శివతాండవంలో నర్తిస్తున్న నటరాజు విగ్రహాన్ని లేదా
చిత్రపటాన్ని పరిశీలించండి, ఆయన కుడికాలి కింద
అంజలి ముద్రలో మరుగుజ్జు మనిషి వుంటాడు. ఆయన
‘‘అపస్మార పురుషుడు’’. తమోగుణ అవశేషానికి ప్రతీక.
ఈ అపస్మార వ్యాధి పౌరాణిక సంబంధమైనదిగా
ఆయుర్వేద శాస్తజ్ఞ్రులు చెబుతారు. అపస్మార వ్యాధిలో
చేష్టావహ సౌంజ్ఞలను కోల్పోయి శరీరం బిగుసుకుపోయి,
స్మృతితప్పి జ్ఞానం కోల్పోయి సంజ్ఞావహ నాడులలో స్తబ్ధత
ఏర్పడి, మెదడులోని విద్యుద్ఘటనలలో సంక్షోభం ఏర్పడి
అసంకల్పిత కదలికలతో ఒక నిముషము లేక కొన్ని
నిముషాలు కాళ్ళు చేతులు, మెడ, శిరస్సు, క్రమబద్ధంగా
వణకడం, చొంగ, నురగ నోటినుంచి కార్చడం,
తెలియకుండా మూత్రవిసర్జన, వణకటం అధికమై తగ్గటం,
తగ్గిన తరువాత నిద్రనుంచి లేచినట్లు కళ్ళు తెరవడం
జరుగుతుంది. ఈ లక్షణాలతో కలిగే వ్యాధినే అపస్మారక,
సీజర్సు, ఎపిలెప్సీ (మూర్ఛ) అంటారు. ఇది కేంద్ర
నాడీవహ సంస్థానమునకు సంబంధించినది.
5-10 సంవత్సరాల లోపు పిల్లలలో జ్వర తీవ్రత
అధికమైనప్పుడు కొందరిలో ఈ సీజర్సు లక్షణాలు
కన్పిస్తాయి. జ్వర ఉపశమనంతో త్వరగా కోలుకుంటారు.
దీనిని ఫెబ్రైల్ కన్వల్షన్స్ అంటారు.
కొందరు రక్తం చూసి ఫైంట్ అవుతారు. ఆ రక్తం వాసనకు
స్పృహ కోల్పోవడం జరుగుతుంది. ఇటువంటి వారికి
విశ్రాంతి కల్పిస్తే త్వరగా కోలుకుంటారు.
ఎపిలెప్సీ వ్యాధికి కారణాలు కనుగొన్నప్పటికీ
వయస్సునుబట్టి సంక్రమించే పలు రకాలుగా
వర్గీకరించవచ్చు, 5 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల
లోపు వారిలో ఇది బయట పడుతుంది.
అనేక కారణాలలో సర్వలక్షణ సమన్వితంగా వుండేది
మరొక రకం వ్యాధి. శిశువు మెదడుకు దెబ్బ, వత్తిడి
జరగటం, పుట్టుకతో కొన్ని అవలక్షణాల వలన, సీరం
అమోనియా తక్కువ అవడం పోషక ఖనిజాలలో నిష్పత్తి
వ్యత్యాసం వలన కూడా ఏర్పడుతుంది.
పెద్దవారిలో మద్యపానం, కొన్ని రకాల మందుల వాడకం,
మూత్ర పిండాల వ్యాధులు, మధుమేహవ్యాధివలన వచ్చే
అవకాశం వుంది. తలకు గాయం అవడంవలన, ఏ
వయస్సు వారిలోనైనా దెబ్బ తగిలిన వారం రోజులలో
రావచ్చు, లేదా తర్వాత కాలంలోనైనా రావచ్చు. ముందు
జాగ్రత్తగా యాంటీ ఎపిలెప్పిక్ మందులు వాడటం
జరుగుతుంటుంది.
