Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

బిజెపికి పూర్వవైభవం తీసుకువస్తాం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 6: బిజెపి రానున్న రోజుల్లో అంతా మంచే జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ ఉప ఎన్నికల్లో తమవైపు ప్రజలు నిలబడడం కొత్త ఉత్సాహాన్నివ్వడంతో పాటు తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. శుక్రవారం బర్కత్‌పురాలోని గ్రేటర్ బిజెపి కార్యాలయంలో నిర్వహించిన పార్టీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్రంలో బిజెపికి పూర్వవైభవం తేవడానికి క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి అన్నారు. అనంతరం బిజెపి జెండాను ఆ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు బి.వెంకట్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, బద్దం బాల్‌రెడ్డిలతో పాటు నగర నేతలు భవర్‌లాల్‌వర్మ, శ్రీ్ధర్ తదితరులు పాల్గొన్నారు.

కిషన్‌రెడ్డి
english title: 
kishen reddy

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles