నల్లకుంట, ఏప్రిల్ 6: తెలంగాణ రాష్ట్ర సాధన ఆలస్యమవుతున్న తరుణంలో విద్యార్థులు ఆవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఓయుటిఏ) విద్యార్థులకు విజ్ఞప్తి చేసింది. శుక్రవారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ బి.సత్యనారాయణ, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ ఎ.రాములు ఫ్రొఫెసర్ నిర్మల బాబురావుమాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది పూర్తిగా రాజకీయ ప్రకియఅని, రాజకీయ నాయకులు కూడా విద్యార్థుల ఆత్మహత్యలు నివారించేందుకు తగినచర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజయకీయ నాయకులపై విశ్వాసం లేకపోవడం వల్లనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఆత్మహత్యలతో తెంలగాణ రాదని, అది రాజకీయ ప్రక్రియతోనే సాధ్యమని, విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలకు పాల్పడడంతో వారి తల్లిదండ్రులకు క్షోభ మిగిల్చినవారవుతారని, దయచేసి ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. ఈ సమావేశంలో ఓయుటిఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి.మోహన్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు డాక్టర్ లక్ష్మీకాంత్, ఎ.కిష్ణయ్య, బి.సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-- ఉస్మానియా వర్సిటీ టీచర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి --
english title:
students
Date:
Saturday, April 7, 2012