Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

'కోడ్'కూస్తుందన్న భయంతో కళ్లు తెరిచిన ‘స్థాయీ’ సంఘం

$
0
0

హైదరాబాద్, ఫిబ్రవరి 6: దేశ రాజకీయాల్లోనే అసక్తి, ఉత్కంఠను నింపిన రాష్ట్ర విభజన కారణంగా ఎన్నికలెపుడైనా రావచ్చని, కోడ్ కూస్తే అభివృద్ధి పనులకు బ్రేక్ పడుతుందన్న భయంతో గ్రేటర్ బల్దియా స్థాయీ సంఘం కళ్లు తెరిచింది. గురువారం మేయర్ మాజీద్ హుస్సేన్ అధ్యక్షతన ప్రధాన కార్యాలయంలో జరిగిన స్థాయీసంఘం 12వ సాధారణ సమావేశానికి సంబంధించిన 47 అంశాలతో కూడిన ప్రతిపాదనలతో పాటు అప్పటికపుడే అదనపు ప్రతిపాదనలుగా మరో 36 అంశాలను స్వీకరించి సుదర్ఘీంగా చర్చించారు. మొత్తానికి గురువారం నాటి స్థారుూ సంఘం సమావేశం స్వామికార్యం, స్వకార్యం అన్న చందంగా జరిగింది. స్థారుూ సంఘంలోని ఎనిమిది మంది కాంగ్రెస్, మేయర్‌తో కలిపి మరో ఎనిమిది మంది మజ్లిస్ కార్పొరేటర్లు ప్రతిపాదించిన పనులు, అంశాలే ఉండటం విశేషం. ఆమోదం తెలిపిన ప్రతిపాదనల్లో, చర్చించిన అంశాల్లో ఎక్కువ శాతం మేయర్, డిప్యూటీ మేయర్, స్థారుూ సంఘం సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లకు చెందినవే. ఎవరికివారే పార్టీ పరంగా, వ్యక్తిగతంగా మేయర్, కమిషనర్లపై వత్తిడి చేస్తూ పనులు మంజూరీ చేయించుకోవటం గ్రేటర్‌లో మామూలైపోయిందంటూ విపక్షాలకు చెందిన కార్పొరేటర్లు వాదిస్తున్నారు. గతంలో 47 అంశాలతో కూడిన ప్రతిపాదనలున్న అజెండాలపై స్థారుూ సంఘం చర్చించి, నిర్ణయాలు తీసుకున్న దాఖలాలున్నా, అదనంగా 36 అంశాల ప్రతిపాదనలను చర్చకు, పరిశీలనకు స్వీకరించటం ఇదే ప్రథమం. గురువారం నాటి స్థారుూ సంఘం ఆమోదించిన పలు ప్రధాన అంశాల్లో కోట్లలో పేరుకుపోయిన స్థల సేకరణ నష్టపరిహారం తాలుకు ప్రతిపాదనలుండగా, మరికొన్ని మేయర్, డిప్యూటీ మేయర్, స్థారుూ సంఘం సభ్యులకు చెందిన డివిజన్లలోని అభివృద్ధి పనులున్నాయి. దీంతో పాటు ఇటీవల నిర్వహించిన డెబ్రీస్ క్లియరెన్స్ కార్యక్రమంలో బినామీ పేర్లతో వాహనాలను సమకూర్చిన పలువురు కార్పొరేటర్ల వివాదాస్పదమైన పెండింగ్ బిల్లులకు కూడా పనిలో పనిగా మోక్షం కల్గించారు. ఆమోదం పొందిన ప్రతిపాదనల్లో గ్రేటర్ సరిహద్దుల్లోని నాలుగు ప్రాంతాల్లో అందమైన ఆకృతుల్లో ఆర్చీలను ఏర్పాటు చేసే ప్రతిపాదన, పలు ప్రాంతాల్లో బిటి రోడ్ల రీ కార్పెటింగ్ వంటి అంశాలున్నాయి.
ఔట్‌సోర్స్ ఉద్యోగుల బీమా పాలసీకి ఆమోదం
ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న జిహెచ్‌ఎంసి ఔట్‌సోర్స్ ఉద్యోగుల ప్రమాద బీమా పథకం ప్రతిపాదనకు గురువారం నాటి స్థారుూ సంఘం ఆమోదం తెలిపింది. మొత్తం 26వేల 400 మంది ఔట్‌సోర్స్ ఉద్యోగులకు యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా యాక్సిడెంట్ బీమా ను కల్పించేందుకు ఏటా రూ. 5లక్షలను కార్పొరేషన్ వాటాగా చెల్లించాలని సవరించిన ప్రతిపాదనను స్థారుూ సంఘం ఆమోదించింది.

బెంగాల్ ఫెస్టివల్ ప్రారంభం
గచ్చిబౌలి, ఫిబ్రవరి 6: శిల్పారామంలో నిర్వహిస్తున్న రూపసి బాంగ్లా బెంగాల్ ఫెస్టివల్‌ను గురువారం ప్రత్యేక అధికారి జిఎన్ రావు ప్రారంభించారు. స్వయంబర్ నారీ సంస్థ, శిల్పారామం సంయుక్త ఆధ్వర్యంలో ఫెస్టివల్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌కు శాంతినికేతన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బెంగాలీ పేద కళాకారులకు ప్రదర్శన ద్వారా ఆర్జించిన మొత్తాన్ని అందిస్తామని చెప్పారు. 10వ తేదీ వరకు ఉత్సవాలు ఉంటాయని తెలిపారు. స్వయంబర్ నారీ వ్యవస్థాపక కార్యదర్శి సురంగమ భద్ర, శిల్పారామం ఎస్‌ఇ శ్రీనివాసులు, జిఎం వేణుగోపాల్ పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా ప్రదర్శనలో పెట్టిన వివిధ రకాల వస్తువులు ఆకట్టుకున్నాయ.

