హైదరాబాద్, ఏప్రిల్ 6: ప్రపంచానికి ప్రేమామృతాన్ని పంచిన గొప్ప మానవతామూర్తి ఏసుక్రీస్తు అని సెయింట్ మేరీస్ చర్చి రెవరెండ్ వై.బాలశౌరి అన్నారు. గుడ్‌ఫ్రైడే సందర్భంగా నగరంలోని పలు చర్చిల్లో శుక్రవారం ఏసుక్రీస్తును స్మరిస్తూ పలు ప్రార్థనా కార్యక్రమాలను నిర్వహించారు.
సికింద్రాబాద్, బొల్లారం, తిరుమలగిరి, ఆబిడ్స్, బాకారం తదితర ప్రాంతాల్లోని చర్చిలు ఉదయం నుంచే క్రైస్తవులతో కిటకిటలాడాయి. సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ చర్చిలో బాలశౌరి నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏసుక్రీస్తు శిలువధారిగా మారిన వృత్తాంతాన్ని నృత్యరూపకంతో వివరించారు.
లాస్ట్ సప్పర్ పేరిట ఆధ్యాత్మిక సమావేశం నిర్వహించారు. వెస్లీ చర్చిలో రెవరెండ్ టి.్భస్కర్ శాంతి సందేశాలను వివరించారు. ఏసు శిలువధారియైన సందర్భంలో ప్రపంచానికి చెప్పిన సప్త శాంతి వచనాల ప్రాముఖ్యతను తెలియజేశారు. బాప్టిస్ట్ చర్చిలో ఫాదర్ నల్ల థామస్ ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. నగరంలోని చారిత్రక చర్చిలన్నింటి వద్ద పోలీసులు అసాధారణ భద్రతా ఏర్పాట్లను చేశారు.
ప్రపంచానికి ప్రేమామృతాన్ని పంచిన గొప్ప మానవతామూర్తి ఏసుక్రీస్తు అని సెయింట్
english title:
christ
Date:
Saturday, April 7, 2012