హైదరాబాద్, ఫిబ్రవరి 6: సికింద్రాబాద్ పికెట్ నాలాకు సమీపంలోనున్న ప్యాట్నీనగర్ వాసులను మున్ముందు వరద ముప్పు నుంచి రక్షించేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని గ్రేటర్ కమిషనర్ సోమేశ్‌కుమార్ జోనల్ కమిషనర్ హరికృష్ణను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆయన ప్యాట్నీనగర్‌లో పర్యటించి స్థానికులెదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 3వ తేదీన జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్యాట్నీనగర్ వాసులకు ఇచ్చిన హామీ మేరకు కమిషనర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి సమస్యలను పరిశీలించారు. ఓ మోస్తారు వర్షం కురిస్తే చాలు ప్యాట్నీనగర్ మొత్తం మునిగిపోతుందని స్థానికులు మొరబెట్టుకున్నారు. పరిసర ప్రాంతాలకు చెందిన 12కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు ‘ది బస్తీ వికాస్ మంచ్’ ఆధ్వర్యంలో నేరుగా కమిషనర్‌ను కలిసి వర్షాకాలంలో ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. ఇక్కడి ప్రజల రక్షణను దృష్టిలో పెట్టుకుని అధికారులు యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నందున మరింత జఠిలం చేసే విధంగా పనులు చేపట్టకుండా రైల్వే అధికారులు అనుసరించే అధునాతన టెక్నాలజీతో పనులు చేపట్టాలన్నారు.ఇంజనీర్ ఇన్ చీఫ్ ధన్‌సింగ్, చీఫ్ ఇంజనీర్ ఆంజనేయులతో కూడిన అధికారులు బృందం ఆ తర్వాత బేగంపేట ఫతేనగర్ లింకురోడ్డు పనులను పరిశీలించారు.
సికింద్రాబాద్ పికెట్ నాలాకు సమీపంలోనున్న ప్యాట్నీనగర్ వాసులను మున్ముందు
english title:
flood threat
Date:
Friday, February 7, 2014