: విశాఖ ఉత్సవ్ నిర్వహణకు మూడు, నాలుగు రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన జిల్లా పర్యాటక అభివృద్ధి మండలి సమీక్ష సమావేశంలో జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిపై నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను కమిటీ సభ్యులతో సమీక్షించారు. కమిటీ కన్వీనర్, జసిల్లా పర్యాటక శాఖాధికారిణి అనిత మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలోగా విశాఖ ఉత్సవ్ నిర్వహించవలసిందని తెలుపగా మార్చ నెలలో వివిధ పరీక్షలు, పైగా ఎండలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఫిబ్రవరి మాసాంతంలోగా విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తే బాగుంటుందని పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఎక్కువ సమయం లేనందున ఉత్సవాన్ని ఏ స్థాయిలో నిర్వహించాలి అనే అంశంపై ఒక కమిటీని ఏర్పాటు చేసి మూడు నాలుగు రోజులలో ప్రణాళిక తయారు చేయాలని అన్నారు. జిల్లాలో పర్యాటక శాఖ ప్రగతిని, చేపట్టిన, చేపడుతున్న కార్యక్రమాలను, 2013-14 పర్యాటక శాఖ కార్యాచరణ ప్రణాళికను జిల్లా పర్యాటక శాఖాధికారిణి కమిటీలకు చైర్మన్‌కు, కమిటీ సభ్యులకు వివరించారు. విశాఖ-్భమిలి బీచ్‌రోడ్డులో మంగమూరి పేట వద్ద మత్స్యకార గ్రామాల్ని తలపించే విధంగా 50 లక్షల వ్యయంతో ఎకో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిపాదించామని నగరంలో కురుపాం మార్కెట్ వద్ద ఉన్న యూరోపియన్ సిమిట్రీ పునర్నిర్మాణపు పనుల సుందరీకరణకు 15 లక్షలు ప్రతిపాదించామని, అల్లూరి జన్మస్థలమైన పాండ్రంగి గ్రామంలో పర్యాటక వసతులకు 24 లక్షలు.
విశాఖ ఉత్సవ్ నిర్వహణకు మూడు, నాలుగు రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని
english title:
v
Date:
Sunday, January 26, 2014