హైదరాబాద్, ఫిబ్రవరి 19: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నగర శివార్లలోని నాగోలులోని శ్రీ కాశీవిశే్వశ్వరాలయంలో ఈ నెల 26వ తేదీ నుంచి ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పీఠం సహాయ కార్యదర్శి ముదిగొండ చంద్రశేఖర్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. 28వ తేదీ వరకు మూడురోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 26న ఉదయం విఘ్నేశ్వరపూజ, గోపూజ, కలశస్థాపన సాయంత్రం శైవాగ్ని ప్రతిష్ఠ, రుద్రహోమం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు, అలాగే మరుసటి రోజైన 27న ఉదయం నుంచి స్వామివారికి అభిషేకము, అర్చనలు, సాయంత్రం రుద్రహోమం, పూర్ణాహుతి, గణార్చన, రాత్రి శివకల్యాణం కార్యక్రమం అనంతరం లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ వార విశేష గోక్షీరాభిషేకం, 28వ తేదీన ఉదయం స్వామి వారికి ఊరేగింపు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ప్రధాన కార్యదర్శి ములుగు హనుంతరావు, కోశాధికారి కొంపల్ల శంకర్‌రావు తెలియజేశారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నగర శివార్లలోని నాగోలులోని శ్రీ కాశీవిశే్వశ్వరాలయంలో ఈ
english title:
s
Date:
Thursday, February 20, 2014