హైదరాబాద్, ఫిబ్రవరి 1: మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం హామీ ఇచ్చి జీవోలు జారీ చేసినా వాటి అమలును పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ 8 నుండి నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించినట్టు మున్సిపల్ కార్మిక, ఉద్యోగ ఐక్య సంఘాల ప్రధాన కార్యదర్శి కిర్ల క్రిష్ణారావు పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్ 21 నుండి 23 వరకూ జరిగిన సమ్మె, దానికి ముందు జరిగిన దశలవారీ ఆందోళనల కారణంగా ప్రభుత్వం దిగివచ్చి ఐక్యకార్యాచరణ కమిటీతో మున్సిపల్ మంత్రి మహీధర్‌రెడ్డి, ముఖ్యకార్యదర్శి, గ్రేటర్‌హైదరాబాద్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్లు పలు దఫాలుగా చర్చలు నిర్వహించి ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగిందని, ఆ మేరకు జీవో 1615ను ప్రభుత్వం జారీ చేసిందని అన్నారు. జీవో జారీ చేసి వంద రోజులు గడుస్తున్నా దాని అమలును పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్ సహా 19 మున్సిపల్ కార్పొరేషన్లు, 185 మున్సిపాల్టీలలో వాటర్‌వర్క్సు, వీధి లైట్లు, అత్యవసర సర్వీసులుగా భావించి మిగిలిన అన్ని విభాగాల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారని తెలిపారు. కరవు భత్యంతో కూడిన రూ.12500 వేతనం చల్లించాలని, అందరికీ 10వ తేదీలోపు జీతాలు చెల్లించాలని, 75 రోజుల సెలవు, ఇఎస్‌ఐ, పిఎఫ్ వంటివి వర్తింపచేయాలని, 4లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా అమలుచేయాలని ఆయన సూచించారు.
మున్సిపల్ కార్మిక, ఉద్యోగ ఐక్య సంఘాల వెల్లడి
english title:
m
Date:
Sunday, February 2, 2014