ఏలూరు, ఫిబ్రవరి 24 : ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో అనుసరించే చర్యలపై త్వరలో మాక్ డ్రిల్ నిర్వహిస్తామని సంబంధిత అన్ని శాఖలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు అన్నారు. స్థానిక జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా ప్రకృతి వైపరీత్యాల నివారణ నిర్వహణ కమిటీ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖలు తీసుకోవలసిన ముందస్తు చర్యల గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబూరావునాయుడు మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల పైలిన్, హెలెన్ తుఫాన్ల సమయంలో జిల్లా యంత్రాంగం చేపట్టిన ప్రణాళికాబద్ధమైన చర్యల వల్ల చాలా వరకు నష్టాలను నివారించగలిగామని, జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్‌జైన్ నరసాపురం నుండి పర్యవేక్షిస్తూ సమయానికి అనుగుణంగా సలహాలు, సూచనలను అధికార యంత్రాంగానికి అందించడం వల్ల నష్టాల నుండి బయట పడగలిగామన్నారు. గత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంతాల్లో తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలు గురించి అధికారులు ఇప్పటి నుండే సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ఇటువంటి సమయాల్లో సమాచార వ్యవస్థ కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకోవాలని ఇందుకు సంబంధించిన వైర్‌లెస్ సెట్లు, ఇతర ప్రసార సాధనాలకు అవసరమైన మరమ్మత్తులు చేపట్టి సిద్దంగా ఉంచుకోవాలన్నారు. రోడ్లు, భవనాల శాఖ అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే ఎలక్ట్రికల్ రంపాలు, ఉడ్ కట్టర్స్ అవసరమైనప్పుడు ఉపయోగపడే విధంగా చూసుకోవాలన్నారు.
జెసి
english title:
p
Date:
Tuesday, February 25, 2014