
మచిలీపట్నం, ఫిబ్రవరి 19: ఆధ్యాత్మిక కేంద్రమైన మచిలీపట్నంలో భోళాశంకరుడి భారీ విగ్రహం రూపుదిద్దుకుంటోంది. 35 అడుగుల ఎతె్తైన పరమేశ్వరుని విగ్రహాన్ని ఈ నెల 24న ఆవిష్కరించనున్నారు. పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యానృసింహ భారతీస్వామి చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఏడు అడుగుల పీఠంపై ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠించనున్నారు. జ్యోతిర్లింగాల వెనుక భాగంలో ఆయా ఆలయాల నమూనాను ఏర్పాటు చేశారు. పీఠంపై 28 అడుగుల ఎత్తులో ధ్యానముద్రలో ఉన్న పరమశివుడిని రూపొందించారు. మచిలీపట్నం రాబర్టుసన్‌పేట శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో సువిశాలమైన ప్రాంగణంలో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఈ భారీ విగ్రహాన్ని పట్టణానికి చెందిన కళాకారులే తయారు చేయడం విశేషం. సుమారు ఆరు నెలల కఠోర దీక్షతో కళాకారులు విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఈ స్థాయి విగ్రహం రాష్ట్రంలో మరెక్కడా లేదు.
35 అడుగుల పరమశివుని విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్న కళాకారులు