Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నికర జలాల సాధనకు 17న కలెక్టరేట్‌ల ముట్టడి

$
0
0

హైదరాబాద్, ఫిబ్రవరి 1: అదనపు జలాలపై నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులకు నికర జలాల సాధనకు 17న కలెక్టరేట్‌లను ముట్టడించాలని సిపిఐ నిర్ణయించింది. జిల్లాల సంయుక్త సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్టు కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ తెలిపారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బిసి టనె్నల్, నక్కల గండి లిఫ్ట్, వెలిగొండ ప్రాజెక్టులకు నిఖల జలాలను చూపించాలని అన్నారు. జనవరి 31న కడపలో జరిగిన సంయుక్త సమావేశంలో కూడా ఈ మేరకు నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారని అన్నారు. ఫిబ్రవరి 5న సామూహిక నిరాహార దీక్షలు, సంతకాల సేకరణ, ప్రచార జాతాలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కూడా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ప్రాజెక్టుల కోసం ఆందోళనను విస్తృతం చేయాలని పిలుపునిచ్చినట్టు చెప్పారు. బ్రిజేష్‌కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రంలో మిగులు జలాలపై నిర్మించే ప్రాజెక్టులు అన్నింటికీ అగ్నిపరీక్ష ఎదురవుతోందని అన్నారు. ఇప్పటికే పార్టీ తరఫున జిఓఎంకు ఇచ్చిన నివేదికలో బ్రిజేష్‌కుమార్ మిశ్రా తీర్పును పున:సమీక్షించాలని కోరామన్నారు. తక్షణం ప్రచార జాతాలు, సంతకాల సేకరణ, కలెక్టరేట్‌ల ముట్టడి వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు.
‘్భజన’ కార్మికుల సభలు
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర స్థాయి మహాసభలను 2, 3 తేదీల్లో కరీంనగర్‌లో నిర్వహిస్తున్నట్టు యూనియన్ ప్రధానకార్యదర్శి ఎం శివనాగమల్లీశ్వరి తెలిపారు. ఎఐటియుసి జాతీయ కార్యదర్శి బి వి విజయలక్ష్మి, ఎమ్మెల్సీ పిజె చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు హాజరవుతారని వివరించారు.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గం నిర్ణయం
english title: 
cpi

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>