న్యూఢిల్లీ, మార్చి 14: యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం లోక్‌సభలో ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్‌లో మన రాష్ట్రానికి న్యాయం జరిగింది. కొత్త రైళ్ల కేటాయింపులో రాష్ట్రం పంట పండింది. రైల్వే మంత్రి దినేష్ త్రివేదీ బుధవారం లోక్‌సభలో ప్రతిపాదించిన 2012-13 సంవత్సరం రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి ఇరవై ఎక్స్‌ప్రెస్ రైళ్లు, రెండు ప్యాసింజర్ రైళ్లను కేటాయించారు. రైల్వే బడ్జెట్‌లో 75 కొత్త రైళ్లను ప్రవేశ పెడితే అందులో ఇరవై మూడు రైళ్లు మన రాష్ట్రానికి దక్కడం గమనార్హం. రాష్ట్రానికి సంబంధించిన మూడు రైళ్లను పొడిగించారు. నాలుగు రైళ్ల ఫ్రీక్వెన్సీలను పెంచారు. కొత్తగా ప్రారంభిస్తున్న మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాష్ట్రం మీదుగా ప్రయాణం చేస్తాయి. రాష్ట్రంలోని ఐదు రైల్వే స్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా అభివృద్ధిచేస్తారు. రాష్ట్ర రాజధాని ప్రయాణికుల సౌకర్యార్థం అమలు చేస్తున్న ఎంఎంటిఎస్ రెండవ దశ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అంశాన్ని ఆయన రైల్వే బడ్జెట్‌లో ప్రస్తావించారు. దీనితోపాటు ఎంఎంటిఎస్ నిర్వహణ కోసం రాష్ట్రం ప్రభుత్వం, రైల్వే శాఖ కలిసి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు త్రివేదీ తెలిపారు. కాకినాడ-విశాఖపట్నం కోస్టల్ కారిడార్‌ను పిసిపిఐ ప్రాంతంగా ప్రకటించినందున దీని కోసం పిఠాపురం నుండి కాకినాడ వరకు రైల్వే లైను సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి తామీ పథకాన్ని చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. కొత్త లైన్ల నిర్మాణం, గేజ్ మార్పిడి, డబ్లింగ్ పనులను కలిసి చేపట్టేందుకు ముందుకు రావలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు త్రివేదీ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు భరించేందుకు ముందుకు వస్తే భద్రాచలం-కొవ్వూరు ప్రాజెక్టును చేపడతామని ప్రకటించారు. రైల్వే శాఖ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతోకలిసి చేపడుతున్న కొండపల్లి-కొత్తగుడెం, మణుగూరు రామగుండం, కదిరి-పుట్టపర్తి పథకాలను ప్రణాళికా సంఘం ఆమోదానికి పంపించినట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 72 మెగావాట్ల సామర్థ్యం గల విండ్‌మిల్ ప్లాంటులు ఏర్పాటు చేస్తున్నామని త్రివేదీ చెప్పారు.
రాష్ట్రానికి కేటాయించిన కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లు సికింద్రాబాద్ - విజయవాడ - షాలిమార్ ఎక్స్‌ప్రెస్ (వీక్లి), కాకినాడ - సికింద్రాబాద్ ఏసి ఎక్స్‌ప్రెస్ (ట్రైవీక్లి), బిదర్ - సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ - కాజిపేట - బెల్లంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (డైలీ), విశాఖపట్నం - చెన్నై ఎక్స్‌ప్రెస్ (వీక్లి), విశాఖపట్నం-విజయవాడ - మన్నాడ్ - సాయి నగర్ శిరిడి ఎక్స్‌ప్రెస్ (వీక్లి), కాచీగుడా - ధర్మవరం - పాకాల - మదురై ఎక్స్‌ప్రెస్ (వీక్లి), సికింద్రాబాద్ - బల్లార్షా - దర్భంగా ఎక్స్‌ప్రెస్ (బైవీక్లి), భువనేశ్వర్ - విజయనగరం - భవాన్నీపట్లం లింక్ (డైలీ), పురి - విశాఖపట్నం - గుంటూరు - యశ్వంత్‌పురా గరీబీరథ్ (వీక్లి), భువనేశ్వర్ - విశాఖపట్నం - గూడురు - తిరుపతి ఎక్స్‌ప్రెస్ (వీక్లి), విశాఖపట్నం - లోక్‌మాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ (వీక్లి) జయ్‌పూర్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, ఆదిలాబాద్ - ముద్కేడ్ - హజూరు సాహెబ్ నాందేడ్ ఎక్స్‌ప్రెస్ (డైలీ), మైసూర్ - ధర్మవరం - సాయి నగర్ శిరిడి ఎక్స్‌ప్రెస్, పోర్బందర్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, మన్నార్‌గుడి - తిరుపతి ఎక్స్‌ప్రెస్, నికింద్రాబాద్ - నాగపూర్ ఎక్స్‌ప్రెస్, కరీంనగర్ - తిరుపతి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్ - అజ్మీర్ ఎక్స్‌ప్రెస్‌లు. కొత్తగా ప్రారంభిస్తున్న మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇండోర్ - యశ్వంత్‌పురా ఎక్స్‌ప్రెస్ రైళు కాచీగుడా మీదుగా, అసన్‌సోల్ - చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలు విజయనగరం మీదుగా, చెన్నై - పురి ఎక్స్‌ప్రెస్ విజయవాడ, విశాఖపట్నం మీదుగా వెళతాయి. రాష్ట్రానికి కేటాయించిన రెండు ప్యాసింజర్ రైళ్లు ఎర్రగుంట్ల - నొస్సం ప్యాసింజర్ రైలు (డైలీ), గుణుపూర్-పలాసా ప్యాసింజర్ (డైలీ). ఇదిలా ఉంటే మధురై - తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను రామేశ్వరం వరకు, బోధన్ - నిజామాబాద్ ప్యాసింజర్ రైలును కామారెడ్డి వరకు అరక్కోణం - నందలూరు ప్యాసింజర్ రైలును కడప వరకు పొడించారు. సికింద్రాబాద్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు వారానికి రెండు రోజులకు బదులు నాలుగు రోజులు, హైదరాబాదు-కొల్హాపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ రైలు వారానికి రెండు రోజులకు బదులు ఏడు రోజులు, మధురై-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు వారానికి రెండు రోజులకు బదులు మూడు రోజులు, బెంగళూరు-హిందుపూర్ ప్యాసింజర్ రైలు వారానికి ఆరు రోజులకు బదులు ఏడు రోజులు నడిచేలా వీటి ఫ్రీక్వెన్సీ పెంచినట్లు త్రివేదీ ప్రకటించారు. జగ్గయ్యపేట-మేళ్లచెరువు, మెట్పల్లి-మోర్తాడ్, దేవరకద్ర-కృష్ణ కొత్త లైన్ల నిర్మాణాన్ని పూర్తి చేశామని ఆయన తెలిపారు. బెంగళూరు-నంద్యాల, మరికెల్-మక్తల్, రాయిచూర్-గద్వాల, మోర్తాడ్-ఆర్మూర్, కడప-గంగన్నపల్లి కొత్త లైన్ల నిర్మాణాన్ని 2012-13 సంవత్సరంలో పూర్తి చేస్తామని త్రివేదీ హామీ ఇచ్చారు. ఆర్మూర్-ఆదిలాబాద్, దొనకొండ-బిట్రగుంట, కొండపల్లి-కొత్తగుడెం, మణుగూరు-రామగుండం, మార్కాపూర్-శ్రీశైలం, పాండురంగపురం-బద్రాచలం, శ్రీనివాసపుర-మదనపల్లి, జహీరాబాద్-సికింద్రాబాద్ కొత్త లైన్ల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రణాళికా సంఘం ఆమోదానికి పంపించినట్లు ఆయన వెల్లడించారు. గుణ్‌పూర్-నర్సిపట్నం, మచిలీపట్నం-రేపల్లె, సింగరేణి కాలరీస్-గాంధీపురం కొత్త లైన్ల సర్వే కార్యక్రమాన్ని ఈ సంవత్సరం చేపడతామని త్రివేదీ తెలిపారు. బద్రాచలం-కొవ్వూరు, అక్కంపేట-మెదక్ కొత్త లైను నిర్మాణం చేపట్డేందుకు ఆమోదం తెలిపినట్లు త్రివేదీ వెల్లడించారు. కోరకొండ-విజయనగరం, కొత్తవలస-కంటకపల్లి, తాడిపత్రి-రాయలచెరువు, ఆదోని-ఇసివి లైన్ల డబ్లింగ్ పనులను ఈ సంవత్సరం పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కోరుకొండ-కంటకపల్లి, సింహాచలం-గోపాలపట్నం బైపాస్, రాఘవాపురం-పెద్దంపెట లైన్ల డబ్లింగ్ పనులను వచ్చే సంవత్సరం నాటికి పూర్తి చేయాలని ప్రతిపాదించారు. వీటితోపాటు కాజిపేట-విజయవాడ మూడోలైను డబ్లింగ్ పనులను వచ్చే సంవత్సరం చేపట్టాలని ప్రతిపాదించారు. బీబినగర్-నల్లపాడు, దోర్నకల్ జంక్షన్-మణుగూరు, రేణిగుంట-అలక్కోణం లైన్ల డబ్లంగ్ ప్రతిపాదనలను ప్రణాలికా సంఘం ఆమోదం కోసం పంపించినట్లు త్రివేదీ ప్రకటించారు. నల్లపాడు-గుంతకల్, హోస్పేట-గుంతకల్ రైల్వే లైను విద్యుద్దీకరణం ఈ సంవత్సరం చేపడతామని తెలిపారు. బీబినగర్-నల్లపాడు లైను విద్యుద్దీకరణానికి ఆమోదం తెలిపామన్నారు. కోటిపల్లి-నర్సపూర్, కడప-బెంగళూరు,నడికుడి-శ్రీకాళహస్తి, విజయవాడ-గుడివాడ-్భమవరం-నర్సపూర్,గుడివాడ-మచిలీపట్నం, భీమవరం-నిడదవోలు విద్యుద్దీకరణ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంతో చేపట్టినట్లు త్రివేదీ చెప్పారు. దువ్వాడ, మాచెర్ల, పిడుగురాళ్ల, సెత్తెనపల్లి, వినుకొండ రైల్వే స్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా చేపడతామని ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే గేజ్ మార్పిడి రంగంలో మాత్రం రాష్ట్రానికి కొంత అన్యాయం జరిగింది. రాష్ట్రంలో గేజ్ మార్పిడికి సంబంధించిన ఒక్క ప్రాజెక్టును కూడా రైల్వే బడ్జెట్‌లో పొందుపరచకపోవడం గమనార్హం. ప్రస్తుతం అమలు చేస్తున్న గేజ్ మార్పిడిని ఎప్పటిలోగా పూర్తి చేస్తామనేది కూడా బడ్జెట్‌లో ప్రకటించలేదు.
20ఎక్స్ ప్రెస్‌లు, రెండు పాసింజర్‌లు రాష్ట్రానికి ద్వివేదీ వరాలు
english title:
rilla sandadi
Date:
Thursday, March 15, 2012