ఉత్సాహాన్ని నింపిన ‘తరంగ్-2014’

హైదరాబాద్, ఫిబ్రవరి 6: విభిన్న వేషధారణలు, సాంస్కృతిక ప్రదర్శనలతో మరో సారి ఆకట్టుకుంది తెలుగు లలితకళాతోరణం. అవంతి విద్యా సంస్థల 22వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అవంతి కాలేజీల విద్యార్థులు తమ కళాప్రతిభతో అందర్నీ ఆకట్టుకున్నారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి అవంతి విద్యాలయాల చైర్మన్, ఎమ్మెల్యే శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించిన ఈ ఉత్సవాల్లో వేలాది సంఖ్యలో హజరైన విద్యార్థుల కేరింతలతో పబ్లిక్‌గార్డెన్ మారుమోగింది. సాంప్రదాయ బద్దమైన వస్త్రాలంకరణ, తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలను చాటిచెప్పే విధంగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు సాగాయి. అంతేగాక, జాతీయ సమైక్యత భావాన్ని చాటిచెప్పేలా విద్యార్థులిచ్చిన ప్రదర్శన ఆహూతుల్ని, కార్యక్రమానికి విచ్చేసిన అతిధుల్ని ఆకట్టుకుంది. నాట్య, సంగీత తదితరంశాలతో కొనసాగిన ప్రదర్శనలు విద్యార్థుల కళాప్రతిభకు ప్రతీకగా నిలిచాయి. కేవలం విద్యాభ్యాసంలోనే గాక, ఆట పాటలో కూడా విద్యార్థులు తమ సత్తాను చాటుతూ దుమ్ము రేపారు.
కలల సాకారానికి కష్టపడండి!
వార్షికోత్సవాలను ప్రారంభించినానంతరం చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘తరంగ్-2014’ పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపాలని ఆకాంక్షించారు. విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు కళాంశాల్లో కూడా ప్రావీణ్యతను పెంపొందించుకోవాలన్నారు. వారు బాల్యం నుంచే వివిధ కళాంశాల పట్ల ఆసక్తి కనబర్చేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం ఆజాద్ చెప్పిన విధంగా కలలు కనాలి, కష్టపడి వాటిని సాకారం చేసుకునే దిశగా కృషి చేయాలన్నారు. ఆజాద్ ఏ విధంగానైతే కష్టపడి ఓ శాస్తవ్రేత్తగా, భారత రాష్టప్రతిగా ఎదిగాడో విద్యార్థులు కూడా కలలు కని వాటిని నిజం చేసుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. దేశంలోని అయిదు టాప్ కాలేజీల జాబితాలో తమ విద్యాలయాలున్నాయని, ఇటీవలే నిర్వహించిన సర్వే వెల్లడించటం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రతాప్‌రెడ్డి, విద్యాలయాల ప్రతినిధులు టి.మోహన్‌సింగ్, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.

తెలంగాణ బిల్లుకు బిజెపి బేషరతుగా మద్దతు తెలపాలి
తార్నాక, ఫిబ్రవరి 6: భారతీయ జనతా పార్టీ తెలంగాణ బిల్లుకు మద్దతు తెలపాలని కోరుతూ తెలంగాణా ఐటి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణా ఐటి అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్‌కుమార్ మక్తాల మాట్లాడుతూ బిజెపి ఆది నుంచి తెలంగాణ వైపు నిలబడి తెలంగాణ అమరుల త్యాగాలను గుర్తించి బేషరతుగా మద్దతు ప్రకటించిందని అన్నారు. తీరా అనేక ఒడిదుడుకుల అనంతరం బిల్లు పార్లమెంట్‌కు చేరుకుంటున్న తరుణంలో కొత్తమెలికలతో తెలంగాణప్రజల హృదయాలను గాయపర్చడం మంచిదికాదని ఆయన అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కోరారు. అధిష్టానాన్ని ఒప్పించి పార్లమెంట్‌లో బిల్లు నెగ్గేలా చర్యలు తీసుకోవాలని కోరడంతో ఆయన అందుకు సానుకూలంగా స్పందించడంతోపాటు తాను ఢిల్లీకి వెళుతున్నానని చెప్పి ఐటి ఉద్యోగులను శాంతింపజేశారు. కాగా తెలంగాణ ఆలస్యమయ్యే కొద్దీ పెట్టుబడి పెట్టాలని చూస్తున్న కంపెనీలు వెనకంజవేసే ప్రమాదం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం నవీన్, సందీప్‌గౌడ్, కిరణ్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

దేశ రాజకీయాల్లోనే అసక్తి, ఉత్కంఠను నింపిన రాష్ట్ర విభజన కారణంగా
english title: 
standing committee

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>