పాడేరు, ఫిబ్రవరి 18: మన్యంలో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి దేవాలయం ప్రభుత్వపరమయ్యింది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు సిఫార్సు మేరకు మోదకొండమ్మ అమ్మవారి ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా అమ్మవారి ఆలయానికి ఎగ్జిక్యూటివ్ అధికారిగా ఎన్.లక్ష్మీనారాయణ శాస్ర్తీని నియమించారు. దీంతో మూడు దశాబ్దాలుగా పాడేరు పట్టణవాసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఆలయ పగ్గాలు ఇకపై దేవాదాయ శాఖ చేతికి చిక్కాయి. దేవాదాయ శాఖ ఆధీనంలోకి అమ్మవారి ఆలయం వెళ్లడంతో ఇకపై ఈ ఆలయంపై హక్కులను స్థానికులు కోల్పోవడమే కాకుండా దీని నిర్వహణ బాధ్యత ప్రభుత్వపరంగా జరగనుంది. దీంతో గిరిజన మంత్రి తీసుకున్న నిర్ణయంపై పట్టణ వాసులలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూ ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. దేవాదాయ శాఖ ఆధీనంలో నుంచి అమ్మవారి ఆలయాన్ని తప్పించి దీనిని కాపాడుకునేందుకు ఎంతటికైనా సిద్ధం కావాలని రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారు భావిస్తున్నారు. గిరిజన, గిరిజనేతరుల ఇంటి ఇలవేల్పు, మన్యం ఆరాధ్య దేవతగా ఖ్యాతి గాంచిన మోదకొండమ్మ అమ్మవారి ఆలయాన్ని 1984వ సంవత్సరంలో పాడేరులో నిర్మించారు. 1984 నుంచి ఇంతవరకు ఈ ఆలయ నిర్వహణ బాధ్యతను స్థానికులే చేపడుతూ దూపదీప నైవేద్యాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. పాడేరు శాసనసభ్యుడిగా ఎన్నికైన వారు అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించాలని, పట్టణానికి చెందిన వారు ప్రధాన కార్యదర్శి, ఇతర కమిటీ పదవులను చేపట్టాలని అప్పటిలోనే తీర్మానించారు. దీనిప్రకారం శాసనసభ్యుడుగా ఉన్నవారు మోదకొండమ్మ అమ్మవారి ఆలయానికి చైర్మన్‌గా వ్యవహరిస్తూ పట్టణంలోని మిగిలిన వారు కమిటీ సభ్యులుగా ఉంటూ ఆలయాన్ని దినదినాభివృద్ధి చేస్తూ ఖ్యాతిని తీసుకువచ్చారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం మే నెలలో మూడు రోజుల పాటు మోదకొండమ్మ జాతరను అత్యంత ఘనంగా నిర్వహిస్తుండడం కూడా ఆనవాయితీగా వస్తోంది. గిరిజన జాతరలలోనే పాడేరులో నిర్వహిస్తున్న మోదకొండమ్మ అమ్మవారి జాతర రాష్ట్రంలోనే ద్వితీయ స్థానాన్ని సంపాదించుకుంది. మన్యానికి తలమానికంగా నిలిచిన పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఆలయం ఎంతో విశిష్టతను, మరెంతో ప్రత్యేకతను సంపాదించుకున్నదనే చెప్పాలి. అమ్మవారిపై ఉన్న భక్తి విశ్వాసాలతో రాష్ట్రం నలుమూలల నుంచి కూడా భక్తుల తాకిడి పెరుగుతూ వచ్చింది. ఎంతో ప్రఖ్యాతిగాంచిన అమ్మవారి ఆలయంపై ఇంతవరకు సర్వహక్కులు కలిగిన స్థానికులు మోదకొండమ్మ పట్ల అంతే భక్తి విశ్వాసాలను కనబరుస్తూ తమ ఆస్తిగా కాపాడుకుంటూ వచ్చారు. ఈ తరుణంలో మోదకొండమ్మ అమ్మవారి ఆలయాన్ని దేవాదాయ శాఖకు అప్పగిస్తూ మంత్రి బాలరాజు తీసుకున్న నిర్ణయంపై పాడేరు పట్టణ వాసులలో ఆందోళన చెలరేగుతోంది. మంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించి అమ్మవారి ఆలయాన్ని కాపాడుకోవాలని పలు రాజకీయ పార్టీలు, ప్రజా, వ్యాపార సంఘాల నాయకులు, పట్టణ వాసులు నిర్ణయించారు. దేవాదాయ శాఖ ఆధీనంలో అమ్మవారి ఆలయం ఉంటే దీనిపై పూర్తి అజమాయిషీని తాము కోల్పోవలసి వస్తోందని, దీంతో అమ్మవారి ఆలయ చరిత్ర కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మంత్రి బాలరాజు కుటిల రాజకీయాన్ని అమ్మవారి ఆలయ విషయంలో కూడా ప్రయోగించి స్థానికుల మనోభావాలను దెబ్బతీశారని పలువురు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాడేరు పట్టణ బంద్‌ను చేపట్టి నిరసన ర్యాలీలు, ధర్నా వంటి కార్యక్రమాలను నిర్వహించాలని పట్టణ వాసులు తీర్మానించారు. ఈ మేరకు ఈ నెల 19వ తేదీ బ
* పాడేరులో చెలరేగుతున్న వివాదం * ఆందోళన బాటలో రాజకీయ, ప్రజా సంఘాలు * మంత్రి బాలరాజుపై స్థానికుల నిప్పులు
english title:
d
Date:
Wednesday, February 19, 2014