హైదరాబాద్, ఫిబ్రవరి 19: ఎన్నికల విధులను నిర్వహించే ఉద్యోగుల డేటాను ఈనెల 22లోగా సమర్పించాలని తహశీల్దారులను రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంవిరెడ్డి ఆదేశించారు. బుధవారం సిపిఓ కార్యాలయం నుండి తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండల పరిధిలో గల కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వేతర సంస్థల్లో అన్నిస్థాయిల్లో పనిచేస్తున్న సిబ్బంది డాటాను 27 కాలముల ఫార్మెట్‌లో పంపించాలని ఆదేశించారు. ప్రైవేటు విద్యాసంస్థలు, యూనివర్సిటీ, పరిశోధన కేంద్రాలు, బ్యాంకులు, ఎల్‌ఐసి ఇతర సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను సేకరించి పంపించాలని సూచించారు. ఎన్నికలు నిర్వహించేందుకు 35వేల మంది సిబ్బంది అవసరముంటుందని తెలిపారు. సమావేశంలో ఎన్‌సిఎల్‌పి పిడి సుధాకర్‌రెడ్డి, డిఇఓ సోమిరెడ్డి, డిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఉన్నారు.
ఎస్సీ, ఎస్టీ చిన్నకారు రైతులకు
వౌలిక సదుపాయాలు కల్పించాలి
జిల్లాలోని 7401 ఎకరాల అసైన్డ్ భూమిని ఉమ్మడి వ్యవసాయ సంఘాల కిందకుతెచ్చి ఎస్సీ, ఎస్టీలకు చెందిన చిన్నకారు సన్నకారు రైతులకు వౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంవి రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సహకార శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో డిసిఓ సిహెచ్ బాలరాజు, తూర్పు డివిజనల్ సిఓ శ్రీనివాస్, డ్వామా ఎపిడి సంధ్యారాణి ఉన్నారు.
నష్టపోయిన రైతులకు రూ.26కోట్ల ప్రతిపాదనలు
ఖరీఫ్‌లో పైలిన్ తుఫాన్, అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సంబంధించి నష్టపరిహారం నిమిత్తం 26కోట్ల రూపాయలతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామని, ప్రభుత్వం నుండి నిధులు విడుదల అయిన అనంతరం రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు. బుధవారం డయల్ యువర్ అధికారి కార్యక్రమంలో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి అంశాలపై జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు.
ఎన్నికల విధులను నిర్వహించే ఉద్యోగుల డేటాను ఈనెల 22లోగా సమర్పించాలని తహశీల్దారులను రంగారెడ్డి
english title:
y
Date:
Thursday, February 20, 2014