మెదడులో ఏర్పడే కణుతులు, అడ్డగింపుల వలన కూడా
ఇది వచ్చే అవకాశం వుంది. 60 సంవత్సరాల తరువాత
వచ్చే మార్పులవలన, వయస్సు పైబడటంవలన
‘అల్జీమర్స్’అనే వ్యాధిలో కన్పించే అవకాశం వుంది.
వ్యాధికారక క్రిములవలన, మెదడు పొరలకు
వాపురావడంవలన, వైరస్, న్యూరోసిఫిలిస్, హెర్పిస్
తదితర కారణాలవలన ఎప్పిలెప్సీ వచ్చే అవకాశం వుంది.
ఎటాక్ వచ్చే లక్షణాలు కొందరిలో ముందుగా తెలియజేసేవి
వుంటాయి, తలనొప్పి, మూడ్స్ మారటం బద్ధకం,
కండరాలు అదరటం, విజువల్ ఆరా వంటివి అనుభవంలోకి
వస్తాయి.
భద్రతకోసం కూర్చోబెట్టడం, కూర్చోవడం లేదా పడుకోవడం,
పడుకోబెట్టడం పూర్వరూప లక్షణాలు కన్పించినప్పుడు
జాగ్రత్తపడితే మంచిది.
కొందరికి ఎటాక్ నిద్ర సమయంలో కన్పిస్తుంది. వారికి
తెలియనే తెలీదు. భారతదేశంలో షుమారు 6 మిలియన్ల
మంది ఈ ఎపిలెప్సీతో బాధపడుతున్నారని ఒక అంచనా.
ఎటాక్ వచ్చేటపుడు రోగిని ఎత్తుగా వుంచకుండా, నేలపై
వుండేలా పడుకోబెట్టే ఏర్పాటుచేయాలి. అడ్డంకులు
లేకుండా వుంచాలి.
నోటినుంచి చాలా ఫ్రీగా చొంగ, నురగ వచ్చే విధంగా పక్కకు
పడుకోబెట్టాలి. నోటిలో కాని, పళ్ళమధ్య కాని
ఏమీవుంచకుండా చూడాలి. అది ఊపిరి తిత్తులలోకి
వెళ్ళవచ్చు. నాలిక కొరుక్కొనకుండా పళ్ళ మధ్య ఏదైనా
మెత్తటిది (బేండేజ్ క్లాత్) వంటిది వుంచాలి. ఎక్కువ
సమయం ఎటాక్ వున్నపుడు అత్యవసర వైద్య సహాయం
అందించాలి.
నిర్ధారణ
సిటి స్కాన్: యంఆర్‌ఐ వంటి ఆధునిక వ్యాధి నిర్ధారణ
ఉపకరణాలతో కారణాలను కనుగొని మేలైన చికిత్సను
ప్రారంభించవచ్చు. ‘ఎలక్ట్రో ఎన్‌సిఫిలోగ్రఫీ’ పరికరం ద్వారా
మెదడు ఏ భాగంలో తీవ్రత అధికంగా వుందో
అంచనావేయవచ్చు. తలకు ఎలక్ట్రోడులు అమర్చి
మెదడులోని ఎలక్ట్రికల్ తరంగాల వైరుధ్యాన్ని గుర్తిస్తారు.
చికిత్స
అపస్మారక చికిత్సలో మందుల వాడకంతోబాటుగా
సైకోథెరపీ కూడా అవసరం. ఆహార నియమావళి, జీవన
విధానంలో కొద్దిపాటి మార్పులతో ఆలోచనా దృక్పథం
ఎప్పుడు పోజిటివ్‌గా వుండేలాచూడాలి. ఆగ్రహావేశాలకు
లోనుకాకుండా, మనస్సు ప్రశాంతంగా వుంచుకునేలా,
ధ్యాన చికిత్స, ప్రాణాయామం పాటించాలి. అపస్మారక
చికిత్సలో ఘృతం యొక్క ప్రాముఖ్యం చాలా ఎక్కువ.
బ్రాహ్మీ ఘృతం, పంచగవ్య ఘృతం, కళ్యాణక ఘృతం,
కూష్మాండ రసాయనం వంటి క్రమపద్ధతిలో వైద్యుని
సలహాతో సేవించాలి. ఘృతం మేధ్యరసాయనం.
