
రోజూ పలకరించే ఆ కొమ్మ
ఈ రోజెందుకో వౌనముద్ర దాల్చింది
చిటారు కొమ్మన మిఠాయి పొట్లంలా
చిలిపి మాటల చిత్తగింపులు లేవు
బై చెప్పి పనికెళ్తున్నా బదులే లేని భావం
గుబులు మేఘం ఆవరించి
బాధ చక్రవడ్డీలా పెరుగుతోంది
గడియారం ముల్లు కూడా మూతి ముడిచింది
మదిలో పిచ్చి ఆలోచనల సుడులు
రోజెలా గడిచిందో ఎరుకే లేదు
రేపైనా మాట్లాడుతుందా
ఒక చిన్న ఆశ చిగురించింది
అయినా మా మధ్యన మాటలెందుకు
నా స్పర్శ తాకగానే అరచేతుల్లో
ఒదిగే ఆ లేలేత సౌందర్య ముఖారవిందాన్ని
మనసు ఆస్వాదిస్తోంది
వౌనమెందుకు... మాటలెందుకు...
నా చర్యలతో అది...
ప్రతి చర్యలతో నేను సౌందర్యారాధనలో ఉండగా
నా మనసు భాష అది పలుకుతున్నప్పుడు
దాని వౌన కదలిక
నాకు అవగతవౌతున్నప్పుడు
మా మధ్యన మాటలెందుకు... వౌనమెందుకు...!
రోజూ పలకరించే ఆ కొమ్మ
english title:
madyana
Date:
Monday, January 27, 2014