హైదరాబాద్, ఫిబ్రవరి 6: మహానగర ప్రజలకు వివిధ రకాల సేవలందించే ముఖ్యమైన విభాగాలు తమ సేవలను ఆన్‌లైన్‌లో అందించేందుకు ఆసక్తిని చూపుతున్నాయి. మరింత త్వరితగతిన, పారదర్శకతతో కూడిన సేవలందించాలన్న లక్ష్యంతో సంస్కరణలను చేపట్టాయ. ఇప్పటికే భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులు, దరఖాస్తు పరిశీలన ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు బల్దియా అధికారులు టౌన్‌ప్లానింగ్ సేవలను ఆన్‌లైన్ చేసిన సంగతి తెలిసిందే! హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాలతో కలిపి సుమారు ఏడు వేల చదరపు విస్తీర్ణంలోని ప్రజలకు వివిధ రకాల సేవలందిస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ కూడా ఇదే బాటలో నడుస్తోంది. ఒకవైపు ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలమవుతూనే, కీలకమైన ప్లానింగ్ విభాగంలోని లే అవుట్ల అనుమతి వంటి సేవలను ప్రజలకు మరింత త్వరితగతిన అందేందుకు వీలుగా శ్రీకారం చుట్టడం అభినందనీయం. హెచ్‌ఎండిఏ ఆన్‌లైన్ సేవల వ్యవస్థను రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే వివిధ సేవల కోసం ప్రజలు కార్యాలయం చుట్టూ ప్రదిక్షణలు చేయాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ప్లానింగ్ సేవలు, అయితే వ్యక్తిగత ఇళ్ల నిర్మాణ అనుమతులను మాత్రమే ఆన్‌లైన్ చేసిన బల్దియా అధికారుల మాదిరిగానే హెచ్‌ఎండిఏ అధికారులు కూడా తొలుత ఆన్‌లైన్‌లో లే అవుట్ల అనుమతుల ప్రక్రియను, అందుకు కావల్సిన అనుమతులను అందుబాటులోకి తెచ్చారు. ఆన్‌లైన్ గ్రీన్‌చానెల్ ద్వారా సేవలందించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్న కొందరు ఆర్కిటెక్చర్లు, డాక్యుమెంట్ నిపుణుల వివరాలను కొత్త ప్రారంభించే వెబ్‌సైట్‌లోనూ, పౌరసేవ కేంద్రాల్లోనూ అందుబాటులో ఉంచుతారు. ప్రతి సోమ, మంగళవారాల్లో దరఖాస్తులను స్వీకరించి, తుదుపరి గడువునిస్తారు. ఆ రోజు దరఖాస్తుపై ఏదో ఓ నిర్ణయాన్ని చెప్పి, తదుపరి పక్రియ పూర్తి చేసి అప్పటికపుడే సేవలందేలా పనిచేయటం ఈ కొత్త వ్యవస్థ ఉద్దేశ్యమని అధికారులు చెబుతున్నారు.
మహానగర ప్రజలకు వివిధ రకాల సేవలందించే ముఖ్యమైన విభాగాలు తమ సేవలను ఆన్‌లైన్‌లో
english title:
online
Date:
Friday, February 7, 2014