మెదడులోని బ్లడ్ బ్రెయిన్ బారియర్‌లను తొలగించుకొనే శక్తి
కేవలం ఘృతానికి మాత్రమే కలదు. ఘృతంలోని ఫేటీ
యాసిడ్స్ ద్వారా ఓషధాలు మెదడులోకి ప్రసరిస్తాయి.
ఇవికాక స్మృతి సాగర రసం, వాతకులాంతక రసం,
చతుర్మఖరసం, మానస మిత్రపటకం, సారస్వతారిష్ట బాగా
ఉపయోగపడతాయి.
ప్రతిదినం వచ చూర్ణం అర చెంచా తేనెతో ఉదయం
సాయంత్రం తీసుకోవాలి. దీనికితోడు బ్రాహ్మీ ఆకుల రసం
తేనెతో తీసుకోవాలి.
సైల్‌డిన్, మన్‌టాట్ డియస్, ఆఫ్‌సా వంటి ఫార్మ్లులేషన్లు
నిరపాయకరమైనవి. మేధ్య రసాయనంగా పనిచేస్తాయి.
యాంటీ కన్వల్సెంట్ మందులవలన వచ్చే సైడ్‌ఎఫెక్ట్స్
దృష్టిలో వుంచుకొని దీని వాడకంలో జాగ్రత్త పడాలి.
అధిక కాలం వాడాల్సి రావడంవలన నడవడికలో
విపరీతమైన మార్పులు, అతిగా వాడడం లేదా మొద్దుగా
వుండటం, పంటి చిగుళ్ళు వాచిపోవడం. అకారణంగా
కోపం చిరాకు, అతిగా నిద్రపోవడం డిప్రెషన్ లాంటి
లక్షణాలు సైడ్ ఎఫెక్ట్స్ లక్షణాలు వుంటాయి.
ఆయుర్వేద వైద్యంలోని ప్రత్యేక చికిత్సలు ఎపిలెప్సీ
నివారణకు బాగా ఉపయోగిస్తున్నాయని గమనించాలి.
ఈ వ్యాధికి దైవ వ్యపాశ్రయ చికిత్స (డివైన్ థెరపీ) యుక్తి
వ్యపాశ్రయ చికిత్స (బయొలాజికల్ థిరఫి) 3) సత్వావజ
(సైకోథెరపీ) వర్గీకరించుకొని దీర్ఘకాలిక కార్యక్రమంగా
వుండాలి.
కొంచెం పెద్దవారిలో కప్పికచ్చు, అశ్వగంధతో కూడిన
మందులు డిప్రెషన్ వున్న వారిలో మంచి ఫలితం
వుంటుంది.
శంఖపుష్పి, మండూక పర్ణి, బ్రాహ్మీ, జ్యోతిష్మతి, తులసి,
వచ, యష్టిమధు, అత్యంత ఉపయుక్తమయిన ఓషధులు.
సైకోసిస్ సమస్యగా వుంటే పాలిహెర్బో మినరల్ కాంపౌండ్
అయిన, స్మృతి సాగర రస, ఉన్మాదగజ కేసరి
మేధ్యరసాయనమైన మండూకపర్ణితో తీసుకొంటే
బుద్ధివికాసం బాగా వుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ప్రత్యేక చికిత్సలయిన శిరోధార, శిరోపస్తి బాగా
ఉపకరిస్తుంది. ఓషధ ద్రవాలను, తైలాలను ఇందుకు
ఉపయోగిస్తారు.
మూడువారాలు ప్రతిరోజు 45 నిముషాల సేపు
నిర్వహిస్తారు. తరువాత నస్యకర్మ కూడా జ్మూబిష్మతి
తైలంతో నిర్వహిస్తే మంచి ఫలితం వుంటుంది.
అవసరాన్నిబట్టి అనుభవం కలిగిన వైద్యుల పర్యవేక్షణలో
ఈ మిశ్రీత విధానం వలన స్రోతశోధనం జరిగి, నరాలకు
బలం చేకూరి త్వరగా కోలుకొనే అవకాశం పూర్తిగా వుంది.