దుబాయ్, ఫిబ్రవరి 18: న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్‌లో జరిగిన చివరి టెస్టు మంగళవారం డ్రాగా ముగియడంతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా రెండో స్థానం పదిలంగా ఉంది. ఈ సిరీస్‌లో భారత జట్టు 0-1 తేడాతో ఓటమి చెందడంతో రేటింగ్ పాయింట్లు 117 నుంచి 112కు తగ్గాయి. అయినప్పటికీ ఆస్ట్రేలియా జట్టు కంటే భారత్‌కు ఒక రేటింగ్ పాయింట్ అదనంగా ఉండటంతో ప్రస్తుతానికి రెండో ర్యాంకు చెక్కుచెదరలేదు. అయితే కటాఫ్ తేదీగా ఉన్న ఏప్రిల్ 1లోగా భారత్‌ను అధిగమించి ఆస్ట్రేలియా జట్టు రెండో స్థానానికి చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో మూడు టెస్టుల సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే తొలి టెస్టులో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించినా లేక కనీసం డ్రాగా ముగించినా ర్యాంకింగ్స్‌లో భారత్‌ను అధిగమించడం ఖాయం. అయితే దక్షిణాఫ్రికా జట్టు పుంజుకుని మిగిలిన రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియాను ఓడిస్తే మాత్రం టీమిండియా రెండో ర్యాంకుకు ముప్పు ఉండదు.
న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్‌లో
english title:
second place
Date:
Wednesday, February 19, 2014